ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మరీ ఇంత రాజకీయమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి అంశాన్ని ప్రతికూల రాజకీయాల కోసం దుర్వినియోగం చేయటం మన రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలం పరిశోధనా విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనను కూడా మన నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు తప్ప సమస్యను లోతుగా పరిశీలించి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించలేదు. ప్రాంతీయ రాజకీయ నాయకులతోపాట జాతీయ నాయకులు సైతం రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేశారు తప్ప దళిత, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి సమాజానికి పనికి వచ్చే పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించలేదు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సి.పి.ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సి.పి.ఐ కార్యదర్శి రాజా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,పార్లమెంటు సభ్యుడు డెరిక్ ఓబ్రేన్ తదితర మహామహులు హైదరాబాదులో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. వీరిలో ఏ ఒక్కరు కూడా రోహిత్ ఆత్మహత్య సంఘటనను సహేతుక దృష్టితో చూసి సమస్యకు సరైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించలేదు. వీరి దృష్టి అంతా బి.జె.పిని రాజకీయంగా బాదడంపై కేంద్రీకృతమైంది తప్ప అసలు సమస్య ఏమిటనేది అర్థం చేసుకోలేకపోయారు. జాతీయ రాజకీయ నాయకులు హైదరాబాదుకు రావటం, పోవటం అయిపోయింది, సమస్య సమస్యగానే ఉండిపోయింది.
దళిత్ అనగానే దానిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేందుకు సిద్ధమైపోయారు తప్ప ఎందుకిలా జరిగింది? ఉన్నత విద్యావంతుడైన ఒక యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా చూడాలంటే ఏం చేయాలి? అనే అంశంపై దృష్టి కేంద్రీకరించలేదు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు గుప్పించి చేతులు దులుపుకున్నారు. రోహిత్ తల్లి కోసం తమ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయనే ఒక హామీని పత్రికల ద్వారా పడవేసి తమ దారిన తాము వెళ్లిపోయారు.
తమ వద్దకు వచ్చిన వారి సమస్యల పరిష్కారం కోసం ఎం.పిలు, మంత్రులు లేఖలు రాయటం సర్వసాధారణం. ఎం.పిలు ఏ పార్టీకి చెందిన వారైనా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాయటం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయంలో కుల రాజకీయాలు, దేశ ద్రోహ రాజకీయాలు జరుగుతున్నాయని బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. అదే విధంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమతరావు కూడా విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ స్మృతి ఇరానీకి లేఖలు రాశారు. ఒకరు రాసిన లేఖ తప్పు, మరొకరు రాసిన లేఖ ఒప్పు ఎలా అవుతుంది? బండారు దత్తాత్రేయ లేఖ రాసిన మూలంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించటం సమర్థనీయం కాదు. బండారు దత్తాత్రేయ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కాడనేది ఈ నాయకులకు తెలియదా? రోహి త్ మాదిరిగానే బండారు దత్తాత్రేయ కూడా బడుగు,బలహీన వర్గాలకు చెందిన వ్యక్తే. బడుగు,బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి దళిత యువకుడి ఆత్మహత్యకు కారణం ఎలా అవుతారు? కాబట్టి స్మృతి ఇరానీ చెప్పినట్లు ఇది దళిత-దళిత వ్యతిరేకవర్గం గొడవ కానేకాదు.
కొందరు రాజకీయ నాయకులు రోహిత్ ఆత్మహత్యను దళిత సమస్యగా మార్చటం ద్వారా తమ పబ్బంద గడుపుకునేందుకు రాజకీయం చేశారు. హైదరాబాద్ జి.హెచ్. ఎం.సి ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకు కూడా కొందరు ఈ సంఘటనకు రాజకీయ రంగు పులిమారని చెప్పకతప్పదు. దళిత,బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారటం దురదృష్టకరం. దళిత, ఉన్నత విద్యా సంస్థల్లో దళిత, బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల పట్ల వివక్షత చూపించటం అనేది జగమెరిగిన సత్యం. బైటికి ఎవరెన్ని నీతులు చెప్పినా, ఈ వర్గాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పట్ల కూడా పక్షపాతం చూపించటం జరుగుతోంది. దీనిని రూపు మాపేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖళాలు లేవు. ఉన్నత విద్యా సంస్థల్లో సైతం సమభావ వాతావరణం నెలకొనకపోవటం సిగ్గు చేటు.
రాజకీయ నాయకులు ఒకరిపైమరొకరు దుమ్మెత్తిపోసుకునే బదులు రోహిత్ ఆత్మహత్యలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారిస్తే బాగుండేది. మానవవనరుల శాఖ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయటం హర్షణీయం. న్యాయ కమిషన్ ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులను అన్ని కోణాల నుండి అధ్యయనం చేసి అర్థవంతమైన సిఫారసులు చేసేలా చూడాలి. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారాలు చూపించే విధంగా న్యాయ కమిషన్ పరిధిని నిర్ణయించాలి. దీనితోపాటు దళిత, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయం పాలకుల మధ్య సమన్వయం పెంచేందుకు ప్రతిపాదించిన వివిధ చర్యలను వెంటనే అమలు చేయాలి. దళిత, బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల మానసిక స్థితిగతుల అధ్యయనం, తోడ్పాడు అందించటంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించటం మంచిది. ఒకరకంగా చెప్పాలంటే కేవలం దళిత, బడుగు,బలహీనవర్గాల విద్యార్థులకే కాకుండా విశ్వవిద్యాలయంలో విద్యార్థులందరికి ఈ సౌకర్యం కల్పించటం మంచిది. కుటుంబ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న విద్యార్థులకు ఇలాంటి సహాయం ఎంతో అవసరం. ఎంతో కష్టపడి విశ్వవిద్యాలయం వరకు వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకోవటం వలన విద్యార్థితో పాటు ఒక కుటుంబం కూడా సర్వస్వం కోల్పోతుంది, ఇలాంటి సంఘటనలను అరికట్టటం ఎంతో అవసరం.