సంపాదకీయం

ద్రవ్యోల్బణ సమన్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రవ్యోల్బణ చర్యల ప్రభావం ప్రస్ఫుటిస్తున్నందుకు రిజర్వ్ బ్యాంక్‌వారు, కేంద్ర ప్రభుత్వం వారు పరస్పరం ప్రశంసించుకొంటూ ఉండవచ్చు. నిత్యావసరాలైన వస్తువుల ధరలు పెరగడానికి వీలుగా గత జనవరి నుంచి చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి పెరిగినట్టు ఇంతవరకు అధికారికంగా నిగ్గు తేలలేదు. ఇప్పుడు నిగ్గుతేలింది. చిల్లర ధరల ప్రాతిపదికగా ద్రవ్యోల్బణం పదునాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు అధికారిక గణాంక వివరాలు విడుదలయ్యాయి. ఇలా ధరలు, ద్రవ్యోల్బణం పెరగడానికి వీలుగా ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంకు వారు నాలుగుసార్లు వడ్డీరేట్లను తగ్గించారు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతున్నట్టు అధికారికంగా నమోదు కాలేదు. ధరలు జనాన్ని మోదుతుండడం గుర్తింపునకు నోచుకోని వ్యవహారం. నమోదు కావడం వల్ల మాత్రమే గుర్తింపు వస్తోంది. అధికంగా వడ్డీ రేట్లు ఉండడం వల్ల అర్థిక ప్రగతి స్తంభించి పోయిందని కేంద్ర ప్రభుత్వం సలహాదారులు, ప్రతినిధులు ఏడాదికి పైగా ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకునే పెట్టుబడి దారులకు చాలా ఇబ్బంది ఏర్పడిపోతుందన్నది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనేకసార్లు ఆవిష్కరించిన సిద్ధాంతం. అందువల్ల రిజర్వ్ బ్యాంకు వారు వడ్డీ రేట్లను తగ్గించాలన్నది ఆయన పదే పదే వెలిబుచ్చిన అభిప్రాయం. అయితే రిజర్వ్ బ్యాంక్ వారు వడ్డీ రేట్లను తగ్గించినట్లయితే ద్రవ్యోల్బణం, ధరలు పెరిగిపోతాయన్నది ధరలను అదుపు చేయదలచిన వారి వాదం. రిజర్వ్ బ్యాంకు వారు కూడ ఇదే అభిప్రాయంతో అనేక నెలలపాటు ధరల పెరుగుదలకు దోహదం చేయగల వడ్డీరేట్ల తగ్గింపునకు అంగీకరించలేదు. ప్రభుత్వానికీ, రిజర్వ్ బ్యాంక్‌నకూ మధ్య కొనసాగిన ఈ సైద్ధాంతిక సమరంలో చివరికి ప్రభుత్వం వారిదే పైచేయి అయింది. ఈ ఏడాది మూడుసార్లు రిజర్వ్ బ్యాంకు వారు వడ్డీని తగ్గించారు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం వేగం పుంజుకోలేదు. ద్రవ్వోల్బణం సున్నస్థాయికంటె దిగువకు చేరి మాంద్యం ఏర్పడిపోతుందన్నది ప్రభుత్వం వారు వ్యక్తం చేసిన ఆందోళన ప్రాతిపదిక. ఇలా రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపైన వాణిజ్య బ్యాంకులు వినియోగదారులకు ప్రదానం చేసే ఋణాలపైన ఇలా మూడు సార్లు వడ్డీలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ధరలు పెరిగినట్టు అధికారికంగా నమోదు కాలేదు. ద్రవ్యోల్బణం పెరగడం లేదన్నది జరిగిన అధికారిక నిర్ధారణ. వడ్డీలు తగ్గినట్టయితే సమాజంలో ద్రవ్యం పరిమాణం చెలామణి పెరిగి పెట్టుబడులు పెరుగుతాయట. కానీ దీనివల్ల వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు ద్రవ్యోల్బణం పెరుగుతాయట. ఇవీ ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో నిహితమై ఉన్న పరస్పర వైరుధ్యాలు. కానీ మూడుసార్లు వడ్డీని తగ్గించినప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుదల కాని, ధరల పెరుగుదల కానీ అధికారికంగా నమోదు కాకపోవడం వల్ల సిద్ధాంతం విఫలమైపోయిందన్న భ్రాంతి ఏర్పడింది.
నవంబర్ నెలలో చిల్లర ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో, పదునాలుగు నెలల గరిష్ఠ స్థాయిని చేరడంతో ఈ భ్రమ తొలగిపోయింది. ధరలు, ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సిద్ధాంతం ధ్రువపడినందుకు, నిజమైనందుకు ప్రభుత్వ విధానాలతో ముడివడి ఉన్న ఆర్థికవేత్తలు అధికారులు సంతోషించి ఉంటారు. కందిపప్పు, ఉల్లిగడ్డలు భయంకరంగా పెరిగినట్టు అనధికారులైన జనానికి కలిగిన జీవన అనుభవం. ఈ వాస్తవం మధ్యతరగతి జన జీవనాన్ని నిలదీసిన ఆరేడు నెలల్లో ద్రవ్యోల్బణం ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం ఆకాశం అంటి ఉండాలి. కానీ ఈ పెరుగుదల కానీ కూరగాయల ధరలు పెరగడం కాని అధికారిక గణాంకాలలో ప్రస్ఫు టం కాలేదు. అందువల్ల కందిపప్పు, ఉల్లి ధరలు మూడు రెట్లు పెరగడం అధికారిక నిర్ధారణలో ప్రగతి భ్రాంతి. అనధికారుల అనుభవం ప్రాతిపదికగా ద్రవ్యోల్బణం ధరలు పెరగలేదనడం భ్రాంతి. కానీ డిసెంబర్‌లో వెలువడిన గణాంకాల వల్ల ఈ రెండు భ్రాంతులకు మధ్య సమన్వయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం వారు, రిజర్వ్ బ్యాంక్ వారు కలసికట్టుగా వడ్డీలను తగ్గించినందువల్ల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రక్రియ మళ్లీ పుంజుకుంటోందన్న అధికారిక నిర్ధారణ ఈ సమన్వయం.
ధరలు, ద్రవ్యోల్బణం పెరగని రీతిలో పెట్టుబడులను, ఉత్పత్తులను స్థూల జాతీయోత్పత్తిని పెంచడానికి వీలైన ఆర్థిక నీతిని రూపొందించలేకపోవడం ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం. ప్రపంచీకరణ ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ అనుసంధానం ప్రవర్థమాన దేశాలన్నింటిలోను ధరలను పెం చుతూనే ఉంది. ధరల అదుపుకోసం తీసుకొనే చర్యల వల్ల పెట్టుబడులు ప్రగతి స్తంభించిపోతోంది. ఈ వైపరీత్యాన్ని 1994లో వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థీకరణ జరిగిన నాటినుంచి మన ప్రభుత్వం నిరోధించ లేకుండా ఉంది. 2009 వరకు సాధారణ ద్రవ్యోల్బణాన్ని మాత్రమే లెక్క కట్టేవారు. 2009లో విపరీతంగా ఆహార ధరలు పెరిగాయి. అయినప్పటికీ సాధారణ ద్రవ్యోల్బణం అతితక్కువ స్థాలో నమోదు కావడం అంతుపట్టని విచిత్రంగా మారింది. 2009 అక్టోబర్ నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని విడిగా నిర్ధారించడం మొదలైంది. ఆహార ద్రవ్యోల్బణం ఇరవై శాతానికి చేరినట్టు వెంటనే ధ్రువపడింది. అంతవరకు సాగిన ద్రవ్యోల్బణ ప్రక్రి య లోపభూయిష్టమన్నది స్పష్టమైంది. ప్రపంచీకరణ మొదలైన తరువాత ద్రవ్యోల్బణం నిర్ధారణలో ఆహారం, నిత్యావసరాలు కాక, సెల్‌ఫోన్ ధరలకు, సేవల సుంకాలకు, విమాన చార్జీలకు, అలంకరణ సామగ్రి ధరలకు ప్రాధాన్యత పెరిగింది. అందువల్ల మధ్యతరగతి ప్రజల మాడు పగిలే విధంగా నిత్యావసరాల ధరలు పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణం సున్నశాతంగానో, ఇంకా తక్కువగానో ఉండేది. 2009 నుంచి ఆహార ద్రవ్యోల్బణంగా విడిగా ఉంటున్నప్పటికీ ఇందులో కూడా లోపాలు ఉన్నట్టు ఇప్పుడు స్పష్టమైంది. కందిపప్పు ధరలు ఆరు నెలల క్రితం కంటె మూడు రెట్లు అధికంగా ఉన్నప్పటికీ చిల్లర ద్రవ్యోల్బణం ఐదున్నర శాతం స్థాయిలోనే ఉంది. అందువల్ల అంతా బాగున్నట్టుగానే అధికారిక అభినయం కొనసాగుతోంది.
కందిపప్పు ధరలు ఆరునెలల వ్యవధిలో కిలో డెబ్బయి స్థాయి నుంచి కిలో నూట ఎనబయి ఐదు రూపాయల స్థాయికి పెరిగి స్థిరపడినప్పటికీ హాహాకారాలు చెలరేగడం లేదు. ఎందుకంటే మధ్య తరగతి ‘గాయం’ మొద్దుబారిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఎప్పటికప్పుడు వందశాతం సమతుల్యమయ్యే రీతిలో వేతనాలు పెరగడం కూడ కందిపప్పు ధరలు ఇలా స్థిరపడిపోవడానికి కారణం. తగ్గినప్పటికీ పదో, ఇరవయ్యో తగ్గి నూట అరవయి వద్ద నిలకడ ఏర్పడవచ్చు. సంఘటిత ప్రభుత్వేతర రంగాలలో సైతం నోరున్న వారికి ఎంతో కొంత వేతన వృద్ధి ద్రవ్యోల్బణం ప్రాతిపదిగా జరుగుతూనే ఉంది. అందువల్ల వేతనాభివృద్ధి, ఆదాయం అభివృద్ధి లేని అధికాధిక వినియోగదారుల వాణి వినిపించదు. వారు వౌనంగా ధరల మోత కింద అణగారి పడి ఉండవలసిందే. ఈ వేతన అభివృద్ధి లేనివారు స్వయం ఉపాధితో జీవిస్తున్న, అసంఘటిత రంగాలకు చెందిన కోట్లా ది మందిని కందిపప్పు కాటువేస్తున్నది.