ఈ వారం తార

రహస్య వివాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోలను వదలడంలేదు. అలాగే గత కొన్ని రోజులుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న నయన, రహస్యంగా వివాహం చేసుకున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు జోరందుకున్నాయి. ఇటీవలే వీరిద్దరూ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. గతంలో కూడా నయనతార పెళ్లిచేసుకుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఇదివరకే కొట్టిపారేసింది. మరోసారి పెళ్లి వార్తలు రావడంతో నయనతార ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘జై సింహ’, చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలతోపాటు తమిళంలో మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది.
*