ఈ వారం తార

క్రేజీ కీర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగతా హీరోయిన్లలాగా తెరమీద గ్లామర్‌గా కన్పించడం అందాల నటి కీర్తి సురేష్‌కు నచ్చదట. తన శరీరాకృతి దానికి సరిపోదని ఆమె అభిప్రాయం. ‘‘నేను నిండుగా ఉంటేనే అందంగా కనిపిస్తాను. నా అభిమానులకు, ప్రేక్షకులకు కూడా నేను అలా ఉండడమే ఇష్టం. మోడ్రన్ డ్రెస్సుల కన్నా నాకు చీరలంటేనే ఎక్కువ ఇష్టం. నటన విషయంలో నాకు ఆదర్శం ఎవరూ లేరు. సినిమా ఫ్యామిలీ నుండి వచ్చాను. అమ్మ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను. నటనాపరంగా చూస్తే నాకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటన అంటే చాలా ఇష్టం. సినిమాల విషయంలో కానీ, క్యారెక్టర్ల పరంగా కానీ ఆమె చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయరేమో అనిపిస్తుంది. నాకూ అలాంటి ప్రయోగాలంటే ఇష్టమే కానీ దానికి ఇంకా టైముంది. నటనలో కొంత అనుభవం వచ్చాక అలాంటి ప్రయోగాలు చేస్తాను. కథల ఎంపిక విషయంలో మా పేరెంట్స్ ఇప్పుడు పూర్తిగా నాకే వదిలేశారు. కథ విన్న వెంటనే ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకుంటాను. కరెక్టుగా సరిపోతాను అనిపిస్తేనే ఓకె చెబుతాను. నన్ను వెతుక్కుంటూ వచ్చేవే నా దృష్టిలో నా డ్రీమ్‌రోల్స్. నేను సినిమా వాతావరణం నుంచి రావడంతో ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. ఇటీవల నా స్టయల్‌ని కొద్దిగా మార్చుకున్నాను. కొత్త లుక్‌తో ట్రై చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన వచ్చి నన్ను నేను కొద్దిగా మార్చుకున్నాను. మార్పు నచ్చకపోతే కొందరు కటువుగా విమర్శించారు. వారి మాటలు నన్ను బాధించాయి. ఇంతవరకు నేను నటించిన సినిమాలో ఏ హీరోతోనూ ఇబ్బంది పడలేదు, వారిని ఇబ్బంది పెట్టలేదు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత వుంటుంది’’ అని అంటోంది కీర్తి!