మెయిన్ ఫీచర్
అప్పుడప్పుడు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
** స్క్రీన్ మీద కనిపించేవన్నీ సినిమాలు కాదు. అక్కడ కొన్ని -జీవితాలూ ఉంటాయ్. ప్రతి సినిమా లక్ష్యం వినోదమే కాదు. అక్కడ -బతుకుకు అర్థం చెప్పే ఆదర్శాలూ ఉంటాయ్.
**భారతీయ సినిమాకు ఇదీ అని చెప్పలేని ఓ ప్రత్యేకత ఉంది. ముందుతరం సినిమాల్లో అది ప్రత్యేకంగా కనిపించేది. ఇప్పటి సినిమాల్లోనూ అప్పుడప్పుడూ మనల్ని టచ్ చేస్తుంది, ‘అరె.. ఇది మన సినిమా’ అనిపించేంతగా. నిజానికి అన్ని సినిమాల్లాగే అదీ వస్తుంది. ఆ సినిమాతో మనకే సంబంధమూ ఉండదు కూడా. కానీ, దాని బాధ్యతను మనకుగా మనం తీసుకుంటాం. ఆ సినిమాను అనుభవిస్తాం. దాంతో ట్రావెల్ చేస్తాం. పదిమంది దగ్గరకీ చేర్చడానికి ప్రయత్నిస్తాం. ఆ సినిమా గురించి మాట్లాడుతున్నపుడు మనలో మనకే తెలీని ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో అలా రెండు చిత్రాలు మనల్ని టచ్ చేశాయి. ఒకటి ప్రాంతీయ సినిమా -కేరాఫ్ కంచరపాలెం.
రెండోది జాతీయ సినిమా -సూదీ దారం (సుయి -్ధగా).
=============================================
ఇలాంటి సినిమా కథలు జీవితాల్లోంచి పుట్టుకొస్తాయి. వాటిల్లోని పాత్రలు మనతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. భావోద్వేగాలు పంచుతాయి. అలా గుండెల్లో తిష్టవేసేస్తాయి. సినిమా పూర్తయిన తరువాత -స్క్రీన్ నుంచి పాత్రలన్నీ నేరుగా మనతోనే ఇంటికొస్తాయి. కొన్నాళ్లపాటు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి సజీవ పాత్రలు, సహజ పాత్రలతో వచ్చిన సినిమాలే ఈ రెండూ. ఇలాంటివాటిని సమీక్షించుకునేకంటే, చర్చించుకోవడమే ఉత్తమం.
మొన్నటికి మొన్న..
కంచరపాలెం అనే మారుమూల గ్రామంలోని కొన్ని బతుకు కథలు ఏరుకుని, వాటి ఆశనిరాశలు, కష్టసుఖాలు, పగాప్రతీకారాలు, పరువుమర్యాదలు.. ఇలా బతుకు కోణాలను కథనంగా గుదిగుచ్చి -కేరాఫ్ కంచరపాలెంగా అందించాడు దర్శకుడు వెంకటేశ్ మహా. జీవితంలో మనకెదురైన అనేక సంఘటనలను పాత్రలకు ఆపాదించి గుర్తుచేశాడు. నవ్వించాడు. కన్నీళ్లు పెట్టించాడు. కంగారు పెట్టాడు. ఏం జరుగబోతోందోనని భయపెట్టాడు. ‘ప్రేమ’ కానె్సప్ట్‌నే ప్రధానం చేసుకున్నా బతుకు మొత్తాన్ని ఆవిష్కరించాడు. ఊళ్లో కనిపించే కొన్ని జీవితాలు స్క్రీన్‌కు ఎక్కితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతిని అందించాడు -కేరాఫ్ కంచరపాలెంతో. విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్న ఆ చిత్రం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. మెత్తగా గుర్తుకొస్తూనే ఉంది.
***
ఇప్పుడు -సుయి ధాగా.
మూడేళ్ల క్రితం ‘్ధమ్ లగే కె హైసా’తో పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న కథకుడు శరత్ కటారియా -తాజాగా సూదీదారం (సుయి-్ధగా) పట్టుకొచ్చాడు. వరుణ్ ధావన్, అనుష్క శర్మ లీడ్ రోల్స్‌లో కనిపించిన ఈ సినిమా కూడా -పక్కింటి చిత్రం లాంటిదే. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ నేపథ్యాన్ని ఓ సాధారణ మధ్య తరగతి దర్జీ కుటుంబానికి అన్వయించి శతర్ కటారియా కథ చెప్పిన విధానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎన్నో అనుభూతులను పంచుతుంది. బతుకుమీద నమ్మకాన్ని పెంచుతుంది. ‘సుయి -్ధగా’ను సినిమాగా చూడలేం. కళ్లముందు సాగిపోతున్న బతుకు కథలాగే ఫీలవుతాం. సినిమా ఆరంభంలోనే దర్జీ వౌజీ (వరుణ్ ధావన్), అతని భార్య మమత (అనుష్క) పాత్రలతో మనకు స్నేహం కుదురుతుంది. మమకారం ఏర్పడుతుంది.
క్లుప్తంగా.. -తాతల తరం నుంచీ వౌజీది దర్జీ వృత్తి. ఉపాధిలేని వృత్తి మనకెందుకంటూ వౌజీ నిర్లక్ష్యం చేస్తాడు. కుటుంబ పోషణకు తిప్పలు పడుతూ అవమానాలకు గురవుతుంటాడు. చేతనైన స్వయం ఉపాధిని వదిలేసి, భర్త అడ్డమైన పనుల చేస్తుండటం భార్య మమతకు నచ్చదు. నచ్చచెపుతుంది. నైపుణ్యాన్ని గుర్తు చేస్తుంది. వ్యాపారానికి పురిగొల్పుతుంది. భర్తకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. భార్య మాటమీద గౌరవంతో ఒక్క మిషన్‌తో వ్యాపారం మొదలెడతాడు వౌజీ. పేదింటి అర్థాంగిలా భర్త కష్టంలో పాలుపంచుకుంటుంది మమత. ఇద్దరి కష్టం ఫలిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. అదో వస్త్ర పరిశ్రమకు దారి తీస్తుంది. వందలాది దర్జీలు వౌజీ వద్ద ఉపాధి పొందుతారు. విదేశీ కంపెనీలకు దీటుగా తీర్చిదిద్దిన స్వదేశీ దుస్తులకు ఓ బ్రాండ్ ఏర్పడుతుంది. అదే ‘సుయి-్ధగా’. సింపుల్ స్టోరీ. కానీ, అలాంటి ఎదుగుదలలో ఎదురైన సవాళ్లను చూపించిన విధానమే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. చేనేత వస్త్రాల ప్రాధాన్యత చాటి చెప్పాలన్న నిజాయితీ -దర్శకుడు శరత్ కటారియా ప్రతి ఫ్రేమ్‌లో చూపిస్తాడు. మొదటి నుంచి చివరి వరకూ స్క్రీన్‌మీద సినిమా చూస్తున్న భావనకంటే, జీవితాన్ని చూస్తున్న ఆసక్తే కలిగించాడు. చేతివృత్తిని వదిలేసుకుని కుటుంబ పోషణ కోసం ఇతర మార్గాలను వెతుక్కుంటూ అవమానాలు పడే వౌజీ పాత్రతో కన్నీళ్లు పెట్టించాడు. భార్య సలహాతో అదే చేతివృత్తిని నమ్ముకుని దిగ్గజ వ్యాపారిగా ఎదిగిన పాత్రనూ చూపించి ప్రేరణనిచ్చాడు.
వరుణ్, అనుష్క శర్మల ఈ కథలో కీలకం. పాత్రకు తగిన ఆహార్యాన్ని వరుణ్ ప్రదర్శిస్తే, మధ్య తరగతి దర్జీకి భార్యగా ముతక చీర, నుదుట కుంకుమ, తలపై కప్పుకున్న చీరకొంగుతో అనుష్క -అద్భుతానే్న చూపించారు. సాధారణ పేదింటి కథ చెప్పడానికి చుట్టూ ఎంచుకున్న పాత్రల సమతుల్యతలోనూ దర్శకుడు కటారియా బ్యాలెన్సింగ్ కనిపించింది.
నిజానికి బాలీవుడ్ చిత్రాల్లో ఓ పేదోడు గొప్పోడిగా ఎదిగిన కథలు తక్కువేం కాదు. కాకపోతే వాటిల్లో మెలోడ్రామానే ఎక్కువ కనిపిస్తుంది. దర్శకుడు కటారియా మాత్రం అలాంటి ‘అతి’కి పోకుండా భావోద్వేగాలను సమపాళ్లలో రంగరించాడు. సహజ పాత్రల ప్రవర్తనా తీరు ప్రతిబింబించేలా సన్నివేశాలను రాసుకున్నాడు. సినిమా మొదలైన రెండు నిమిషాల్లో సూటిగా కథలోకి రావడం, రీళ్లకు రీళ్లు డ్రాగ్ చేయకుండా కాన్‌ఫ్లిక్ట్‌ను త్వరగా తీసుకురావడం, వౌజీ ఎదుగుదలలో ఎదురయ్యే కష్టాలను సహజంగా చిత్రీకరించడంతో మంచి భావన కలిగించే సినిమాగా సురుూ -్ధగా నిలిచింది.
చెత్త చిత్రాలూ, మూస మూవీలతో ప్రేక్షకుడు విసుగెత్తిపోయే సమయంలో ఇలాంటి సిత్రాలేవో జరుగుతాయి. మళ్లీ సినిమా మీద మమకారాన్ని పెంచేలాంటి చిత్రాలు థియేటర్లకు వస్తాయి. కొన్నాళ్లపాటు సినిమారక్తిని సజీవంగా ఉంచుతాయి. ఇదంతా.. అప్పుడప్పుడే.