తెలంగాణ

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అక్రమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టిఆర్‌ఎస్ పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, దానం నాగేందర్ తదితరులు శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. లక్షలాది ఓట్లను తొలగించిన అధికారులు ఇంతవరకు ఎన్ని ఓట్లను పునరుద్ధరించారో సమాచారం లేదని, వార్డుల విభజన, రిజర్వేషన్ల వ్యవహారం ఏకపక్షంగా జరుగుతుందని వారు ఆరోపించారు. నగరంలో వేలాది హోర్డింగ్‌లు పెట్టినా టిఆర్‌ఎస్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. కాగా, ఎన్నికల ప్రక్రియను వారం రోజులకు కుదించేందుకు ఆదేశాలు జారీ చేసిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడుతోందని బిజెపి నేతలు కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.