సబ్ ఫీచర్

అమెరికా ఓ అమెరికా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఇష్టంతో కావచ్చు, అయిష్టంతో కావచ్చు ప్రపంచ ప్రజల నాలుకపై అమెరికా నామస్మరణ నిత్యకృత్యం. ఆ దేశ విదేశాంగ విధానాల ఆధారంగా అమెరికా మీద ఎక్కువమంది దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. కాని ఎవరైనా అమెరికా పర్యటించి వచ్చిన తరువాత ఆ అభిప్రాయాన్ని చాలావరకు మార్చుకుంటారు. మన కమ్యూనిస్టు అగ్ర నాయకులు నారాయణ, రాఘవులు విషయంలో కూడా ఇది రుజువైంది. అమెరికా గొప్పదనం ఏమిటంటే తన దేశస్తులతోపాటు ఇతరులందరికి సమాన అవకాశాలు కల్పించడం. అందుకోసం నిత్యం తపన పడటం. తాము ఎప్పుడూ ఇతరులకంటే అగ్రగాములుగానే ఉండాలనుకోవటం అసూయ కలుగ చేయడంలో ఆశ్చర్యం ఏముంది. అమెరికాను ఆరోగ్యవంతంగాను, సౌందర్యవంతంగా ఉంచటంలోనే ఆ దేశ ప్రభుత్వంతోపాటు ప్రజలు (ప్రవాస భారతీయులు చివరకు లాటిన్ అమెరికా నల్లవాళ్ళు స్పానిష్ ఎర్రవాళ్ళతో సహా) సహకరిస్తున్న తీరు ముచ్చటేస్తుంది. అమెరికన్లు పుట్టుక, వంశచరిత్రల కంటే వ్యక్తిగత విజయాలకు ప్రాధాన్యమిచ్చే సమాజాన్ని సృష్టించారు. అక్కడ ప్రతి రంగంలో మార్పులు అతివేగంగా చోటుచేసుకుంటాయి. ప్రపంచంలో మరే దేశంలో లేని గతిశీలత అమెరికాలో ఉంది. తమతమ రంగాలలో శిఖరాగ్ర స్థాయికి చేరిన అమెరికన్ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, న్యాయవాదులు అనామక కుటుంబాలలో పుట్టినవారే కటిక పేదరికం నుంచి ప్రభవించినవారే కావటం గమనార్హం.
సంపద, సామాజిక అంతస్తులకు సంబంధించి అమెరికన్ సమాజంలో తీవ్ర అసమానతలు ఉన్నాయి. అయినప్పటికీ వ్యక్తుల ప్రాభవ పతనాలు అనేవి పూర్తిగా వారి సొంత ఆకాంక్షలు, సామర్థ్యాలపైనే ఆధారపడి వుండేవిగా అమెరికన్ సమాజం వ్యవస్థీకృతమయింది. ఈ కారణంగానే సంపన్న కుటుంబాలనుంచి వచ్చినవారు సామాన్యులుగా మిగిలిపోవడం, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవారు అసామాన్యులుగా వెలుగొందడం జరుగుతోంది. అమెరికాలో కూడా వర్గవ్యవస్థ ఉంది. సందేహం లేదు. అయితే వర్గ్భావన లేదు. ఇదే అమెరికన్ సమాజ విశిష్టత. ఒక కంపెనీ సిఇఓ సైతం ఫ్యాక్టరీలో సామాన్య కార్మికులతో ఒక సహచరుడుగా మెలగుతాడు. మన దేశంలోను, చాలా ఇతర దేశాలలో మాదిరిగా తానేదో పైనుంచి ఊడిపడ్డట్టుగా అమెరికన్ సిఇఓలు వ్యవహరించరు. శ్రమకు సంపూర్ణ గౌరవం లభిస్తుంది. తమ ఉద్యోగులు చేసే భౌతిక శ్రమకు విలువనివ్వడమే కాదు, ఇంటివద్ద స్వయంగా తమ చేతులతో వివిధ పనులు చేయడానికి సైతం అమెరికన్ సిఇఓలు వెనుకాడరు. అందుకనే ఆ దేశం వంట మనుషులు, పని మనుషుల వ్యవస్థ కనిపించదు.
అమెరికాలో ఇతర ఆధునిక సమాజాలలో కంటే వర్గం, సామాజిక హోదాలకు ప్రాధాన్యం తక్కువ. బిల్‌గేట్స్ ఇందుకు మంచి ఉదాహరణ. స్వశక్తితో అపర కుబేరుడైన బిల్‌గేట్స్ తన ఆర్జనలో అత్యధిక భాగాన్ని దానధర్మాలకే వినియోగిస్తున్నాడు. చాలా స్వల్ప భాగాన్ని మాత్రమే తన పిల్లలకు ఇచ్చాడు. బిల్‌గేట్స్ పిల్లలు తమకు తాముగానే జీవితంలో పైకి రావల్సి వుంది. ఇదే మన దేశంలో ఎవరికైనా జీవితంలో ఎదగడానికి అవకాశాలు అతను పుట్టిన కుటుంబం హోదాపై ఆధారపడి వున్నాయి.
రాజకీయ పక్షాలను కుటుంబ వ్యాపార సంస్థలుగా మార్చివేయడంవల్ల మన ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టమేమిటో అందరికీ తెలిసిందే. బహుశా రాజకీయాలలో అర్హతలను పట్టించుకోకుండా సన్నిహిత మిత్రులను అందలాలు ఎక్కించడంవల్ల జరుగుతోన్న నష్టం అంతకంటే ఏమాత్రం తక్కువకాదు. ఇంతకూ ప్రైవేట్ రంగానికి పేరుపొందిన అమెరికాలో అత్యుత్తమ పాఠశాలలు చాలావరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే కావడం విశేషం. అయతే అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా దౌర్జన్యకారి. అంతేకాదు సామ్రాజ్యవాది కూడా అన్నది మాత్రం తిరుగులేని వాస్తవం.

- పుట్టా సోమన్నచౌదరి