ఈ వారం తార

క్రేజీ భామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల తార అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి రోజురోజుకూ తన క్రేజ్‌ని పెంచుకుంటూ పోతోంది. చేసిన చిత్రాలు.. వేసిన పాత్రలు వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటోంది. ఫలితంగానే అతి తక్కువ సమయంలో ఎనలేని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. చిన్నా.. పెద్దా అన్న తేడాలేకుండా వచ్చిన అవకాశాల్లో మంచివి అనుకున్నవి.. క్యారెక్టర్ పరంగా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టే పాత్రలనే ఎంచుకుంటూ తనకు సాటి మరొకరు లేరనే విధంగా కెరీర్‌లో దూసుకెళుతోంది. ఇటీవల కలిసినప్పుడు ఎలా వుంది కెరీర్ అని అనుపమను కదిలిస్తే- ‘‘హాయిగా.. అలా అలా సాగిపోతోంది. నాకు వచ్చిన అవకాశాల్లో మంచివి అనుకున్నవి మాత్రమే ఓకే చేసుకుంటూ కెరీర్‌లో ముందడుగు వేస్తున్నాను. నేను చేసిన పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు నేను ఎన్నటికీ మరచిపోలేదు. వారి ఆదరణతోనే మరిన్ని మంచి పాత్రలు.. మంచి చిత్రాలు చేసే అవకాశం లభిస్తోంది. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? నేను ఎవరికీ పోటీ కాదు. నాకు ఎవరూ పోటీరారు. నాదారి నాదే. తెలుగు ప్రేక్షకులు మెచ్చుకునే.. చిరస్థాయిగా వారి హృదయాల్లో నిలిచే పాత్రలు చేయాలనుంది. అలా అని గ్లామర్ పాత్రలకు నో అని ఏం చెప్పను. అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే నటిగా సంతృప్తిపడగలం. రొటీన్ పాత్రల్నే చేసుకుంటూ పోతే కెరీర్‌లో ముందుకు వెళ్లలేం. ఎక్కడికెళ్లినా చాలా మంది అడుగుతున్నారు? గ్లామర్ పాత్రలు చేయరా.. అని? నేను ఒకటే చెబుతున్నాను. మేం పోషించే పాత్రలను విభజించి చూడొద్దని. గ్లామర్.. వైవిధ్యం అంటూ పోతే కెరీర్‌లో నిలదొక్కుకోలేం. అవకాశం వచ్చిన అది ఏ పాత్ర అయినా.. మనస్సుకు నచ్చితే వెంటనే ఒప్పేసుకోవాలి. అలాంటప్పుడే తారకు గుర్తింపు.. క్రేజ్ లభిస్తాయి’’అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది. దటీజ్.. అనుపమ!