సబ్ ఫీచర్

స్వీడన్‌కు సరికొత్త సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వీడన్ దేశానికి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చి పడింది. అది వారికి అత్యవసరమైన ఇందనం కొరత. ఇంతకీ ఆ ప్రధాన ఇంధనం ఏమిటో తెలుసా? ‘‘చెత్త’’!! స్వీడన్‌లో చెత్త నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. చెత్త నిల్వలు తరిగిపోవడమంటే ఎవరికైనా సంతోషం కలిగించే విషయమే. కానీ స్వీడన్‌కి మాత్రం ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. విచిత్రంగా లేదూ? ఇంతకీ ఏమిటా ‘‘చెత్త’’కథ? వివరాలలోకి వెళ్దాం.
ప్రపంచంలోనే నమ్మశక్యం కాని విషయం స్వీడన్‌లో చోటుచేసుకుంటోంది. అదేమిటంటే ‘‘రీసైక్లింగ్ విప్లవం’’! వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చెయ్యడంలో స్వీడన్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈరోజు పర్యావరణపరంగా, ఆరోగ్యపరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘‘చెత్త’’! భూగోళంలో ఏ మూల చూసినా వాడి పారేసిన వ్యర్థ పదార్థాలు పేరుకుపోయిన చెత్తకుప్పలే కనిపిస్తాయి. వీటిని ఎలా తొలగించాలి అన్నది ఒక ప్రశ్న అయితే, కొత్తగా ‘ఉత్పత్తి’ అవుతున్న చెత్తని ఎక్కడ పారేయాలన్నది మరొక పెద్ద సమస్య అయి కూర్చుంది. దీనికి పరిష్కారంకోసం పర్యావరణ శాస్తజ్ఞ్రులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. భూమిపై ఎక్కడ పడితే అక్కడ పర్వత శిఖరాల్లా చెత్తకుప్పలు పేరుకుపోవడంవల్ల ఇంతవరకూ కనీవినీ ఎరుగని భయంకరమైన రోగాలు మానవాళిపై విరుచుకుపడుతున్నాయి.
ఒక ప్రక్క ప్రపంచంలోని దేశాలన్నీ ‘చెత్త’ సమస్యతో సతమతమవుతూంటే, స్వీడన్ మాత్రం ఎంచక్కా చెత్తతో పండగ చేసుకుంటోంది. తమవద్ద గల చెత్త వనరులు తరిగిపోతున్నాయనీ, తమకు పెద్ద మొత్తంలో చెత్తను సరఫరా చెయ్యండనీ ఇతర దేశాలను ప్రాధేయపడుతోంది స్వీడన్! ఆశ్చర్యకరంగా ఉంది కదూ! 1940లలోనే వ్యర్థ పదార్థాలను బూడిదగా మార్చే కర్మాగారాలను స్వీడన్ ప్రారంభించింది. చెత్తను బూడిదగా మార్చేందుకు ప్రత్యేకంగా కర్మాగారాలను ఏర్పాటుచెయ్యడంవల్ల స్వీడన్‌కి కొన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అవేమిటంటే పరిసర ప్రాంతాలలో చలి 20 శాతం వరకు తగ్గుతోంది. కర్మాగారాలలో వెలువడే వేడిని ఉపయోగించి పలు ప్రాం తాలకు పైపుల ద్వారా అందరికీ వేన్నీళ్ళ సరఫరా కూడా చేస్తున్నారు. రెండున్నర లక్షల ఇళ్ళకు విద్యుత్తును సరఫరా చేయగలుగుతున్నారు.
స్వీడన్‌కి అవసరమైన అధిక మొత్తం విద్యుత్తు చెత్తను తగలబెట్టే కర్మాగారాల నుండే ఉత్పత్తి అవుతోందని, అందువల్ల అధిక భాగం చెత్త అక్కడికే తరలింపబడుతోందని వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ (స్వీడిష్ వేస్ట్ మేనేజ్‌మెంట్) పేర్కొంది. ప్రస్తుతం ఇళ్ళ నుండి వెలువడే వ్యర్థ పదార్థాలలో 4 శాతం మాత్రమే భూమిలో పూడ్చివేస్తున్నారు. మిగిలిన వ్యర్థాలను రీసైక్లింగ్ చెయ్యడమో లేదా ఎరువులుగా మార్చడమో లేదా విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకు తరలించడమో చేస్తారు. ప్రతి యేటా 4 శాతం వ్యర్థాలు మాత్రమే భూమిలో పూడ్చటంవల్ల ఈ దేశం పరిశుభ్రంగా పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది.
వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ ఇలా జరుగుతుంది: మొదట వ్యర్థాల నుంచి రీసైక్లింగ్ చెయ్యడానికి వీలైన వాటిని వేరుచేస్తారు. మిగిలిన వ్యర్థాలను తగలబెట్టడానికి కర్మాగారాలకు పంపిస్తారు. వాటిని తగలబెడుతున్నప్పుడు కర్మాగారాలలో ఉత్పత్తి అయిన వేడిని, విద్యుత్తును ఇళ్ళకు సరఫరా చేస్తారు. వ్యర్థాలను తగలబెట్టగా వచ్చిన బూడిదలో ఇంకా తగలబడకుండా ఉన్న లోహాల ముక్కలను వేరుచేసి వాటిని రీసైక్లింగ్ చేయడానికి పంపిస్తారు. ఇక మిగిలిన బూడిదను జల్లించి అందులో గల గులకరాళ్ళను, పెంకులను, పింగాణీ ముక్కలను వేరుచేసి వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఇక చివరిగా మిగిలిన బూడిదను భూమిలో పూడ్చివేస్తారు. అంటే వ్యర్థాలలో చాలా తక్కువ శాతం మాత్రమే భూమిలో పూడ్చివేయడం జరుగుతుంది. ఇక వ్యర్థాలను తగలబెట్టేటప్పుడు వచ్చే పొగను పీల్చేయడానికి ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ ఫిల్టర్లను ఏర్పాటుచేస్తారు. అలా ఫిల్టర్ల ద్వారా వచ్చిన పొగలోని విష పదార్థాలను ఒక ప్రత్యేక ప్రాసెసింగ్ ద్వారా వేరుచేస్తారు. ఆ మిగిలిన పొగ నుండి వచ్చే నీటిని, కార్బన్‌డయాక్సైడ్‌ను శుద్ధిచేసిన తరువాతే బయటికి వదులుతారు. స్వీడిష్ ప్రజలు తమ ఇళ్ళలోనే వీలైనంత ఎక్కువగా వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేస్తారని, అందువల్ల కేవలం నాలుగు శాతం వ్యర్థ పదార్థాలే భూమిలో కలిపేస్తారు. తమ ఇళ్ళలోని వ్యర్థ పదార్థాలలో రీసైక్లింగ్ చేయడానికి వీలుకాని వాటిని వేరు చెయ్యాలనీ, వ్యర్థ పదార్థాల నిర్వహణలో ప్రజలు తమవంతు సహకారాన్ని అందించాలనీ స్వీడన్ ప్రభుత్వం నిబంధన విధించింది.
ప్రస్తుతం ఆ దేశంలో వ్యర్థాల నుండి విద్యుత్తును ఉత్పత్తిచేయడానికి 32 కర్మాగారాలు పనిచేస్తున్నాయి. ‘‘మా దేశం ప్రముఖంగా ఆధారపడి ఉన్న ఇంధనం వ్యర్థ పదార్థాలే!’’ అంటారు క్రిస్టియన్ లోవాజెన్. ఆయన స్వీడ న్ ప్రభుత్వంచే నడుపబడుతున్న రెనొవా విద్యుత్ కర్మాగారానికి అధికార ప్రతినిధి. వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో స్వీడన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో వరుసగా చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ దేశాలు ఉన్నాయి.
వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్‌ని స్వీడన్ ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తోందంటే ఇప్పుడు ఆ దేశంలో ఉన్న రీసైక్లింగ్ ప్లాంట్లకు సరిపడా చెత్త లభ్యంకావడం లేదు. వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చెయ్యడంలో అద్భుత విజయాలు సాధిస్తుండడంవల్ల చెత్తకు ఆ దేశంలో ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది. చెత్త దొరకడమే వారికి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. తగలబెట్టబడే వ్యర్థ పదార్థాలు స్వీడన్లో తక్కువైపోతున్నాయని స్వీడన్ ఎన్విరానె్మంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సీనియర్ సలహాదారురాలు అయిన కేటారినా అంటున్నారు. తమ దేశంలోని దగ్ధశాలల్లో తగలబెట్టే సామర్థ్యానికి తగినంత చెత్త లభించటం ఒక సమస్య అవుతోందని ఆమె అంటున్నారు. అయితే ఈ సమస్యకు వారు ఒక పరిష్కారం కనుగొన్నారు. అదేమిటంటే ఇతర దేశాలనుండి చెత్తను కొనుగోలు చేయడం!

- దుగ్గిరాల రాజకిశోర్