సంపాదకీయం

రాజ్యాంగం...జాతీయ సమభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయత ప్రభుత్వ ‘మత’మని, దేశ ప్రజల ‘మత’మని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో చెప్పడం యుగయుగాల జాతీయ జీవన స్వభావానికి అనుగుణమైన వాస్తవం! ఈ జాతీయ జీవన స్వభావం సర్వమత సమభావం! భారత రాజ్యాంగం తమ పవిత్ర గ్రంథం అని చెప్పడం ద్వారా నరేంద్ర మోదీ మరో జాతీయ జీవన వాస్తవాన్ని ఆవిష్కరించారు. ఈ పవిత్ర గ్రంథం ఈ దేశ ప్రజల యుగాలనాటి సాంస్కృతిక వారసత్వానికి, దేశ ప్రజల సమష్టి మనఃప్రవృత్తికి మరో ధ్రువీకరణ! ఒక దేశ ప్రజల సమష్టి ప్రవృత్తికి అనుగుణంగా మాత్రమే ఆ దేశపు రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు వర్తిస్తున్న సనాతన సత్యం...‘సనాతనం’ అని అంటే ‘శాశ్వత’మని అర్ధం. తమ మతాన్ని తప్ప మిగిలిన మతాలను తమ నాగరికతను తప్ప మిగిలిన నాగరికతలను నిర్మూలించాలన్న వికృతి అనేక దేశాలలో ఆయా దేశాల ప్రజల సమష్టి స్వభావం కావడం భారతదేశానికి వెలుపల నడచిన చరిత్ర! భారత దేశం వెలుపల ఉన్న అనేక దేశాలలో ఇప్పుడు కూడ ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడి ఉండడం అంతర్జాతీయ వైపరీత్యం. తమ దేశంలోను, ప్రపంచంలోను ఒకే మతం-తమ మతం మాత్రమే- ఉండాలన్న వికృత మనఃప్రవృత్తి మతం మార్పిడులకు, ఉగ్రవాదానికి ఏకైక కారణమన్నది ప్రపంచ చరిత్ర నిర్ధారించిన వాస్తవం! ఇలా ‘ఏక మత స్థాపన’ లక్ష్యమైన మతోన్మాదులు మన దేశంలోకి సైతం చొరబడి జాతీయ స్వభావాన్ని చెరచి వేయడానికి, సర్వమత సమభావ విధ్వంసానికి యత్నించడం కూడ శతాబ్దుల చరిత్ర...1947 తరువాత ఈ జాతీయ స్వభావం భంగపడిన పాకిస్తాన్‌లో ఏక మతోన్మాద రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం, ఈ జాతీయ స్వభావం సజీవంగా భారత్‌లో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగుతుండడం జగమెరిగిన వాస్తవం! ‘సర్వమత సమభావం’ పేరు భారతీయత...్భరతీయత తమ ‘మతం’ అని చెప్పడం ద్వారా ప్రధాన మంత్రి అనాదిగా దేశ ప్రజల ‘సర్వమత సమభావ స్వభావాన్ని’ మరోసారి ధ్రువీకరించాడు! పవిత్ర గ్రంథమైన రాజ్యాంగం రూపొందడానికి ఈ స్వభావం కారణం...‘రాజ్యాంగం’వల్ల ఈ స్వభావం వికసించలేదు, ఈ సనాతన స్వభావం వల్లనే ఇలాంటి శుభంకరమైన పవిత్రమైన రాజ్యాంగం రూపొందింది. అందువల్ల ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలన్న నిర్ణయం ఈ దేశ ప్రజల సమష్టి స్వభావానికి చిహ్నం. క్రీస్తుశకం 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించింది, 1950 జనవరి 26 నుండి నూతన రాజ్యాంగం అమలు జరుగుతోంది! ఇలా నూతన రాజ్యాంగం ఏర్పడడం యుగాల భారతీయ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం! రాజ్యాంగం ఏర్పడడానికి పూర్వం లక్షల ఏళ్లుగా ఈ జాతి ఉంది, ఏర్పడిన తరువాత కూడ ఉంటోంది! అందువల్ల రాజ్యాంగం తరతరాల జాతీయ హృదయానికి వినూతన దర్పణం!
సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ మాత్రమే సకల వైవిధ్య సమాన భావ రాజ్యాంగావస్థ కూడ ఈ జాతీయ జీవనంలో అనాదిగా అంతర్భాగం...అందువల్లనే 1949 నవంబర్ 26న ఆమోదించిన రాజ్యాంగ పీఠికలో ప్రత్యేకించి ‘సర్వమత సమభావం’ అన్న మాటలను పొందుపరచాలని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమరావు అంబేద్కర్ మహాశయుడు భావించలేదు! అంబేద్కర్ అంతరంగాన్ని దేశ వ్యహారాల మంత్రి రాజ్‌నాధ్ సింగ్ లోక్‌సభలో మరోసారి ఆవిష్కరించారు!్భరతదేశంలో సర్వమత సమభావం, వైవిధ్యాల పరిరక్షక స్వభావం ప్రజల ఊపిరి వంటివి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొత్తగా నేర్పనక్కరలేదు! అవి సహజం..ఈ భారతీయ స్వభావాన్ని ఆపోశన పట్టిన అభినవ మహర్షి రాజ్యాంగ మంత్రద్రష్ట అంబేద్కర్ మహాశయుడు! సర్వమత సమాహారమైన భారత జాతీయత మాత్రమే ‘మతం’-అభీష్టం-అయినప్పుడు ‘అన్యమత విరోధం’ లేనేలేదు. ‘‘ఏకం సత్ విప్రాఃబహుధా వదన్తి’’-సత్యం ఒకటే పండితులు పలు విధాలుగా ఆ సత్యాన్ని ప్రబోధిస్తారు- అన్నది సర్వమత సమభావ భూమిక! అందువల్లనే ఈ దేశంలో అనేక మతాలు, భాషలు, విజ్ఞాన రీతులు, అసంఖ్యాక వైవిధ్యాలు సమాంతరంగా నిరంతరం వికసించాయి. ఈ ‘సత్యాన్ని’ గ్రహించని విదేశీయ సమాజాలలో ఇలా ‘సమాంతర వికసనం’ లేదు! ఒకదాన్ని నిర్మూలించిన తరువాత మరొకటి, ఇలా ఒకదాని తరువాత మరొకటిగా మాత్రమే మతాలు కాని వైవిధ్యాలు కాని ఆయా విదేశాలలో పరిఢవిల్లడం చరిత్ర...తమది కాని మతం కాని, నాగరికత కాని ‘అద్వితీయ సత్యం’లో భాగం కాదన్న భ్రమ పాశ్చాత్య దేశాలలోను, భారత్‌కు బయట ఉన్న దేశాలలోను అన్యమత విధ్వంసాన్ని సృష్టించింది. అసహిష్ణుత అదీ!!
కానీ అనంత వైవిధ్యాలు ‘అద్వితీయ సత్యం’లో భాగమని గ్రహించిన భారతీయులు తమ దేశాలలో తరిమివేతకు దమనకాండకు గురి అయిన విదేశీయ మతాలవారికి, జాతుల వారికి నిరంతరం ఆశ్రయం కల్పించారు, ఆత్మీయతను పంచిపెట్టారు. వివేకానంద స్వామి మాట ఇరవై రెండు ఏళ్లకు పూర్వం అమెరికాలోని చికాగోలో వివరించిన ఈ ‘్భరతీయ స్వభావాన్ని’ రాజ్‌నాధ్‌సింగ్ లోక్‌సభలో ప్రస్తావించడం సహిష్ణుతకు సత్యమైన నిర్వచనం! ఈ సనాతన స్వభావం సజీవంగా ఈ దేశంలో ‘అసహిష్ణుత’ అన్నది సూర్యకాంతి మండలంలో ‘చీకటి’ వంటిది! శతాబ్దులకు పూర్వం అసహిష్ణుతకు బలైపోయి, తమ దేశాలనుండి తరిమివేతకు గురి అయిన ‘యహూదీ’-యూదు-లకు, పారశీకులకు భారతదేశంలో మాత్రమే ఆశ్రయం లభించిన సత్యాన్ని వివేకానందుడు 1893 సెప్టెంబర్ పదకొండవ తేదీనాటి చికాగో సభలో ఫ్రపంచానికి గుర్తు చేశాడు. ఇదీ సహిష్ణుత! దీన్ని రాజ్‌నాధ్‌సింగ్ మరోసారి గుర్తు చేయడం భారతీయ స్వభావమైన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణం! ‘సహిష్ణుత’ నరేంద్ర మోదీ ప్రస్తావించిన భారతీయ మతం! అన్ని మతాలవారు ఈ భారతీయతకు నిబద్ధులు కావడం అనాదిగా ఈ దేశ చరిత్ర...‘మాతా భూమిః పుత్రోహం పృధివ్యాః’-మాతృభూమి తల్లి నేను ఈ మాతృభూమికి కుమారుడను, కుమార్తె’ను అని అన్ని మతాలవారు ఆలోచనారీతుల వారు భావించడం ‘్భరతీయత’...‘మొదట దేశహితం’ అన్నది భారతీయత! వివేకానందుడు, అంబేద్కర్ మహాశయుడు దీనే్న చెప్పారు! ఈ వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేరు, కాదనకపోవడమే రాజ్యాంగ స్ఫూర్తి, నూట ఇరవయ్యవ జయంతి వత్సరంలో అంబేద్కర్‌కు నివాళి!
రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించి పెంపొందించాలన్న విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం అనివార్య పరిణామం! అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన మార్గదర్శక నియమావళి-డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్-కి అనుగుణంగా కూడ చట్టాలను రూపొందించడంవల్ల మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తి సమగ్రం కాగలదు! నలబయి ఎనిమిదవ అధికరణంలో కోరిన విధంగా సమగ్ర గోవధ నిషేధపు చట్టాన్ని పార్లమెంటు రూపొందించాలి, నలబయి నాలుగవ అధికరణంలో నిర్దేశించిన విధంగా ‘ఉమ్మడి పౌరస్మృతి’-యూనిఫారమ్ సివిల్ కోడ్-నికూడ రూపొందించడం సమగ్ర సర్వమత సమభావ స్ఫూర్తికి అనుగుణం కాగలదు! రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకొనడం వల్ల మాత్రమే దాని పవిత్రత పదిలవౌతుంది!