తెలంగాణ

జనంపైకి దూసుకొచ్చిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురు దుర్మరణం

తాగిన మైకంలో లారీ డ్రైవర్ చితకబాదిన జనం

మక్తల్, డిసెంబర్ 29: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ గ్రామంలో ఘోరం జరిగింది. తప్పతాగిన లారీ డ్రైవర్ లారీని అదుపుచేయలేక జనంపైకి తీసుకెళ్లాడు. ఈ సంఘటనతో ఏకం గా నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మంగళవారం మక్తల్ పట్టణంలో సాయంత్రం 5-30 గంటల సమయంలో ఒక్కసారిగా జనం అరుపులు కేకలు వేస్తూ రోడ్డువెంట పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే మక్తల్ పట్టణంలోని నల్లాజనామ్మ అమ్మవారి ఆలయం ముందు లారీ డ్రైవర్ తాగి న మెకంలో లారీని అతివేగంగా తీసుకురావడంతో ఊట్కూర్ మండలం ఎడివెల్లి గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్ (18), నర్మద (16) ద్విచక్ర వాహనంపై మక్తల్‌కు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందా రు. బిజ్వార్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త అశ్విని (32) మక్తల్‌లోని ఐసిడిఎస్ కార్యాలయం నుండి మక్తల్ బస్టాండ్ వైపు వెళ్తుండగా ఆమెపై లారీ దూసుకెళ్లడంతో లారీ కింద ఇరుక్కుంది. మక్తల్ మండలం కాచావార్ గ్రామానికి చెందిన టాటాఎసి డ్రైవర్ అంజప్ప (30), బాలప్ప ఇద్దరూ తన వాహనంలో వస్తుండడంతో వారిని సైతం లారీ ఢీకొట్టడంతో అంజప్ప అక్కడికక్కడే మృతి చెందగా బాలప్ప ఎడమచేయి విరిగిపోయింది. ఆయనకు ప్రథమ చికిత్స చేయించి ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా డిండికి చెందిన లారీ డ్రైవర్ జితేందర్‌రెడ్డికి సైతం గాయాలు కావడంతో ఆయనను ప్రథమ చికిత్స నిర్వహించి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై జరిగిన సంఘటనను బొం బాయి రాజు అనే వ్యక్తి ఎస్సై మురళీగౌడ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అం దించడంతో జెసిబి, తమ సిబ్బందితో ఎస్సై మురళీగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న జడ్పీటిసి వాకిటి శ్రీహరి, చందాపురం చం ద్రశేఖర్ రజకవాడ యువకులు, పోలీ సు సిబ్బంది రోడ్డుపై పడిఉన్న పిండి బస్తాలను తొలగించారు. లారీ కింద బిక్కుబిక్కుమంటూ ప్రాణాలతో ఉన్న అశ్వినిని జెసిబి సహాయంతో తీసినప్పటికీ అమె సైతం తన నిండు ప్రాణాన్ని వదిలేసింది. 108 సిబ్బంది వాహనంలో మృతదేహాలతోపాటు లారీ డ్రైవర్, బా లప్పలను చికిత్స నిమిత్తం ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు పార్వతి ఆధ్వర్యంలో వైద్యులుగా యాలైన వారికి చికిత్స నిర్వహించారు.