మెయిన్ ఫీచర్
థగ్స్.. చైనా స్ట్రాటజీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
**బాలీవుడ్ సహా సినీ భారతం మొత్తం మిడిగుడ్లేసుకుని ఎదురు చూస్తున్న చిత్రం -్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. భారతీయ సినిమా ప్రమాణాలను ఏమాత్రం దిగజార్చకుండా -వినోద వినిమయ వ్యాపారాన్ని హాలీవుడ్ సరసకు తీసుకెళ్లనున్న చిత్రంగా ఇప్పటికే అంచనాలున్నాయి. నిజానికి హాలీవుడ్ మార్కెట్ స్థాయిని అనుసరించడానికి ఇప్పుడిప్పుడే భారతీయ చిత్రాలు ప్రయత్నాలు మొదలెట్టాయి. ప్రాజెక్టుల బడ్జెట్ పరిధిని అంతకంతకూ విస్తరిస్తూ -అదే తరహాలో ప్రపంచవ్యాప్త మార్కెట్‌లో బలమైన వాటాకోసం గట్టిగానే పట్టుపడుతున్నాయి. అలా భారతీయ సినిమా వేస్తున్న పిల్ల అడుగుల్లో బలమైన పెద్ద అడుగే -్థగ్స్ ఆఫ్ హిందుస్థాన్.**
==========================================
కొనే్నళ్ల క్రితం వరకూ ఓవర్సీస్ బిజినెస్ -ఆ ప్రాజెక్టు ఘనత చెప్పుకోడానికి ఉపకరించే సాధనం. కాలక్రమంలో హీరోల మార్కెట్ విస్తృతి కోసమే -ఓవర్సీస్ కలెక్షన్లు ప్రమాణమయ్యాయి. మారుతున్న వ్యాపార పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు -ఓవర్సీస్ కలెక్షన్లు పూర్తిగా వ్యాపారాత్మకం. చాలాకాలం వరకూ ఓవర్సీస్ అనగానే -యూఎస్ లెక్కల్నే చూసేవాళ్లం. అక్కడ ఎన్ని థియేటర్లలో సినిమా విడుదలైంది? ఎంత కలెక్ట్ చేసిందనేదే లెక్కించే పరిస్థితి లేకపోలేదు. గ్లోబల్ ట్రెండ్ బలపడి టెక్నికల్‌గా భారతీయ సినిమా విస్తృతమైన తరువాత -ఓవర్సీస్ లెక్కల్లో ప్రపంచంలోని అనేక దేశాల కలెక్షన్లు భాగమయ్యాయి. భారీ బడ్జెట్లతో నిర్మితమవుతున్న అనేక జాతీయ, ప్రాంతీయ చిత్రాలు ఆ మార్కెట్‌నే టార్గెట్ చేస్తున్నాయి కూడా. అలాంటి మార్కెట్లలో బాలీవుడ్‌కు దొరికిన కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్ -చైనా. భారత్, చైనావంటి మార్కెట్లను హాలీవుడ్ కొల్లగొడుతుంటే, అదే థియరీలో చైనా, యూఎస్ మార్కెట్‌లో తిష్టవేసేందుకు బాలీవుడ్ సినిమాలూ కసరత్తులు మొదలెట్టాయి.
***
దీపావళి ఫెస్టివల్‌ను టార్గెట్ చేస్తూ -్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ నవంబర్ 8న విడుదలవుతుంటే, చైనాలో మాత్రం డిసెంబర్ మధ్యలో విడుదల కానుంది. సినీ పండితుల మార్కెట్ అంచనాలు నిజమైతే -డిసెంబర్ 14న విడుదల కావొచ్చు. అందుకు కారణం -వ్యాపారకోణమే. ప్రపంచం మొత్తం ఒకేసారి విడుదలవుతున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం -నెల తరువాత చైనాలో విడుదల చేయడం వెనుక పెద్ద వ్యాపార కోణమే ఉందన్నది సినీ వ్యాపార నిపుణుల అంచనాలు.
***
సాంస్కృతిక స్వరూప స్వభావాల్లో భారత్- చైనాల మధ్యనున్న దగ్గరితనమే ఇందుకు కారణం. బాలీవుడ్ సినిమాలంటే చీనా జనాలు కళ్లకు క్లిప్పులు పెట్టుకుకుంటున్నారన్న విషయం 2010-11లోనే సినీ పరిశ్రమ పసిగట్టింది. బాలీవుడ్ క్లాసిక్స్, భారీ బడ్జెట్ చిత్రాల వీడియో వ్యాపారం చైనా ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటూ రావడమే ఇందుకు కారణం. 3 ఇడియట్స్‌లాంటి చిత్రాల పైరెటెడ్ వర్షన్స్ కోసం చైనీయులు పడిగాపులు పడినపుడే -బాలీవుడ్‌తో చైనా లవ్‌లో పడిందన్న విషయం బాగా అర్థమైంది. దాంతో చైనాలోనూ త్రీ ఇడియట్స్ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు. దాని ప్రమోషన్స్ కోసం అమీర్ మూడుసార్లు చైనా వెళ్లొచ్చాడు. అంతేకాదు -గాంగ్జౌ నుంచి వాయువ్య చైనాలోని ఉరుంకి వరకూ వున్న థియేటర్లలో ఫరాన్ అక్తర్ ‘రాక్ ఆన్ 2’ సినిమా చెడుగుడు ఆడేసింది.
భారత్ -చైనా సాంస్కృతిక వ్యవహారాల సహజ సంభాషణల్లో ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాల గురించేనన్న విషయం అర్థమైన తరువాత -మార్కెట్ స్ట్రాటజీ మారిపోయింది. చైనాలోని బాలీవుడ్ అభిమానులంతా అమీర్‌ను ‘మి షు’, ‘అంకుల్ మి’ అని పిలుస్తున్నారంటే -బాలీవుడ్ సినిమాతో వాళ్ల అనురక్తి అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్ ఆసక్తిని గమనించి -అక్కడి యుకు, ఇక్వియి, టెనె్సంట్‌లాంటి వీడియో సైట్లు బాలీవుడ్ సినిమాకు ప్రత్యేక విండోలు ఓపెన్ చేశాయి.
మార్కెట్ నిపుణల అంచనాల ప్రకారం 2018 తొలి త్రైమాసికంలో చైనాలో థియేట్రికల్ రెవిన్యూ 3.17 బిలియన్ డాలర్లుంటే, అదే ఉత్తర అమెరికాలో 2.85 బిలియన్ డాలర్లు మాత్రమే. సో, ప్రపంచ వినోద మార్కెట్లో అతి పెద్ద కేంద్రమైన చైనా ఆసక్తిని గమనించిన బాలీవుడ్ పరిశ్రమ -పనిలో పనిగా అక్కడ వ్యాపారానికీ అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన మొదలెట్టింది. స్వదేశంతో ఇంచుమించుగా చైనా మార్కెట్‌లోనూ ఒక ఊపు ఊపేసిన చిత్రాల్లో -టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ (14.2 మిలియన్ డాలర్లు), బజరంగీ భాయిజాన్ (45.5 మిలియన్ డాలర్లు), దంగల్ (193 మిలియన్ డాలర్లు) చిత్రాలను చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం -బాలీవుడ్ సినిమాలు చైనా మార్కెట్‌లో కలెక్షన్లు పెంచుకుంటూ పోవడం. అమీర్‌ఖాన్ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ (119 మిలియన్ డాలర్లు) చైనా మార్కెట్లో విడుదలైన సమయానికి, హాలీవుడ్ మార్వెల్స్ ‘బ్లాక్ పాంథర్’ (108 మిలియన్ డాలర్లు) విడుదలైంది. అయినా ‘సీక్రెట్..’ కలెక్షన్లను అధిగమించలేకపోవడం హాలీవుడ్ చిత్రాలపై భారతీయ సినిమా విజయం అనుకోవాలి. చైనా చట్టాల ప్రకారం ఏడాదికి 34 విదేశీ చిత్రాల విడుదలకే అక్కడ అవకాశముంది. ఆ కోటాలో సింహభాగం హాలీవుడ్‌దే. ఇప్పుడు క్రమంగా ఆ కోటాలో వాటా పెంచుకోడానికి బాలీవుడ్ పట్టు బిగిస్తోంది.
బాలీవుడ్ చిత్రాల పట్ల చైనీయులు మోజు పెంచుకోడానికి -ఇక్కడ రూపుదిద్దుకుంటున్న కథా వస్తువులే కారణం. విద్యాసంబంధ, మహిళా హక్కులు, కుటుంబ నేపథ్యంలోని అన్యోన్యత, అనుబంధాలతో వస్తున్న కథలు.. ఒక సమస్య పరిష్కారానికి ప్రదర్శించే తెగువ, ధైర్యం.. ఇలాంటి కథలు చైనీయుల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాయన్నది ఓ సర్వే సారాంశం. -‘వైవిధ్యమైన అంశాలే బాలీవుడ్ కథా వస్తువులు కావడం ఆసక్తిని పెంచుతున్నాయి. సమాజంలోని మహిళా అసమానత్వాన్ని ఎదుర్కోడానికి ఒక తండ్రి, కూతుళ్లకు కుస్తీ నేర్పించిన కథ దంగల్. ఇంతకంటే అద్భుతమైన సినిమా ఏముంటుంది?’ అన్నది బీజింగ్‌వాసి లీ వ్యాఖ్య. -‘వేరే దేశానికి చెందిన ఓ పాప భారత్‌లో తప్పిపొతే, ఆమెను తిరిగి ప్రత్యర్థి దేశంలోని ఇంటికి చేర్చిన కథగా వచ్చిన బజరంగీ భాయిజాన్ కూడా నా మనసు దోచింది’ అంటాడితను. చైనాలో విదేశీ చిత్రాలను ఎక్కువగా విడుదల చేసే ఈ స్టార్స్ సీఈవో మాటల్లో చెప్పాలంటే ‘్భరత్-చైనాల మధ్య శతాబ్దాల క్రితం నుంచే సాంస్కృతిక స్నేహముంది. ఆలోచనా విధానం, భావ వ్యక్తీకరణ, కథా విధానం.. ఇలా అనేకాంశాలు ఇరు ప్రాంతాల్లో దగ్గరిగా ఉంటాయి. అందుకే -బాలీవుడ్ కథలతో తూర్పు చైనీయులకు ఎంతో దగ్గరి సంబంథముందన్న భావన కలుగుతోంది. అలాంటి చిత్రాలకు ఇక్కడ ఎక్కువ ఆదరణ లభిస్తోంది కూడా’.
***
ఇప్పుడు -అసలు విషయానికి వద్దాం. చైనాలో అమీర్ చిత్రాలకు విపరీతమైన మార్కెట్ గిరాకీ ఏర్పడటంతో -అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో ‘సీక్రెట్ సూపర్‌స్టార్’గా చైనాలో సెనే్సషన్ సృష్టించిన అమీర్ -చైనా మొత్తం థియేట్రికల్ రెవిన్యూ (1.57 బిలియన్ డాలర్లు)లో 2.6 శాతాన్ని కొల్లగొట్టాడు. అయితే చైనా మెయిన్‌లాండ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన హాలీవుడ్‌యేతర విదేశీ చిత్రాల జాబితాలో సీక్రెట్ సూపర్‌స్టార్ 19వ స్థానంలోనే ఉంది. ఎక్కువ వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రాల జాబితాలో ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, జురాసిక్ వరల్డ్: ఫాలిన్ కింగ్‌డమ్, రెడీ ప్లేయర్ వన్, మిషన్ ఇంపాజిబుల్: ఫాలౌట్, ది మెగ్, రాంపేజ్, యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్ చిత్రాల తరువాత 8వ స్థానంలో ఉంది.
భారత్‌తోపాటు చైనాలోనూ ఒకేసారి సినిమా విడుదల చేసే ఆలోచన ఉందంటూ గత మార్చిలో అమీర్‌ఖాన్ ప్రకటించినప్పటికీ, సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చైనా థియేట్రికల్ హక్కులను బాహుబలి బిగినింగ్-కన్‌క్లూజన్, సీక్రెట్ సూపర్‌స్టార్, దంగల్‌లాంటి చిత్రాలను విడుదల చేసిన ఈ-స్టార్స్ సొంతం చేసుకుంది. మరోపక్క చైనా మెయిన్‌లాండ్‌లో సుల్తాన్, హిచ్కి తరువాత యాష్ రాజ్ ప్రొడక్షన్ విడుదల చేస్తున్న మూడో చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. మిడిల్ కింగ్‌డమ్‌లో ఆ రెండు చిత్రాలూ ఇంకా విజయవంతంగా ఆడుతూనే ఉన్నాయి. మరోపక్క, ఒక్క నవంబర్‌లోనే చైనా మెయిన్‌లాండ్‌లో 8 విదేశీ చిత్రాలూ విడుదలయ్యేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. అందులో -యూనివర్శల్ స్టూడియోస్ ‘ది హౌస్ విత్ ఏ క్లాస్ ఇన్ ఇట్స్ వాల్స్’, సోనీ పిక్సర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘వెనమ్’, డిస్నీ ‘ది నట్‌క్రాకర్ అండ్ ది ఫోర్ రీమ్స్ అండ్ రాల్ఫ్ బ్రేక్స్ ది ఇంటర్నెట్’, వార్నర్ బ్రదర్స్ ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్‌వల్డ్ అండ్ క్రేజీ రిజ్ ఆసియన్స్’వంటి పెద్ద చిత్రాలూ ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 2019 నుంచీ కొత్త ఏడాది హడావుడి మొదలై -్థయేటర్లను చైనా సినిమాలు ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి. చైనా ఫిల్మ్ బ్యూరో లెక్కల ప్రకారం డిసెంబర్ 7న ‘ఆక్వామెన్’, డిసెంబర్ 14న మరో హాలీవుడ్ చిత్రం విడుదలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చేసిన నేపథ్యంలో డిసెంబర్ 21న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రం విడుదలకు అవకాశం లేకపోలేదన్న వాదనా ఉంది. ఏదేమైనా చైనా మార్కెట్‌లో థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తన సత్తా చాటుకోవాలంటే -పెద్ద చిత్రాలు, హాలీవుడ్ చిత్రాల అడ్డులేకుండా సమయం చూసి విడుదల చేయడం ఖాయం. సో, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనట్టు నవంబర్ 8న థగ్స్ చైనాలో విడుదలయ్యే అవకాశం లేదు.