తెలంగాణ

ఆత్మహత్యలు లేని రాష్టమ్రే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరి జలాలు తెచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తా
సాగునీరు, విద్యుత్ ఉంటే రైతుకు కష్టాలు ఉండవు
భూసేకరణకు రైతులు సహకారం అందించాలి
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, డిసెంబర్ 24: ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా నిర్మించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని.. రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, సబ్సిడీపై రాయితీ యంత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి నీళ్లు కాల్వలతో తెచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తానని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాగునీటి రంగానికి పెద్దపీట వేశామన్నారు. సాగునీటి రంగానికి 25వేల కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. 1021కోట్లతో 17లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తున్నామన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత పనులు చేపట్టి సాగునీటికి పనులు చేపట్టామన్నారు. రైతులకు విద్యుత్, సాగునీరు ఉంటే రైతుల కష్టాలు దూరమై తెలంగాణ అంతా బంగారం అవుతుందన్నారు. రైతులకు 9గం. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 10కోట్లతో విద్యుత్‌రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. 2ఏండ్లలో గోదావరి నీరు తెచ్చి సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం అందరు సహకరించాలన్నారు. రైతులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తామని, భూసేకరణకు అందరు సహకరించాలన్నారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. హరితహారం సైతం ప్రభుత్వ సంక్షేమం కోసమే చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని రైతులకష్టాలు, కన్భీళ్లు తుడిచేందుకే కృషి చేస్తుందన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రనుత్వం పరిహారం అందిస్తుందన్నారు. రైతులు పత్తికి బదలుగా ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించి కూరగాయల పెంచాలన్నారు. పాలీహౌస్‌పై ప్రభుత్వం 75శాతం సబ్సిడి అందిస్తుందన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లు వినియోగం వల్ల రైతులకు మరింత లాభం కలుగుతుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేసి లబ్ధిపొందాలన్నారు. ఉద్యానవన, వ్యవసాయాధికారులు ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు వ్యవసాయ భూమికి ఉపాధిహామి కింద క్రంచ్ చేయించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు.
ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజింగ్ పథకం ద్వారా రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తారన్నారు. స్ప్రింక్లర్ల మీద 90శాతం సబ్సిడీ ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్దతుల ద్వారా సాగు చేసి లబ్ధిపొందాలన్నారు. కూరగాయలు, పూలతోటల మీద దృష్టి పెడితే అధికలాభాలు ఉన్నాయన్నారు. నిత్యం రాష్ట్రం పూలను కర్ణాటక, తమిళనాడు నుంచి దిగుమతి చేస్తున్నామని, మనమే సాగు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అనంతరం పంటనష్టపోయిన రైతులకు చెక్కులను మంత్రి హరీష్‌రావు, ఎంపి ప్రభాకర్‌రెడ్డి అందించారు. అనంతరం సబ్సిడి పై ఉన్న తొట్టిలు, స్ప్రేయర్లు, యంత్రాలను రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యాదయ్య, జడ్పిటిసి వజ్రవ్వ, హార్టికల్చర్ ఏడిలు సురేష్, రామలక్ష్మి పాల్గొన్నారు.