సంపాదకీయం

‘బోడో’వాడలో ప్రభోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జరిపిన పర్యటన ‘శాంతి పథప్రస్థానం’లో మరో చారిత్రక ఘట్టం. ప్రధానమంత్రి ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించడం సహజం. అందువల్ల ఈ పర్యటనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. కానీ అస్సాంలోని కోక్రఝాడ్‌లో ఐదు లక్షల ‘బోడో’ వన వాసీ ప్రజలు పాల్గొన్న సభలో శుక్రవారం నరేంద్ర మోదీ ప్రసంగించడం సముజ్వల ఘట్టం... ఈ ఘట్టం అస్సాంలో మాత్రమే కాదు, సకల భారత సీమలలో వినూతన శాంతి ప్రభాతం! జనవరి 27వ తేదీన ఈ ప్రశాంతి ప్రస్ఫుటించింది. అస్సాం సీమలను ఏళ్లతరబడి రక్తసిక్తం చేసిన చీకటి అధ్యాయం ముగిసింది! ‘బోడో’ గిరిజనుల ప్రతినిధులకూ, అస్సాం ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఒప్పందం కుదరడం ఇరవై ఏడవ తేదీన ప్రస్ఫుటించిన శాంతి ప్రభాతం! కల్లోలగ్రస్తమై కలత చెందిన బోడో ప్రజలు ఈ ‘ప్రశాంతి’ శుభోదయ వేళ సరికొత్త ప్రగతిప్రస్థానం ప్రారంభించారు. ఈ ప్రగతి ప్రస్థాన ఆరంభానికి కోక్రఝాడ్‌లో శుక్రవారం జరిగిన మహాసభ శ్రీకారం. ‘ఒప్పందం’కుదిరినందుకు కృతజ్ఞతను ఆవిష్కరించడానికై ‘బోడో’ప్రజలు ఈ మహాసభను ఏర్పాటుచేశారట. దశాబ్దుల తరబడి ‘బోడో’ప్రాంతాన్ని, అస్సాంను భయగ్రస్తం చేసిన బీభత్సకాండకు అంతం జనవరి ఇరవై ఏడవ తేదీనాటి ఒప్పందం. అస్సాం నుండి నాలుగు ‘బోడో’ జిల్లాలను విభజించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న కోర్కెతో ‘బోడో భూమి’ ఉద్యమం దాదాపు నాలుగు దశాబ్దుల క్రితం మొదలైంది... ఈ ఉద్యమం దేశ విద్రోహ బీభత్సంగా మారడం తరువాత నడచిన కథ... ‘బోడో’ ప్రాంతాన్ని దేశంనుంచి విడగొట్టి ప్రత్యేక దేశంగా, స్వతంత్ర దేశంగా ఏర్పాటుచేయాలన్న విషవాంఛ కూడ పొటమరించింది... ఈ విపరిణామ క్రమానికి మూలకారణం బంగ్లాదేశ్‌నుంచి అస్సాంలోకి దశాబ్దుల తరబడి ‘జిహాదీ’లు చొఱబడడం. లక్షలాది అక్రమ ప్రవేశకులలో వేలకొలది ‘జిహాదీ బీభత్సకారులు’ ఉండడం అస్సాం ప్రజలను విషాదగ్రస్తం చేసిన చరిత్ర... అస్సాంలోని మైదాన ప్రాంతాల ప్రజలు, ‘నాగరికులు’ ‘చొఱబాటు’నకు పాల్పడిన బంగ్లాదేశీయులను నిరోధించలేకపోయారు! కానీ ‘బోడో’లు మాత్రం తమ గిరి సీమలలోకి ఈ అక్రమ బంగ్లాదేశీయులు ప్రవేశించకుండా నిరోధించడానికి నడుం బిగించారు! ‘బోడో’ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఇదీ నేపథ్యం... బోడో రాష్ట్ర ఉద్యమకారులలోని తీవ్రవాదులు బీభత్సకారులుగా మారి ప్రత్యేక దేశాన్ని కోరడానికి ఇదీ నేపథ్యం! ఇప్పుడు కుదిరిన ఒప్పందంలో భాగంగా ‘బోడో’ విచ్ఛిన్నకారులు తమ ‘ప్రత్యేక దేశం’ కోర్కెకు స్వస్తి చెప్పారు, ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించినవారు సైతం తమ కోరికను వదలుకొన్నారు... అస్సాంలో భాగంగానే బోడో ప్రాంతం అభివృద్ధి చెందాలన్నది ఒప్పందంలోని ప్రధాన అంశం... నరేంద్ర మోదీ పర్యటనకు ఈ ‘ఒప్పందం’ నేపథ్యం కావడం శుక్రవారం నాటి శుభ పరిణామం!!
ఈశాన్యంలోని వివిధ ప్రాంతాలలో దేశ విద్రోహపు బీభత్స ముఠాలు విజృంభించడానికి కారణం విదేశీయ ప్రభుత్వాల కుట్ర... ఈ కుట్ర దేశం బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తం అయినప్పటినుంచి కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ కుట్ర బ్రిటన్ బీభత్సపాలన వారసత్వం వ్యూహాత్మక దురాక్రమణకు కొనసాగింపు. మిజోరమ్, నాగాలాండ్ ప్రాంతాలను దేశంనుండి విడగొట్టి ప్రత్యేక దేశాలుగా మార్చాలన్న కుట్రకు ఐరోపా దేశాల ప్రభుత్వాల, ప్రభుత్వేతర సంస్థల మద్దతు కొనసాగడం దశాబ్దుల వైపరీత్యం. బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన కాలంలో ఐరోపాకు చెందిన ‘మతం మార్పిడి’ సంస్థలు ఈశాన్యంలోని అనేక ప్రాంతాలలో స్థానిక ప్రజలను మతం మార్పిడికి గురిచేశాయి. నాగాలాండ్, మిజోరమ్ ప్రాంతాలలో ఆ తరువాత విద్రోహ కలాపాలు పెరగడానికి, ‘ప్రత్యేక దేశాల’ విష వాంఛలు విస్తరించడానికి ఈ మతం మార్పిడులు కారణం! చైనా ప్రేరిత బీభత్సకారులు ఈశాన్య ప్రాంతాలను కల్లోలగ్రస్తం చేసిన రెండవ ముఠా... మణిపూర్ తదితర ప్రాంతాలలో పెరిగిన హింసకు ఈ ‘ముఠా’వర్గాలు కారణం! బంగ్లాదేశంనుంచి చొరబడిన ‘జిహాదీలు’ మూడవ ముఠా. ఇలా త్రివిధ బీభత్సశక్తులు ఈశాన్య ప్రాంతాన్ని కల్లోలగ్రస్తం చేశాయి, గత ఐదేళ్లుగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంవల్ల ఈ విద్రోహ బీభత్సకాండ కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ‘‘చాపకింది విషం’’వలె ఈ మూడు బీభత్స తండాలు ఈశాన్యమంతటా నక్కి ఉన్నాయి...
ఏ విదేశీయ దుష్టశక్తి కూడ ఏ భారత భూభాగాన్ని కూడ దేశంనుంచి వేఱుచేయ జాలదన్న శుక్రవారంనాటి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ‘్ధ్వని’ ఈ విద్రోహం పట్ల అభిశంసన... 2002లో ఆఫ్రికాలోని ‘డర్బన్’లో జరిగిన ఒక సమావేశం ‘స్వచ్ఛందం’ ముసుగువేసుకున్న కొన్ని అంతర్జాతీయ బీభత్స సంస్థలు, ప్రధానంగా ఐరోపా ‘ముఠాలు’ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. మన ‘‘ఈశాన్య ప్రాంతాలు విదేశీయుల పాలనలో మగ్గుతున్నాయన్నది’’ ఆ తీర్మానం ఇతివృత్తం. ఈ తీర్మానంపై చర్చ జరగడానికి సైతం ‘డర్బన్’ అంతర్జాతీయ సభలో వీలుకాలేదు. కానీ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రచ్ఛన్న బీభత్సశక్తుల గుట్టు ఆ ‘తీర్మానం’ద్వారా రట్టయింది! చైనా, ఐరోపా దేశాలు, ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలు తమ ‘‘శక్తి’’మేరకు ఈశాన్య ప్రాంతంలో విద్రోహకాండను పురికొల్పడం బహిరంగ రహస్యం! అందువల్లనే నాగాలాండ్‌లో విద్రోహకాండను జరుపుతున్న వారితో కేంద్రం జరుపుతున్న చర్చలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ‘బోడో’ఉద్యమం ఈ మూడు రకాల ముఠాల కుట్రల కంటె భిన్నమైనది. ‘బోడో’ఉద్యమం మిగిలిన మూడు ముఠాల- చైనా ముఠా, ఐరోపా ముఠా, జిహాదీ ముఠా- బీభత్సంవలె స్వభావాత్మకం కాదు, ఇది కేవలం బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకుల భూమి దురాక్రమణకు ప్రతిక్రియగా ప్రారంభమైంది! అందువల్ల ఈ చొఱబాటునుంచి తమకు రక్షణ కలుగుతుందన్న విశ్వాసం కలిగిన వెంటనే ‘బోడో’బీభత్సకారులు తమ కలాపాలను విరమించి ప్రశాంత జీవనులయ్యారు, జాతీయ ప్రధాన స్రవంతిలో భాగస్వాములయ్యారు.
బంగ్లాదేశ్ నుంచి దశాబ్దుల తరబడి చొఱబడిన అక్రమ ప్రవేశకులు వివిధ గ్రామాలలో, పట్టణాలలో స్థానిక ప్రజలను నిర్మూలించడం దశాబ్దుల వైపరీత్యం! స్థానికులను హత్యచేయడం, వారి భూములను దురాక్రమించడం, బాలికలను, యువతులను లైంగిక బీభత్సకాండకు బలిచేయడం వంటి పైశాచిక కాండను అస్సాంలోని అనేక జిల్లాలలో బంగ్లాదేశీయ జిహాదీలు కొనసాగించారు. కానీ బీభత్సచర్యలను ‘బోడో’లు ప్రతిఘటించారు. బ్రహ్మపుత్ర నది ఉత్తర తీరంలో విస్తరించిన చిరాంగ్, కోక్రఝాడ్, బాస్కా, ఉదయ్‌గుడి జిల్లాలలో ‘బోడో’వనవాసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ వనవాసీ ప్రాంతాలలోని ‘బోడో’ల భూములను దురాక్రమించడానికి బంగ్లాదేశీయ జిహాదీలు, అస్సాంలో స్థిరపడిన అక్రమ ప్రవేశకులు యత్నించడంతో ‘బోడో’లు వారిని తిప్పికొట్టారు! ఈ నాలుగు జిల్లాల ‘బోడో ప్రత్యేక ప్రాంతీయ మండలం’ హింసాగ్రస్తం కావడానికి ఇదీ కారణం. ‘జాతీయ పౌర సూచిక’ ఏర్పడడంతో ‘బోడో ప్రాంతం’లోకి విదేశీయులు చొఱబడే ప్రమాదం అంతమైంది. ఇరవయి ఏడవ తేదీనాటి చారిత్రక పరిణామానికి ఇది ప్రధాన కారణం! ఒప్పందం ప్రకారం ఈ నాలుగు జిల్లాల ‘మండలి’పేరు మారింది, ‘బోడో ప్రాంతీయ భౌగోళిక మండలం’- బోడో లాండ్ టెర్రిటోరియల్ రీజియన్- ఏర్పడింది, అస్సాంలోనే కొనసాగనుంది... బోడో భాష అస్సాంలో రెండవ అధికార భాష కానుంది...