సంపాదకీయం

సౌరశక్తి ‘సౌరభం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌరశక్తి ప్రాధాన్యం పెరుగుతుండడం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ‘ఆర్థిక సర్వేక్షణ’- ఎకనామిక్ సర్వే-కు అంతర్గత నేపథ్యం! ప్రభుత్వం సాధించ తలపెట్టిన ‘మూడు కోట్ల యాబయి లక్షల కోట్లు’ రూపాయల- ఐదు ట్రిలియన్ అమెరికా డాలర్ల- ఆర్థిక వ్యవస్థ ఎప్పటికి సాకారం అవుతుందన్న ప్రశ్నకు సమాధానం ప్రపంచీకరణ కబంధ బంధంనుంచి మనం బయటపడడం! ఇలా బయటపడే వరకు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దళారీలు మన ‘పరపతి’ స్థాయి గురించి వ్యతిరేక నిర్ధారణలు చేస్తూనే ఉంటారు. మన స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల వేగం తగ్గిపోతోందన్న బెదిరింపులను ఆవిష్కరిస్తూనే ఉంటాయి! ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- దాదాపు ఆరున్నర శాతం పెరగ గలదన్నది ‘ఆర్థిక సర్వేక్షణ’లోని ప్రధాన అంశం! ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’- ఇంటర్ నేషనల్ మానిటరీ ఫండ్- ఐఎమ్‌ఎఫ్-, ‘ప్రపంచ బ్యాంకు’- వరల్డ్ బ్యాంక్- వంటి సంస్థలు, మన ‘జిడిపి’పెరుగుదల ఐదుశాతం కంటె తగ్గుతుందన్న నిర్ధారణలు చేశాయి. ఈ నిర్ధారణలను మన ప్రభుత్వం తోసిపుచ్చడం పెరుగుతున్న ఆర్థిక విశ్వాసానికి ప్రతీక! బాహ్యశక్తుల నిర్ధారణలు, బెదిరింపులను పట్టించుకోకుండా ‘అంతర్గత’ కృషి ద్వారా ఆర్థిక సౌష్టవాన్ని పెంచుకోవాలన్న ప్రభుత్వ విశ్వాసం ‘ఎకనామిక్ సర్వే’ ద్వారా ప్రస్ఫుటించింది. ఈ విశ్వాసం ప్రాతిపదికగా ఈ దశాబ్దిలోనైనా మన దేశం ‘ప్రపంచీకరణ’ మాయాజాలం నుంచి ఆర్థిక విముక్తిని సాధించాలి. అలా సాధించినప్పుడు మాత్రమే అంతర్గతమైన వనరుల ఆధారంగా మన ‘జిడిపి’ని పెంచుకోగలం. ఈ కర్తవ్య నిర్వహణలో మన ప్రభుత్వం ఎంతవరకు కృతకృత్యం కాగలదన్నది మన ‘జిడిపి’ పెరుగుదలకు ప్రాతిపదిక! ఈ దశాబ్ది-రానున్న పది ఏళ్లు- కర్తవ్య నిర్వహణ దశాబ్ది కావాలన్నది శుక్రవారం పార్లమెంటు సమావేశంలో ప్రసంగించిన రామనాథ కోవింద్ చెప్పిన హితవు. ‘ప్రపంచీకరణ’ వలయం నుంచి అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు సైతం బయటపడడానికి యత్నిస్తున్నాయి. అందువల్ల మన దేశం కూడ ఈ కర్తవ్య నిర్వహణకు పూనుకోవాలి! విదేశాల పెట్టుబడులపై, భాగస్వామ్యంపై ఆధారపడకుండా అంతర్గత ఆర్థికబలం ప్రాతిపదికగా ప్రగతి సాధించగలమన్నది 2014వ సంవత్సరంనాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘్భరతీయ జనతాపార్టీ’ చేసిన వాగ్దానం. ఆరేళ్లు గడిచాయి! దిగుమతులను గణనీయంగా తగ్గించుకొనడం ‘జిడిపి’ పెరుగుదలకు దీర్ఘకాల ప్రాతిపదిక... ఐదేళ్లు కావచ్చు పదిహేను ఏళ్లు కావచ్చు!! ఇంధన తైలం, ఇంధన వాయువుల దిగుమతులు తగ్గిపోవాలి! ఇందుకు అంతర్గత ప్రత్యామ్నాయం సౌర ఇంధనం వినియోగాన్ని పెంచడం...
సూర్యుడు మానవాళిని పెంపొందిస్తున్న సహజ జీవశక్తి... మానవులకు మాత్రమే సకల జీవజాలానికి ప్రాణశక్తి సూర్యుడు! వెలుగును వేడిమిని ప్రసాదిస్తున్న సూర్యుడు వర్షం కురిపిస్తున్నాడు, వర్షం ద్వారా ‘అన్నం’ తయారవుతోంది. ‘అన్నం’ జీవజాలానికి జవసత్వాలను ప్రసాదిస్తున్న అమృతం! అందువల్ల ‘‘సూర్యః ఆత్మా జగతః తస్థుషః’’- సూర్యుడు చరాచర జగత్తునకు ఆత్మ-అన్న సృష్టిగత వాస్తవాన్ని భారత జాతి అనాదిగా సమాజ జీవన స్థితం చేసుకొంది! ‘‘మిత్రః పృథివీం ఉతద్యాం దాధార’’- సూర్యుడు భూమిని అంతరిక్షాన్ని ధరించిన- వాస్తవాన్ని కూడ వేద ఋషులు, భారతీయులు అనాదిగా ఆవిష్కరించారు! ఈ సనాతన వాస్తవానికి ఆధునిక ఆవిష్కరణ సౌరశక్తి ద్వారా విద్యుచ్ఛక్తిని తయారుచేయడం. మన దేశం వంటి ‘సమశీతోష్ణ మండల’ భూమిపై నెలకొన్న దేశాల సూర్యుడు ఏడాది పొడవునా పుష్కలంగా కాంతిని ప్రసరింప చేస్తున్నాడు. అందువల్ల సూర్యుడికి కృతజ్ఞతలను తెలుపడం భారతీయ సమాజ నిహితమైంది. ‘సంధ్యావందనం’ సూర్యుని గతిపై ఆధారపడి ఉన్న మానవ జీవన ప్రక్రియ! సూర్యుడు బుద్ధిని ప్రచోదనం చేస్తున్నాడన్న వాస్తవం గాయత్రీ మంత్రం!! ఈ ఖగోళ, ప్రాకృతిక వాస్తవం ప్రపంచంలోని సకల జీవజాలం మనుగడకు ప్రాతిపదిక! గుర్తించని వారు సూర్యుడిని కేవలం అగ్నిగోళంగా భావిస్తున్నారు. గుర్తించిన భారతీయులు అనాదిగా సూర్యుడిని ప్రాణప్రదాతగా ఆరాధిస్తున్నారు! ‘రథ సప్తమి’ ఈ ఆరాధనకు కృతజ్ఞత ఆవిష్కరణకు ప్రత్యేక ప్రతీక!!
వివిధ ఇంధనాల వినియోగంవల్ల ప్రకృతి కాలుష్యగ్రస్తం అవుతోంది. అంతేకాదు ఈ ఇంధన నిక్షేపాలు పరిమితంగా ఉన్నాయి. నిరంతరం వినియోగంవల్ల ఈ ఇంధనాల నిక్షేపాలు ఏదో ఒక రోజున అంతరించి పోవడం ఖాయం... వంద ఏళ్లు పట్టవచ్చు రెండు వందల ఏళ్లు పట్టవచ్చు! బొగ్గు, చమురు, ఇంధన వాయు నిక్షేపాలు అంతరించే లోగా మరోచోట సహజంగా ఈ ఇంధనాల నిక్షేపాలు ఏర్పడుతాయన్న విశ్వాసం కూడ లేదు. అందువల్ల విద్యుచ్ఛక్తి ఏకైక ఇంధనంగా ఎప్పుడో అప్పుడు ఏర్పడక తప్పదు. బొగ్గు ద్వారాను, అణు ఇంధనం ద్వారాను విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేసే ప్రక్రియవల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది! బొగ్గువాడకం పూర్తిగా తగ్గించాలన్నది పర్యావరణ కాలుష్య నివారణకు ‘పారిస్’ సదస్సులో చేసిన నిర్ధారణ... అందువల్ల జల విద్యుచ్ఛక్తి, సౌర విద్యుచ్ఛక్తి వాడకం, ఉత్పత్తిపెరగడం అనివార్యమైన పరిణామక్రమం! జల, వాయు, సౌర- అగ్ని- మూడు ప్రాకృతిక శక్తులు... భూమి, ఆకాశం ‘పంచభూతాల’లోని మిగిలిన రెండు! అందు ప్రాకృతిక ధాతువుల ప్రాతిపదికగా విద్యుత్ ఇంధనాన్ని తయారుచేయడం ప్రకృతి ప్రక్షాళనకు దోహదకరం. ‘‘పంచభూత భాసితమైన’’ ప్రకృతిలో నిజానికి ఈ మూడువిధాల విద్యుత్ ఇంధనాలు నిహితమై ఉన్నాయి. అందువల్ల సౌరశక్తి ప్రాధాన్యం పెరిగినకొద్దీ అంతర్జాతీయ సమాజం మన దేశం ప్రాధాన్యం పెరగడం ఖాయం!
సమశీతోష్ణ భూమండలాన్ని ‘సౌరశక్తి మండలం’గా గుర్తించడం మన ప్రభుత్వం సాధించిన విజయం. సూర్యుని సాపేక్ష ‘చలనం’ ప్రాతిపదికగా ఏర్పడిన సనాతన- శాశ్వత- భౌగోళిక స్థితి ఈ సౌరశక్తి మండలంలో మన దేశానికి సహజమైన నాయకత్వం కట్టబెట్టింది. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఇరవై మూడున్నర ‘్భగ’-డిగ్రీ-ల అక్షాంశంపై మకరరేఖ- కాప్రీకార్న్- ఏర్పడి ఉంది! భూమధ్య రేఖకు ఉత్తరంగా ఇరవై మూడున్నర ‘్భగ’ల అక్షాంశంపై కర్కటకరేఖ- కాన్సర్- ఏర్పడి ఉంది! భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ రెండు ‘రేఖ’ల మధ్య ఉన్న-మకర రేఖకూ, కర్కాటక రేఖకు మధ్య ఉన్న- భూమండల ప్రాంతంలోనే సూర్యుడు ‘సాపేక్షం’గా సంచరిస్తున్నాడు. ఈ ప్రాంతంలో మాత్రమే సూర్యుడు నిటారుగా పెరుగుతున్నాడు. అందువల్ల ఈ సమశీతోష్ణ మండలం దేశాలలో సౌరశక్తి వనరులు అపారం, అత్యధికం, అనంతం! చైనా, జపాన్, అమెరికా, బ్రిటన్, రష్యా వంటి సంపన్న దేశాలు ఈ సమశీతోష్ణ భూమండలానికి వెలుపల నెలకొని ఉన్నాయి. ఈ సమశీతోష్ణ మండలంలోని అతి ప్రముఖ దేశం భారతదేశం. అందువల్ల మన ప్రభుత్వం చొరవతో ఏర్పడిన ఈ ‘సౌరశక్తి మండల దేశాల కూటమి’ నాయకత్వం సహజంగా మన దేశానికి లభించింది. ‘కూటమి’కార్యాలయం మన దేశంలో నెలకొని ఉంది. భారతదేశానికి లభించిన ఈ ప్రాధాన్యం సూర్యుడు ప్రసాదిస్తున్న వరం! వికసించిన వెలుగుల ‘పువ్వుల’ సుగంధం సౌరశక్తి!! ‘రథ సప్తమి’నాడు ఈ ‘సుగంధపు’ కాంతి కిరణ పుష్పాలతోనే వెలుగుల ప్రదాతను పూజించడం సహజ సనాతన ప్రాకృతిక సంప్రదాయం.