ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాశ్మీర్ స్వయంకృతాపరాధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ మళ్లీ భగ,్భగ మండుతోంది. నిట్ గొడవ ఆ తరువాత బాలికపై అత్యాచారం ఫిర్యాదు వ్యవహారం కాశ్మీర్‌లో పరిస్థితి గొడవకు దారి తీసింది. కాశ్మీర్‌లో వేర్పాటువాదులు ప్రతి అంశాన్ని గొడవకు దారి తీయిస్తున్నారు. గోరంతను కొండంతలు చేయటాన్ని ఒక విద్యగా మార్చుకున్నారు. క్రికెట్ మ్యాచ్‌లో భారత టీం ఓటమికి పండుగ చేసుకోవటంతోపాటు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో స్థానికేతరులపై దాడులు చేసి శాంతి, భద్రతల సమస్య సృష్టించారు. భద్రతా దళాలు తప్పు చేస్తే శిక్షించవలసిందేకానీ అయినదానికి, కాని దానికి గొడవ చేస్తుంటే ఎంత కాలమని సహిస్తారనేది ప్రశ్న. కాశ్మీర్ మాట,మాటకు భగ్గుమనటం మన పాలకుల స్వయంకృతాపరాధమే.
జమ్ముకాశ్మీర్ విషయంలో మన పాలకులు ఒక స్పష్టమైన విధానానికి కట్టుబడి ఉండకుండా రాజకీయావసరాలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్లనే ఇది రావణ కాష్టంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం గొడవలు ముఖ్యంగా విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యలాల్‌కు మన పేరు మోసిన ప్రతిపక్షం ఇచ్చిన ప్రాధాన్యత కాశ్మీర్ సమస్యకు ఇవ్వకపోవటం సిగ్గు చేటు. ఇటీవల జరిగిన క్రికెట్ పోటీల్లో భారత దేశం ఓడిపోవటం పట్ల పండగ చేసుకున్న వారిని ప్రతిపక్షం ఖండించకపోవటం మన ప్రజస్వామ్యానికి పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది. దేశ వ్యతిరేక నినాదాలు ఇస్తూ భారత్ ఓటమికి ఆనందంతో ఉత్సవం చేసుకున్న కొందరు నిట్ విద్యార్థుల వ్యవహారశైలికి వ్యతి రేకంగా నిరసన వ్యక్తం చేసిన మరికొందరు విద్యార్థులపై స్థానిక పోలీసులు పైశాచికంగా వ్యవహరించినా మన పేరుగాంచిన ప్రతిపక్షం నోరు విప్పదు.
అవకాశం లభించకగానే జె.ఎన్.యుకు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పరుగులు తీసిన మన నాయకులు శ్రీనగర్ నిట్ వైపు కనె్నత్తి కూడా చూడకపోవటం మన రాజకీయ వ్యవస్థ దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా జమ్ముకాశ్మీర్ ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అమలు చేయడంలేదు. కాలం గడిస్తే సరిపోతుందుకునే విధాన వల్లనే కాశ్మీర్ మాటి మాటికి భగ్గు మంటోంది. జమ్ముకాశ్మీర్‌తో పోలిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎలాంటి గొడవలు, గందరగోళాలుండవు. అసలక్కడ అసమ్మతనేదే కనిపించదు. ఆక్రమిత కాశ్మీర్‌లో లేని గొడవలు జమ్ముకాశ్మీర్‌లోనే ఎందుకు ఉన్నాయనేది ప్రశ్న. పేరుకు మాత్రమే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి అనే మాటే లేదు. పాకిస్తాన్ నియమాల ప్రకారమే అంతా నడుస్తుంది. దీనికి తోడు పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలిప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్ పాలకులు 1947 నుండే ఆక్రమిత కాశ్మీర్‌లో స్థానిక జనాభా రూపు లేఖలను పూర్తిగా మార్చి వేశారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్థానికుల సంఖ్య చాలా తక్కువ.
జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకాశ్మీర్‌కు రక్షణ, విదేశాంగ విధానం లాంటి కొన్ని అంశాలను మినహా మిగతా అన్నింటిలో స్వయంప్రతిపత్తి ఉన్నది. స్వంత ప్రధాన మంత్రి, స్వంత చట్టాలున్నాయి. భారత పార్లమెంటు ఆమోదించిన చట్టాలేవీ ఇక్కడ అమలు కావు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలను జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఆమోదించిన తరువాతనే అమలు జరుగుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు జమ్ముకాశ్మీర్‌లో ఆస్తిపాస్తులు కొనుగోలు చేసేందుకు వీలు లేదు. జమ్ముకాశ్మీర్ ప్రజలు మాత్రం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఆస్తిపాస్తులు కొనుగోలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సగటు భారతీయుడు మాత్రం ఇవేవీ జమ్ముకాశ్మీర్‌లో చేసేందుకు వీలు లేదు.
దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా జమ్ముకాశ్మీర్ మాత్రం భారత దేశంతో మమేకం కాలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే జమ్ముకాశ్మీర్‌ను భారత దేశంతో మమేకం కానివ్వకుండా అడ్డుకున్నది మన పాలకులే. ఆర్టికల్ 370 పేరుతో స్వయంప్రతిపత్తి కల్పించటం ద్వారా మన పాలకులు జమ్ముకాశ్మీర్‌ను దేశం జన జీవన స్రవంతికి దూరంగా పెట్టారని చెప్పకతప్పదు. భారత దేశంలో అంతర్భాగమంటూనే జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక గుర్తింపును కొనసాగించటం వల్లనే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా అక్కడ వేర్పాటు ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. స్వయంప్రతిపత్తికి మతం కూడా తోడు కావటంతో వేర్పాటువాదం తగ్గే బదులు పెరుగుతోంది. శ్రీనగర్‌లోని ఎన్.ఐ.ఐ.టిలో స్థానికులు స్థానికేతర విద్యార్థులపై దాడి చేసినప్పుడు స్పందించటం ప్రతిపక్షం బాధ్యత. అయితే ఓటు బ్యాంకు రాజకీయానికి అలవాటు పడిన ప్రతిపక్షం కూడా శ్రీనగర్ నిట్ వ్యవహారంపై పక్షపాతంతో వ్యవహరించింది తప్ప విశాల జాతీయ దృక్పదంతో ఆలోచించి పని చేయలేదు. జె.ఎన్.యు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్లినట్లే ప్రతిపక్ష నాయకులు శ్రీనగర్ నిట్‌కు కూడా వెళ్లి ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. నిట్‌ను శ్రీనగర్ నుండి మరో సురక్షిత ప్రాంతానికి తరలించాలంటూ విద్యార్థులు చేస్తున్న డిమాండ్‌ను ఎటువంటి పరిస్థితిలో కూడా ఒప్పుకోకూడదు. నిట్ లాంటి సంస్థల ద్వారా జమ్ముకాశ్మీర్ ప్రజలను దేశ జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు కృషి చేయాలి. ఈ లక్ష్య సాధన కోసం మరిన్ని జాతీయ విద్యా, రక్షణ, ఇతర సంస్థలను కాశ్మీర్‌లో ఏర్పాటు చేసి అక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాధికి చెందిన ప్రజలు వేలు,లక్షల సంఖ్యలో కనిపిస్తారు. ఇదే విధంగా దక్షిణాధిలోని రాష్ట్రాల్లో కూడా ఉత్తరాధి ప్రజలు తగు మోతాదులో నివసిస్తున్నారు. జమ్ముకాశ్మీర్‌లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసించేందుకు వీలు కల్పించాలి. కేవలం పర్యాటక కేంద్రంగా కాకుండా జమ్ముకాశ్మీర్ ను కూడా మినీ భారత దేశం చేయాలి.