సంపాదకీయం

‘పండిత’ విషాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్‌లోని ‘లోయ’ ప్రాంతంలో ‘సర్వమత సమభావ’ వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకొనకపోవడం కొనసాగుతున్న విషాదం. లక్షలాది కశ్మీరీ హిందువులు దశాబ్దులుగా శరణార్ధులుగా జీవించవలసి రావడం ఇందుకు ప్రధాన నిదర్శనం. ఈ హిందువులు ప్రధానంగా కశ్మీరీ పండితులు. క్రీస్తుశకం 1947లో అఖండ భారత విభజన జరగడం ఈ ‘పండితుల’ విషాద గాథకు ఆరంభం... 1947నుంచి జిహాదీ బీభత్సకారులు మన జమ్మూకశ్మీర్‌లోకి చొఱబడుతూనే ఉన్నారు. ఇస్లాం మతేతరులను నిర్మూలించడం ‘జిహాదీ’ల లక్ష్యం! అందువల్ల 1947 నుంచి జమ్మూకశ్మీర్‌లో ఇస్లాం మతేతరుల నిర్మూలన జరిగింది. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్‌లో 1948 ఆరంభం నాటికి ఈ నిర్మూలన పూర్తయింది! ‘జిహాదీ’లు ఇస్లామేతర మతాల వారిని హత్యచేయడం, అత్యాచారాలకు బలిచేయడం, బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, తరిమివేయడం ఈ ‘నిర్మూలన’లోని నాలుగు ప్రధాన దౌష్ట్యాలు! ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉండి ఇస్లాం మతేతరులు అల్పసంఖ్యాకులుగా ఉన్న దాదాపు ప్రతిచోట, ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో ‘జిహాదీ’లు ఈ ‘‘దౌష్ట్య చతుష్టయాన్ని’’ మరింత కిరాతంగా అమలుజరుపుతుండడం శతాబ్దుల అంతర్జాతీయ చరిత్ర! అందువల్లనే 1947నాటికి ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులైన కశ్మీర్ ‘లోయ’ ప్రాంతంలోను, ‘పాకిస్తాన్ దురాక్రమిత జమ్ముకశ్మీర్’- పాకిస్తాన్ ఆకుపైడ్ జమ్ముకశ్మీర్- పిఓజెకె-లోను ఇస్లాం మతేతరుల నిర్మూలనం దశాబ్దుల క్రితమే పూర్తయింది. 1990లో కశ్మీర్ లోయ ప్రాంతంలో మిగిలిన దాదాపు నాలుగు లక్షల హిందువుల- కశ్మీరీ పండితుల- నిర్మూలన జరిగింది! ఈ నాలుగు లక్షల మంది కశ్మీర్ లోయను వదలి, యుగయుగాలు జీవించిన తమ పల్లెలను, బస్తీలను వదలి, ఇళ్లను పొలాలను వదలి, ఆవులనూ ఆలయాలను వదలి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలి వచ్చేశారు. కొన్ని వేల మంది ఇతర దేశాలలో సైతం ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఈ ‘‘1990నాటి పండితుల నిర్మూలన’’కు ముప్పయి ఏళ్లు పూర్తిఅయ్యాయి! వీరంతా శరణార్ధులుగా జీవిస్తున్నారు. ముప్పయి ఏళ్ల విషాద గాథ సుఖాంతం అయ్యేదెప్పుడన్నది సమాధానం లేని ప్రశ్న!!
ఇది కేవలం కొన్ని లక్షల మంది ‘పండితుల’ మనుగడకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. మన దేశంలో అనాదిగా వికసిస్తున్న సర్వమత సమభావ స్వభావ అస్తిత్వానికి సంబంధించిన సమస్య! అఖండ భారత్‌లో అనాదిగా అనేక హైందవ మతాలు, స్వజాతీయ మతాలు పరిఢవిల్లాయి. హిందూ జాతీయ తత్త్వం సర్వమత సమభావ భూమికపై వికసించడం చరిత్ర. అనేక మతాలు ఉన్నప్పటికీ ‘మత రాజ్యాంగ వ్యవస్థ’ మన దేశంలో ఏర్పడలేదు. ఒక మతం వివక్షకు గురికావడం కాని, మరో మతం అక్రమ ప్రయోజనం పొందడం కాని జరుగలేదు. విదేశాలనుంచి వేఱువేఱు సమయాలలో మన దేశంలోకి వ్యాపించిన ఇస్లాం, క్రైస్తవం, పారశీక, యూదు మతాలు కూడ ఈ హైందవ జాతీయ ‘సర్వమత సమభావ’ స్వభావంవల్ల సమాన ప్రయోజనం, ప్రగతి పొందడం చరిత్ర! ‘అఖండ భారత్’ మొత్తంమీద 1947వరకు సర్వమత సమభావ వ్యవస్థ కొనసాగింది. ఇస్లాం సహా అన్ని మతాలవారు సమాన ప్రతిపత్తితో జీవించారు. ‘అఖండ భారత్’ మొత్తంమీద హిందూ జాతీయ మతాలవారు అధిక సంఖ్యలో ఉండేవారు! 1947లో అఖండ భారత విభజన జరిగిన తరువాత పాకిస్తాన్ ప్రాంతంలో ఇస్లాం మతం అనుయాయులు అధిక సంఖ్య వారయ్యారు. అవశేష భారత్‌లో ఇస్లాం మతస్థులు అల్పసంఖ్య వారయ్యారు. ఇస్లాం మతస్థులు అల్పసంఖ్యలో ఉన్న ‘అవశేష భారత్’లో అనాదివలె ‘సర్వమత సమభావ’ సామాజిక వ్యవస్థ కొనసాగుతోంది. కానీ ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో మిగిలిన పాకిస్తాన్‌లో ‘సర్వమత సమభావ’ సమాజం భ్రష్టమైపోయింది! ఇస్లాం మతస్థులు అల్పసంఖ్యలో ఉన్నచోట-అవశేష భారత్‌లో- ఇస్లాం మతస్థులు అధిక సంఖ్య మతాలవారితో సమానంగా హాయిగా జీవిస్తున్నారు. ఇస్లాం మతస్థులు తరిమివేతకు, హత్యాకాండకు గురికాలేదు, కావడం లేదు. అవశేష భారత్‌నుంచి ఇస్లాం మతస్థులు ఎవ్వరూ ప్రాణభయంతో పాకిస్తాన్‌కు, ఇతర దేశాలకు పారిపోవడం లేదు! కానీ ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నచోట- పాకిస్తాన్‌లో- ఇస్లాం మతేతరులు తరిమివేతకు, హత్యాకాండకు, అత్యాచారాలకు, మతం మార్పిడులకు గురిఅవుతున్నారు. డెబ్బయి రెండేళ్లకు పైగా ఈ విషాద గాథ నడుస్తోండడం నిరాకరింపజాలని నిజం...
పాకిస్తాన్‌లో జరిగిన కథ జమ్మూకశ్మీర్‌లోని లోయ ప్రాంతంలోను పాకిస్తాన్ దురాక్రమిత జమ్ముకశ్మీర్‌లోను సమాంతరంగా కొనసాగడం చరిత్ర. 1947నాటికి ఇస్లాం మతస్థులు ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు! దీనివల్ల స్పష్టంఅవుతున్న వాస్తవం జిహాదీల స్వభావం! ఇస్లాం మతస్థులు అల్పసంఖ్యలోను అత్యల్పసంఖ్యలోను ఉన్నచోట ‘జిహాదీ’లు ప్రబలడం లేదు. అందువల్ల మన దేశంలో ఇస్లాం మతస్థులు అల్పసంఖ్యలో ఉన్నందువల్ల ‘సర్వమత సమభావ వ్యవస్థ’ పరిఢవిల్లుతోంది, పదిలంగా ఉంది. దీనివల్ల ఇస్లాం సహా అన్ని మతాలవారు హాయిగా ఉన్నారు. ఒక పల్లెలో వంద కుటుంబాల ఇస్లామేతర మతస్థుల కుటుంబాల మధ్య ఒకటి, రెండు, మూడు నాలుగు ఇస్లాం మతస్థుల కుటుంబాలవారు ఉంటున్నారు, హాయిగా జీవిస్తున్నారు. లక్షలాది పల్లెలలో పట్టణాలలో ఇదే సర్వమత సమభావం నెలకొని ఉంది. ఇలా ఇస్లాం మతస్థులు అత్యల్పసంఖ్యాకులైనచోట కూడ వారిని ఎవ్వరూ తరిమివేయడం లేదు. దేశమంతటా ఇదే సామరస్యం, సమన్వయం, సర్వమత సమభావం నెలకొని ఉండగా కశ్మీర్ లోయలో మాత్రం ఈ సర్వమత సమభావ జాతీయ సంస్కారం నష్టమైపోయింది! అందువల్ల దేశమంతటా ఇస్లాం మతస్థులు అల్పసంఖ్యలో ఉన్నచోటల్లా సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడి ఉందన్న, ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న కశ్మీర్ ‘లోయ’లోను, పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంతంలోను ‘జిహాదీ’లు సర్వమత సమభావ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారన్న వాస్తవాలను నిష్పక్ష బుద్ధికల వారందరూ అంగీకరించక తప్పదు!!
అందువల్ల ‘‘సర్వమత సమభావం’పట్ల నిజంగా నిబద్ధత ఉన్న వారందరూ దేశమంతటా ఏర్పడి ఉన్న ఈ మానవీయ సర్వమత సమభావ వ్యవస్థను కశ్మీర్ ‘లోయ’ ప్రాంతానికి విస్తరింపచేయడానికి కృషిచేయాలి! ఎంతమంది కృషిచేస్తున్నారు, ఎందరికి ధ్యాస ఉంది??
ధ్యాస ఉన్న ప్రజలు ప్రభుత్వాలు కశ్మీర్ లోయనుంచి తరిమివేతకు గురి అయిన ఇస్లామేతరులను, అల్పసంఖ్యాకులను, కశ్మీరీ పండితులను తిరిగి వారి స్వస్థలాలకు, స్వగ్రామాలకు పంపించడానికి ఉద్యమించాలి! నిజానికి 1990కి పూర్వం కూడా దాదాపు రెండు లక్షల మంది హిందువులు- పండితులు- ‘లోయ’ప్రాంతం నుంచి తరిమివేతకు గురిఅయ్యారు. ఇలా దాదాపు పది లక్షల ‘కశ్మీరీ’ అల్పసంఖ్యాకులు, ఇస్లామేతరులు, పండితులు స్వదేశంలోనే శరణార్ధులై జీవిస్తున్నారు. బంగ్లాదేశ్‌నుంచి, బర్మానుంచి అక్రమంగా చొఱబడి మన దేశంలో తిష్ఠవేసి ఉన్న దేశ వ్యతిరేకుల ‘హక్కుల’కోసం ఆర్భాటం చేస్తున్నవారు భరతమాత బిడ్డలైన కశ్మీరీ ‘శరణార్థుల’కు న్యాయం జరగాలని ఎందుకు కోరడం లేదు??