ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడిలో భారీగా బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో విజయవాడలోని దుర్గగుడిలో బదిలీల పర్వం ప్రారంభమైంది. ఆగస్టులో పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణల కారణంగా ఇఇ, డిఇతో పాటు అయిదుగురు ఎఇలను బదిలీ చేశారు. అయిదుగురు అసిస్టెంట్ ఇవోలకు, 12 మంది సూపరింటెండెంట్లకు, అయిదుగురు అర్చకులకు స్థానచలనం కలిగింది. ఒకేసారి మొత్తం 36 మందిపై బదిలీ వేటు పడడంతో ఆలయ వ్యవహారాలు ఇక చక్కబడతాయని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దుర్గగుడితో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన ఆలయాల్లోనూ ఆరోపణలున్న ఉద్యోగులను బదిలీలు చేశారు.