సంపాదకీయం

ఇదేనా ప్రత్యామ్నాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిర్ ఇండియా- పౌరవిమాన సంస్థకు చెందిన వాటాలను భారీగా విక్రయించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఊపందుకుంటున్న పెట్టుబడుల ఉపసంహరణకు మరో నిదర్శనం. ఎయిర్ ఇండియా ఏళ్ల తరబడి నష్టాలను గడించడం ఈ వాటాలను అమ్మడానికి కారణం కావచ్చు. నష్టాలను పూడ్చుకొనడానికి ఈ ప్రభుత్వ సంస్థ చేపట్టిన సంస్కరణలు మరిన్ని నష్టాలను ఆర్జించిపెట్టడం కూడ చరిత్ర...ఎయిర్ ఇండియాతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల వాటాలను కూడ ప్రభుత్వేతరులకు విక్రయించాలని నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అధ్యయన బృందం వారు ప్రభుత్వానికి సిఫార్సు చేశారట..నష్టాలను గడిస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలని కూడ నీతి ఆయోగ్ బృందం నిగ్గు తేల్చడం ఆశ్చర్యకరం కాదు. ప్రభుత్వం వారి అభీష్టాన్ని గ్రహించగలిగిన అధ్యయన బృందాలు అందుకు అనుగుణమైన సిఫార్సులను మాత్రమే చేస్తాయి. ఇలా మరోసారి భారీ ఎత్తున ప్రభుత్వరంగ వాణిజ్య పారిశ్రామిక సంస్థల అమ్మకానికి రంగం సిద్ధమవుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కొనసాగుతున్న రెండు దశాబ్దుల ప్రహసనంలో ఇది మరో ఆరంభం మాత్రమే. అందువల్ల కొత్తదనం లేనిది...ప్రపంచీకరణ 1994లో మొదలైన తరువాత ఇలా ప్రభుత్వ సంస్థలకు అమ్మివేయడం, మూసివేయడం మాత్రమే ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ప్రధాన పారిశ్రామిక కార్యక్రమం. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో 1998వ 2004వ సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నడిచిన కాలంలో ఇలా అమ్మివేయడంకోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ కూడ వెలసింది. ఇలా ప్రభుత్వపు పెట్టుబడులను ఉపసంహరించే కార్యక్రమం 2004వ 2014వ సంవత్సరాల మధ్య నడచిన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం వారి హయాంలో మరింత ఊపందుకొంది. ఈ ఉపసంహరణకు, విదేశీయ సంస్థలు మన దేశంలో చొరబడి పోవడానికీ మధ్య విడదీయరాని అనుబంధాన్ని బిగించిన ఘనత కూడ మన్‌మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానిదే. ఆర్థిక మంత్రిగా ప్రపంచీకరణకు శ్రీకారం చుట్టిన మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రపంచీకరణను మన నిత్యజీవనరీతిగా మార్చగలిగాడు. సాంబారు తయారు చేయడానికి అవసరమైన మసాలాపిండిని సైతం అమెరికా సంస్థలు, కొరియా కంపెనీలు సరఫరా చేస్తుండడం ప్రపంచీకరణ మన వంట ఇళ్లలో సైతం కొలువు తీరుతున్న రీతికి ఒక నిదర్శనం. చైనా కంపెనీలు మనం జరుపుకొనే గణేశ నవరాత్రుల ఉత్సవాలకోసం వినాయక విగ్రహాలను సరఫరా చేశారు. అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వేత్త అయిన మన్‌మోహన్ సింగ్ భారతీయుల అంతరంగాలలో అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రతిష్ఠించిన తీరు ఇది. అందువల్ల విదేశీయ సంస్థలు ప్రధానంగా అమెరికా, చైనాల ముఠాలు తయారుచేస్తున్న పదార్థ పరంపరను మనం పులుముకొని తీరాలి, అలా పులుముకోకపోతే మనం అంతర్జాతీయ స్థాయి మానవులం కాజాలం. సంకుచిత జాతీయ జీవనులుగా మిగిలిపోతాము. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం మన నెత్తికెత్తి నిష్క్రమించిన ప్రపంచీకరణ ఇదీ...
ఈ వారసత్వ సంపద నరేంద్రమోదీ ప్రధానమంత్రిత్వంలోని భాజపా ప్రభుత్వానికి సంక్రమించడం కొనసాగుతున్న పరంపర. అంతర్జాతీయ సమష్ఠి హితం విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలకు ఏకాభిప్రాయం కుదరడం మన ప్రజాస్వామ్య వైశిష్ట్యం. అందువల్లనే ప్రభుత్వరంగపు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ప్రభుత్వేతర రంగ సంస్థల ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రభుత్వేతర రంగమంటే బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు-మల్టీ నేషనల్ కంపెనీలు. ప్రభుత్వరంగం కేంద్రీకృత ప్రగతికి నిదర్శనం. నిర్లక్ష్యం వల్ల, ఉద్యోగ నిర్వహణలో నిష్ఠలేనితనం వల్ల తమది అన్న మమకారం సంస్థ పట్ల లేకపోవడం వల్ల ప్రభుత్వరంగ సంస్థలకు నష్టాలు మాత్రమే వాటిల్లుతున్నాయి. ఇలా నష్టాలు వాటిల్లిన సంస్థను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది, లాభాలు గడించడం మొదలైపోతుంది. ప్రభుత్వేతర సంస్థలు వికేంద్రీకరణకు ప్రతీకలు. అందువల్ల ప్రగతి దేశమంతటా విస్తరిస్తుంది. ప్రభుత్వేతర సంస్థల యాజమాన్యాలు పరిశ్రమ, కర్మాగారం, వాణిజ్య వాటిక, దుకాణం తమవన్న భావనతో నిష్ఠతో పనిచేస్తాయి. అందువల్ల ప్రభుత్వరంగం కంటె ప్రభుత్వేతర రంగం ప్రాధాన్యం సంతరించుకోవాలి. ఇదంతా జాతీయతా పరిధిలోను, ప్రభుత్వ సార్వభౌమ అధికార నియంత్రణలోను ఏర్పడదగిన వ్యవస్థ...కానీ ప్రపంచీకరణ జాతీయతను తుడిచిపెట్టేస్తోంది. స్వతంత్ర దేశాల సార్వభౌమాధికారాన్ని అతిక్రమిస్తోంది.
అందువల్ల ప్రభుత్వేతర రంగం విస్తరించడం వికేంద్రీకృత ప్రగతికి, మెరుగైన పనితీరుకు దోహదం చేస్తుందన్న ఆర్థిక సూత్రం తారుమారైపోయింది. ప్రపంచీకరణ వాణిజ్య సామ్రాజ్యంలో బహుళ జాతీయ సంస్థలు విధాన నిర్దేశనం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగాన్ని ఈ విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు అప్పగించడం వల్ల దేశంలో వందల వేల విదేశీయ సామ్రాజ్యాలు మాత్రమే ఏర్పడుతున్నాయి. కానీ ప్రపంచీకరణ మొదలైన నాటినుంచి మన ప్రభుత్వం-ఏరాజకీయ పార్టీ నిర్వహణలో ఉన్నప్పటికీ-ప్రభుత్వరంగ సంస్థలను విదేశీయులకు అప్పగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. భారతీయ సంస్థలకు మాత్రమే అప్పగించినంతవరకు జాతీయత పరిధిలో వికేంద్రీకృత ప్రగతి విస్తరించే అవకాశం ఉంది. కానీ ప్రపంచీకరణ ఫలితంగా స్వదేశీయ విదేశీయ సంస్థల మధ్య అంతరాన్ని గుర్తించే అవకాశం లేకుండా పోతోంది. నష్టాలతో నడుస్తున్న 26 ప్రభుత్వ రంగ పారిశ్రామిక సంస్థలను మూసివేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందట. కొత్తకొత్త పరిశ్రమలను పథకాలను ప్రారంభించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. అంకురార్పణ-స్టార్ట్‌అప్-ప్రణాళిక కింద వందల వేల పరిశ్రమలు ఆరంభమైనాయి. అలాంటప్పుడు ఉన్న పరిశ్రమలను మూసివేడం ఈ అంకురార్పణ స్ఫూర్తికి విరుద్ధం కాదా? నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలకు ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించవచ్చు. కానీ నష్టాలు వస్తున్న ప్రభుత్వ సంస్థలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వేతర సంస్థలు సిద్ధంగా లేవట. అందువల్ల లాభాలు వస్తున్న సంస్థలలోని వాటాలను, మొత్తం సంస్థలను ప్రభుత్వేతర సంస్థలకు అమ్మివేయాలన్నది నీతి ఆయోగ్ ఇస్తున్న ఉచిత సలహా...
దేశాన్ని వాస్తవమైన ప్రగతికి దూరం చేస్తున్న ప్రపంచీకరణకు విరుగుడుగా స్వదేశీయ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని రూపొందించడానికి గత రెండేళ్లుగా కృషి జరపకపోవడం అసలు సమస్య. చిల్లర వ్యాపారంలోకి సైతం విదేశీయ సంస్థలు చొరబాటునకు వీలు కల్పించిన పదేళ్ల కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఆర్థిక విధానాలు 2014 మే 26 తరవాత కూడ నడచిపోతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలాలు, జన్యు పరివర్తక-జిఎం-పంటలు, విదేశీయ సంస్థలకోసం భారీగా భూమిని సేకరించడాలు, చదువుల రంగంలోకి, రక్షణ రంగంలోకి విదేశీయ సంస్థల చొరబాట్లు-ఇవన్నీ మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వ విధానాలు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కృత్రిమ ప్రగతి విధానాలను విడనాడిందా? కొనసాగిస్తోందా?