ఈ వారం తార

మిల్క్‌బ్యూటీకి తప్పలేదట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో ఆస్కార్ రేంజ్ ఫిలిం మేకర్ హార్వే విన్‌స్టీన్ ఏకంగా 40 మంది కథానాయికల్ని లైంగికంగా వేధించాడన్న వార్త విని ప్రపంచం విస్తుపోయింది. అలాంటి దుర్మార్గులు ఇంకా ఎందరో సినీ పరిశ్రమల్లో వున్నారన్న నిజం తెలిస్తే మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం. అంతెందుకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ ప్రహసనం యథేచ్చగా సాగేదేనని మన కథానాయికలే లీక్ చేసేస్తున్నారు. ఇటీవలే కొందరు మృగాళ్లు తన కెరీర్ ఆరంభంలో లైంగికంగా వేధించారని.. తన జీవితంతో ఆటాడుకున్నారని వ్యాఖ్యానించి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంచలనం సృష్టించిన సంగతి మర్చిపోలేం. ఆ కోవలోనే ప్రస్తుతం నాయికలపై లైంగిక వేధింపుల అంశంపై ఆసక్తికర డిబేట్ సాగుతోంది. కేట్ విన్‌స్లెట్, యాంజెలీనా.. నుంచి ఐశ్వర్యారాయ్ వరకూ లైంగిక వేధింపుల బాధితులే. కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా, వరలక్ష్మి శరత్‌కుమార్.. ఒకటరేమిటి వేధింపులు ఎదుర్కోని వారున్నారా? ఇప్పటి స్టార్ హీరోయిన్లు ఒకప్పటి అప్‌కమింగ్ నాయికలే కదా.. వేధింపులు ఎదుర్కోకుండా వుంటారా? అంటూ ఒక ఆసక్తికర డిబేట్ పరిశ్రమలో నడుస్తోంది. కొందరు ‘అబ్బెబ్బే.. అలాంటిదేం లేద’ని డిప్లమాటిక్ ఆన్సర్ ఇస్తున్నా.. మరికొందరు మాత్రం బరస్ట్ అవుతున్నారు. వేధింపుల వ్యవహారాన్ని బయట పెట్టేస్తున్నారు.
తాజాగా ఇలాంటి వేధింపులు మీక్కూడా ఎదురయ్యాయా? అన్న ప్రశ్నకు మిల్కీ బ్యూటీ తమన్నా సమాధానాన్ని దాటవేసింది. అలాంటివి తనకు ఎదురుకాలేదని, ఆ విషయంలో అదృష్టవంతురాలినని చెప్పింది. అయితే అవకాశాల కోసం ప్రయత్నించే నవతరం నటీమణులకు ఆ ఇబ్బంది తప్పనిసరి అని, వేధింపులు ఎదుర్కోవాల్సిందే అని కామెంట్ చేసింది. తమిళనాడులో ‘స్కెచ్’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న మిల్కీ పై విధంగా కామెంట్ చేయడం సంచలనమైంది.