సంపాదకీయం

మన మెతకతనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ విదేశాల ప్రభుత్వాలు మన అంతర్గత వ్యవహారాలలో తమ ‘వికృత ముఖాల’ను దూర్చుతుండడానికి కారణం ప్రధానంగా మన ప్రభుత్వం దశాబ్దుల తరబడి అనుసరిస్తున్న మెతక విధానం. గత ఐదేళ్లలో మన విదేశాంగ నీతి కొంత ‘కరకు’ తేలినప్పటికీ ప్రపంచ దేశాలు కొన్ని మన పట్ల తేలికభావం వహించి ఉన్నాయి. ‘‘ఇటుక విసరితే రాయితో జవాబు చెప్తాం’’- ఈంట్ కా జవాబ్ పత్థర్ సేదేంగే- అన్నది మన ప్రభుత్వ విధానంలో ఇప్పటికీ ప్రస్ఫుటించడం లేదు. ఈ విధానాన్ని - ఇటుక విసిరితే రాయితో జవాబుచెప్పే విధానాన్ని- మరింత తీవ్రంగా అనుసరిస్తున్న చైనా వంటి నియంతృత్వ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొనడానికి వివిధ దేశాలు సాహసించడం లేదు. నిజానికి చైనా ‘‘ఈగ వాలితే రోకలితో కొట్టే’’ విధానాన్ని అనుసరిస్తోంది. అందువల్ల వివిధ వర్గాల మానవ అధికారాలను పాశవికంగా అణచివేస్తున్న చైనా ప్రభుత్వాన్ని కనీసం విమర్శించడానికి సైతం వివిధ దేశాలు సిద్ధంగా లేవు, ఐక్యరాజ్యసమితి సిద్ధంగా లేదు! కానీ ఇటుకలు విసురుతున్న- మతోన్మాద రాజ్యాంగ వ్యవస్థలున్న, జిహాదీ స్వభావ ప్రభుత్వాలున్న- అనేక దేశాల ప్రభుత్వాల అక్రమ ప్రమేయాన్ని మన ప్రభుత్వం ‘నిరసించడం’తో సరిపెట్టుకొంటోంది! ఆయా దేశాల రాయబారులను మనదేశంనుంచి వెళ్లగొట్టడం లేదు, ఆయా దేశాలతో తెగతెంపులు చేసుకొనడం లేదు. ఆయా దేశాలకు వ్యతిరేకంగా ఆంక్షలను విధించడం లేదు! అందువల్ల దేశంలోని విద్రోహకారులు మన రక్షకులపై, సైనికులపై రాళ్లు విసురుతున్నారు. ఈ ‘రాళ్ల’ను మన దేశపు వ్యవహారాలలో అక్రమంగా జోక్యం చేసుకుంటున్న దేశాలు ప్రధానంగా ‘ఇస్లామీ మత రాజ్యాలు’ సరఫరాచేస్తున్నాయి... ఇప్పుడు ‘ఐక్యరాజ్యసమితి’ అధికార విభాగాలు సైతం మన దేశంపై ‘రాళ్ల’ను ‘విసురుతుండడం’ మన ‘మెతక విధాన’ ప్రభావానికి పరాకాష్ఠ.
మలేసియా, టర్కీ ప్రభుత్వాలు నోళ్లు పారేసుకున్నాయి... సరికొత్తగా ఇరాన్ ప్రభుత్వం ‘బరి’లోకి దిగింది! మన దేశంలో ‘ఇస్లాం మతస్థుల’ హక్కులకు భంగం కలుగుతోందన్నది ఈ దేశాల ప్రభుత్వాలు, ఇలాంటి దేశాల ప్రభుత్వాలు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణలో ఏమాత్రం సత్యం లేదన్నది ఈ దేశంలో హాయిగా జీవిస్తున్న ఇస్లాం మతస్థుల ప్రత్యక్ష అనుభవం! ఇలా ఆరోపిస్తున్న ప్రభుత్వాల దేశాలలో శతాబ్దులుగా సర్వమత సమభావ జీవన వ్యవస్థ లేదు, ఇస్లాం మత రాజ్యాంగాలు ఉన్నాయి. ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న యాబయికి పైగా దేశాలలో సర్వమత సమభావ వ్యవస్థలు లేవు. ఇస్లాం అధికార మతం, ఇస్లామేతర మతాలవారు ద్వితీయ, తృతీయ, చతుర్థ తరగతి పౌరులుగా జీవిస్తున్నారు. టర్కీ పేరునకు సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉన్నప్పటికీ ఆ దేశంలో ఇస్లామేతర మతాలవారు ఒక శాతం మాత్రమే ఉన్నారు. మలేసియా జనాభాలో వేద మతాలవారు, బౌద్ధమతం వారు తదితర హిందువులు ఇరవై నాలుగు శాతం ఉన్నప్పటికీ, అది ఇస్లాం మత రాజ్యంగా ఏర్పడి ఉంది! ఇరాన్‌లో ఇస్లాం మతోన్మాద సమాజ సమష్టి స్వభావం కావడం క్రీస్తుశకం ఏడవ శతాబ్దినుంచి కొనసాగుతున్న చరిత్ర! ప్రస్తుతం దాదాపు వంద శాతం ఇస్లాం మతస్థులున్న ఇరాన్‌లో ఏడవ శతాబ్దినాటికి ఒక్క ఇస్లాం మతస్థుడు కూడ లేడు. మొత్తం పారశీక మతస్థులు ఆ దేశంలో నివసించేవారు! దేశం పేరు ‘శక’స్థానం, పారశీక దేశం, పర్షియా... భారతదేశంనుంచి వేల సంవత్సరాల పూర్వం వలస వెళ్లి ‘శకస్థానం’- నేటి ఇరాన్-లో స్థిరపడిన పారశీకులు అగ్ని ఆరాధకులు. ‘ఇస్లాం’ మతం ప్రారంభమయిన కొన్ని సంవత్సరాలలోనే అరబ్బీ జిహాదీలు పారశీక దేశంలోకి చొరబడి మొత్తం పారశీకులను హత్యచేశారు, ఇస్లాంలోకి మార్చారు! కొన్ని లక్షల మంది పారశీక మతస్థులు మాత్రమే ప్రాణాలతో బయటపడి మన దేశంలోకి వచ్చి స్థిరపడినారు! భారతదేశంలోని ప్రజల సర్వమత సమభావ స్వభావానికి ‘జిహాదీ’ల ఏకమతోన్మాదానికీ తరతరాల సజీవ ప్రతీకలు పారశీకులు...
ఇలా పారశీక మత విధ్వంస భూమికపై పుట్టిపెరిగిన ఇస్లాం జిహాదీల మతోన్మాదం అన్ని ఇతర మతాలను ధ్వంసంచేయడమే లక్ష్యంగా శతాబ్దుల తరబడి బీభత్సకాండ సాగిస్తోంది! ఈ బీభత్స రాజ్యాంగ వ్యవస్థకు ప్రతి రూపమైన ఇరాన్ ప్రభుత్వం మన దేశంలో ‘సర్వమత సమభావా’నికి విఘాతం కలుగుతోందని విలపించడం ‘‘సూర్యుని వెలుతురును చూడలేని గుడ్లగూబ వికృత ధ్వని’’కి నిదర్శనం. ఇస్లాంను తప్ప మరో మతాన్ని సహించని ‘జిహాదీ’ ఇరాన్ ప్రభుత్వం, ఇస్లాంతో సహా అన్ని మతాలకు సమాన ఆదరణకు మన దేశాన్ని నిందించడం అనైతిక నిర్లజ్జకు నిదర్శనం!
ఇలాంటి దేశాలను దారికి తేవాలంటే ఈ దేశాలలో కూడ సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడేవరకు ఆ దేశాలను- గతంలో దక్షిణాఫ్రికాను బహిష్కరించినట్టు- అంతర్జాతీయ సభ్య సమాజం బహిష్కరించాలి. సర్వమత సమభావ వ్యవస్థ మన దేశంలోని మరికొన్ని ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే ఉంది. అందువల్ల ‘ప్రపంచ సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడినప్పుడు’ మాత్రమే అన్ని మతాల ప్రజలకు సమాన న్యాయం లభిస్తుంది! ఇలా ప్రతి దేశంలోను సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడి ఉండి ఉంటే పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలోని ఇస్లామేతర మతాలవారు మతోన్మాద జిహాదీ బీభత్సకాండకు బలి అయి ఉండేవారు కాదు, పైశాచిక హత్యాకాండకు గురి అయి ఉండేవారు కాదు, బతికి బయటపడిన ఇస్లాం మతేతరులు శరణార్ధులై మన దేశానికి తరలివచ్చి ఉండేవారు కాదు! ఈ శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించవలసిన అవసరం ఉండేది కాదు! అందువల్ల ఈ శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించడానికి వీలుగా మన పౌరసత్వపు చట్టంలో సవరణను చేయవలసి వచ్చిన అనివార్య పరిణామక్రమం గురించి విచక్షణకల న్యాయ బుద్ధికలవారందరికీ స్పష్టమైన అవగాహన ఏర్పడి ఉంది... ఇవి లేనివారు దుర్బుద్ధితో పౌరసత్వపు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు...
ఐక్యరాజ్యసమితి ‘మానవ అధికార నిర్వాహక కార్యాలయం’ ఆఫీస్ ఆఫ్ ది హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్- ఓహెచ్‌సిహెచ్‌ఆర్- వారు ఈ మన ‘పౌరసత్వ సవరణ చట్టం’ గురించి కల్పించుకోవడం అక్రమ ప్రమేయానికి పరాకాష్ఠ. ఈ ‘చట్టం’ రాజ్యాంగ బద్ధత గురించి సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ‘సమితి’కి చెందిన ఈ ‘మానవ అధికార నిర్వాహక కార్యాలయం’వారు భాగస్వాములు కావడానికి యత్నించడం విచిత్రమైన అతార్కికమైన అమానవీయ విపరిణామం! ఏకమత రాజ్యాంగ వ్యవస్థలున్న పాకిస్తాన్ వంటి దేశాలలోని ‘అల్పసంఖ్య మతస్థుల’ను ‘సమితి’ కాపాడలేక పోయింది. ఆయా దేశాలలో సర్వమత సమభావ వ్యవస్థను ఏర్పాటుచేయించడంలో డెబ్బయి ఐదేళ్లుగా ఐక్యరాజ్యసమితి విఫలమైంది! ఇలాంటి చేతకాని, చేవలేని ‘ఐక్యరాజ్యసమితి’ విభాగంవారు ‘సర్వమత సమభావ వ్యవస్థ’కు ఆదర్శమైన మన దేశంలోని ఒక మతంవారికి అన్యాయం జరుగుతోందని ప్రచారం చేయడం చైనా తదితర భారత వ్యతిరేకులు పన్నిన పన్నాగం... మన దేశానికి ‘సమితి’ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం కూడ ఈ కుట్ర ఫలితం...