తెలంగాణ

‘రోస్టర్ విధానం మార్చనిదే వికలాంగులకు ఉద్యోగాలు రావు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: దుర్బర అసమానతలను ఎదుర్కొంటున్న వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అందుకు అనుగుణంగా వికలాంగులకు రోస్టర్ పాయింట్‌లను 10లోపు మార్చాలని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. రోస్టర్ విధానం మార్చనిదే వికలాంగులకు ఉద్యోగాలు రావని కోదండరామ్ అన్నారు. సోమవారం నాడు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విద్యార్ధి విభాగం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల రోస్టర్ పాయింట్లు పదిలోపు మార్చాలనే అంశంపై ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్సు కాలేజీలో నిర్వహించిన సదస్సుకు కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ వికలాంగులు ఏదో జన్మలో చేసుకున్న పాపం వల్ల వికలాంగులుగా పుట్టలేదని పాలకుల నిర్లక్ష్యం వల్లనే వికలాంగులుగా పుడుతున్నారని అన్నారు. అందుకు ప్రభుత్వం బాధ్యత వహించి వికలాంగులకు చేయూత నిచ్చి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు.

పోస్టుమార్టమ్ టేపులను
ఎయిమ్స్‌కు పంపండి
తాడ్వాయి ఎన్‌కౌంటర్ కేసులో హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: వరంగల్ జిల్లా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌ల పోస్టుమార్టమ్‌ను చిత్రీకరించిన వీడియో టేపులను లోతుగా పరిశీలించి పరీక్షించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపి నివేదిక తెప్పించాలని హైకోర్టు మంగళవారం దర్యాప్తు అధికారిని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పౌర హక్కుల సంఘం ప్రతినిధి చిలకా చంద్రశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. మూడు వారాల్లోగా నివేదికను ఎయిమ్స్ నుండి తెప్పించి, వారంలోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌కౌంటర్‌ను దర్యాప్తు చేస్తున్న అధికారిని ఆదేశించారు.
ఖేడ్ ఎమ్మెల్యేకు
కెసిఆర్ అభినందన
క్యాంప్ ఆఫీస్‌లో కలిసిన భూపాల్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు. గెలుపొందిన అభ్యర్ధి భూపాల్‌రెడ్డితో పాటు మంత్రి టి హరీశ్‌రావు, ఎంపి బిబి పాటిల్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల భూపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. నారాయణఖేడ్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి అమితంగా కృషి చేసిన మంత్రి హరీశ్‌రావును కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద
సబ్‌వే నిర్మాణం

రికార్డు స్థాయలో 4.10 గంటల్లో పనులు పూర్తి
భారతీయ రైల్వే చరిత్రలో తొలి ప్రయోగం విజయవంతం

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 16: కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రికార్డు సమయంలో తక్కువ ఎత్తు సబ్‌వే నిర్మించి రైల్వే అధికారులు ఘనత చాటారు. మామూలుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో రోడ్ అండర్ బ్రిడ్జిలు, అండర్ పాత్ వేలు నిర్మిస్తుంటారు. అలాగే గ్రామాల మధ్య నుంచి రైల్వే లైన్లు వేసినప్పుడు అక్కడ అండర్ బ్రిడ్జిలు, లిమిటెడ్ హైట్ సబ్ వేలు ఏర్పాటు చేస్తుంటారు. మానవ రహిత రైల్వే గేట్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు భారతీయ రైల్వేలోని వాల్తేరు డివిజన్ సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. కేవలం నాలుగు గంటల 10 నిముషాల్లో రైల్వే ట్రాక్ కింద లిమిటెడ్ హైట్ (తక్కువ ఎత్తు) సబ్ వేని నిర్మించి సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా నాలుగున్నర గంటలపాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత వాల్తేరు డివిజన్ అధికారులకే దక్కింది. వాల్తేరు డివిజన్‌లోని హౌరా-చెన్నై రైలు మార్గం అంటే చాలా బిజీగా ఉంటుంది. ప్రతి ఐదు నిముషాలకు ఒక రైలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటుంది. ఇంతటి బిజీ మార్గంలో మంగళవారం నాలుగున్నర గంటల సమయం రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి-తిలారు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న మూడు మానవ రహిత రైల్వే గేట్ల వద్ద మూడు లిమిటెడ్ హైట్ సబ్‌వేలు నిర్మించాలని నిర్ణయించిన అధికారులు తొలి సబ్‌వేని మంగళవారం నాలుగు గంటల 30 నిముషాల్లో నిర్మించడానికి సన్నాహాలు చేసుకున్నారు. 200 మంది సిబ్బంది, రెండు భారీ క్రేన్‌లు, ఎక్స్‌కవేటర్లు, ఇతర సామగ్రితో, సాంకేతిక అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. సబ్ వే నిర్మించాల్సిన ప్రదేశాన్ని ఎక్స్‌కవేటర్ల సాయంతో తవ్వి, ముందుగా తయారు చేసి తీసుకెళ్లిన సిమెంట్ బ్లాక్స్‌లను అక్కడ అమర్చారు. కేవలం రెండు గంటల వ్యవధిలో సబ్‌వే తయారైపోయింది. ఓపక్క ఈ పని జరుగుతుండగా, తొలగించిన పట్టాలను తిరిగి యథాతథంగా అమర్చేశారు. 20 నిముషాలు ముందే ఈ పని పూర్తి చేయగలిగారు.