తెలంగాణ

ఫ్లోర్ లీడర్ పదవి ఉండేనా..ఊడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ తెలుగు దేశం పార్టీకి కష్టకాలం వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఇటువంటి ఆటుపోట్లను ఎన్నో తట్టుకుని నిలబడిందని, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలాఉండగా టి.టిడిపి శాసనసభాపక్షం నాయకునిగా మొన్నటి వరకు ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంతో, ఆ స్థానంలో ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నియమించారు. అయితే రేవంత్ రెడ్డి పదవి ప్రమాదం అంచున ఉంది. ఏ క్షణంలో ఆ పదవి ఊడిపోతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభాపక్షం నాయకుని (్ఫ్లర్ లీడర్)గా ఉండేందుకు, స్పీకర్ గుర్తించేందుకు ఏ పార్టీకైనా ఐదుగురికి తగ్గకుండా ఎమ్మెల్యేలు ఉండాలి. అప్పుడే ఆ పార్టీ పక్షం నాయకున్ని ఫ్లోర్ లీడర్‌గా గుర్తిస్తారు. కాగా టిడిపి నుంచి ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయించినందున ఇక ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుంది. ఆ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు పార్టీ వీడినా, రేవంత్ రెడ్డి ఆ పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ పార్టీ వీడరని ఆ పార్టీ సీనియర్ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పార్టీ వీడినా రేవంత్‌కు పోయేది శాసనసభాపక్షం నాయకుని హోదానే కదా? అని అంటున్నారు.
శాసనసభాపక్షం నాయకుని హోదానే కదా! అని తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభాపక్షం నాయకుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. సమావేశాల సమయంలో ఏదైనా ఇబ్బందికరమైన సమస్య తలెత్తినప్పుడు సభాధ్యక్ష స్థానంలో ఉండే స్పీకర్ అన్ని పార్టీల శాసనసభాపక్షం నాయకుల సలహాలు తీసుకుంటారు. అంతేకాకుండా పార్టీల బలాబలాల ప్రకారం ఆయా పార్టీలకు సమావేశాల్లో వివిధ అంశాలపై మాట్లాడేందుకు స్పీకర్ సమయం కేటాయిస్తారు.
ఆఫీసు ఖాళీ చేయాల్సి ఉంటుంది
అసెంబ్లీ ఆవరణలో పాలక, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు పార్టీ లెజిస్లేచర్ కార్యాలయాలు ఉంటాయి. ఐదుగురు ఎమ్మెల్యేలకు తగ్గకుండా ఉన్న పార్టీలకే కార్యాలయాలు కేటాయిస్తారు. వామపక్షాలకు అసెంబ్లీ ఆవరణలో పార్టీ లెజిస్లేచర్ కార్యాలయాలు లేవు. శాసనసభాపక్షంగా గుర్తింపు పొందిన పార్టీ నేతకు పర్సనల్ అసిస్టెంట్‌ను, కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని, ఫోను, ఇతరత్రా సౌకర్యాలను అసెంబ్లీ అధికారులే కల్పిస్తారు. ఐదుకు ఒక్కరు తగ్గినా కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.