తెలంగాణ

ఫిబ్రవరిలో ఎఫ్‌సిఐ పునరుద్ధరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 22: దక్షణాది రాష్ట్రాల రైతులకు సరిపడే ఎరువులను అందించేందుకే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేపట్టి పనులు ప్రారంభిస్తున్నామని కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహెర్ అన్నారు. ఇందుకోసం ప్రధాని ఫిబ్రవరి రెండవ వారంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సందర్శించిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుండి ఉత్పత్తి అయ్యే యూరియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్దనే బొగ్గు ఆధారితంగా యూరియా ఉత్పత్తులు జరిపే యూనిట్‌ను నెలకొలిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సింగరేణి సంస్థ, లేదా కోల్ ఇండియాతోనైనా జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేస్తామని అన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల వరకు యూరియా ధరలను పెంచబోమని తెలిపారు. రైతులకు తక్కువ ధరలో ఎరువులను అందించేందుకు చెత్తనుండి ఎరువుల తయారు చేసే ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు మూడురోజుల క్రితమే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో గ్యాస్ ఆధారితంగా యూరియా ఉత్పత్తి జరిపేందుకు రాజమండ్రి నుండి పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, దీనికి సంబంధించిన ఒప్పందం కూడా త్వరలోనే కుదరనుందని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎఫ్‌సిఐ జియం మల్లేశ్వరితో పాటు ఎన్‌ఎఫ్‌ఎల్, ఇంజనీర్స్ ఇండియా అధికారులు, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణా రెడ్డి, బల్మురి వణిత, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు పాల్గొన్నారు.