సంపాదకీయం

విధ్వంస కారణం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ విద్వేషాన్ని ‘సైద్ధాంతిక నిష్ఠ’గా ప్రచారం చేసుకొనడానికి యత్నిస్తున్నవారు వీధులలో విధ్వంసం సృష్టిస్తుండడం జాతీయ వైపరీత్యం... పౌరసత్వ సవరణ ప్రతిపాదనను వ్యతిరేకించడం ఆరంభం! ఈ వ్యతిరేకతను అతిగమించి ‘పార్లమెంటు’, పౌరసత్వ సవరణ ప్రతిపాదనను ఆమోదించింది. ‘ప్రతిపాదన’-బిల్లు- చట్టంగా మారింది. చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారికి రాజ్యాంగ పద్ధతుల గురించి తెలుసు, కానీ వీధులలో వికృత తాండవం చేశారు, విశ్వవిద్యాలయాలలోకి చొఱబడి భయంకర బీభత్సకాండను సృష్టించారు. విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో బుసలుకొడుతూ నక్కి ఉండిన ‘బౌద్ధిక బీభత్సం’-ఇంటెలెక్చువల్ టెర్రరిజమ్- భౌతిక రూపం దాల్చి బాహాటంగా విషం కక్కింది. రాజ్యాంగ పద్ధతులను ప్రభుత్వ పక్షంవారు ధ్వంసంచేశారని విమర్శించిన కాంగ్రెస్ వారు ఇతర పక్షాలవారు ఈ భౌతిక బీభత్సకాండను రెచ్చగొట్టారు, నిర్వహించారు, సమర్ధించారు! ‘‘పార్లమెంటు చేసిన చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు జరుపబోము...’’అని ముఖ్యమంత్రులు ప్రకటించడం రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణమా? రాజ్యాంగ విధ్వంసమా?? కేంద్ర ప్రభుత్వ పక్షమైన ‘్భరతీయ జనతాపార్టీ’ని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నించడం ప్రతిపక్షాల హక్కు... ప్రయత్నించవచ్చు! కానీ చిత్రవిచిత్ర వాదాల ద్వారా ‘రాజ్యాంగ వ్యవస్థల’ను ధిక్కరిస్తున్నవారు అంతర్జాతీయ సమాజంలో దేశానికి అపకీర్తిని తెచ్చిపెట్టారు. ‘‘్భరతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఎవరికో ఏదో అన్యాయం చేస్తోందన్న’’ ప్రచారం అంతర్జాతీయ సమాజంలో మొదలైంది. ఇలా కావడానికి వీధులలోను, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలోను బీభత్సం సృష్టిస్తున్నవారు కారకులు! ‘‘పౌరసత్వ సవరణ చట్టం’’వల్ల పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ‘జిహాదీ’ల ఊచకోతకు గురికాకుండా బతికి బయటపడి శరణార్థులై మన దేశానికి వచ్చిన అభాగ్యులకు మన దేశం పౌరసత్వం లభిస్తోంది!! ‘‘లభించరాదని’’ గొంతులు చించుకున్నవారు మానవత్వపు హృదయాలు ఉన్నవారా?? రాక్షసత్వానికి సజీవ రూపాలా?? ఈ ‘పౌరసత్వ సవరణ చట్టం’- ‘సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్, సిఏఏ- పట్ల కల వ్యతిరేకత ‘జాతీయ పౌర సంకలనం’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్‌ఆర్‌సి పట్ల- వ్యతిరేకతగా ఎందుకు మారింది?? తొండ ముదిరి ఊసరివెల్లి అయింది! ‘ఊసరవెల్లి’ మరింత ముదిరి ‘తోడేలు’గా మారి రాజ్యాంగ వ్యవస్థలపై దూకుతోంది! ‘జాతీయ జన సంకలనం’-నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- కూడ ఏర్పడరాదట!! ‘జనగణన’ నియతంగా పదేళ్లకోసారి నియతంగా జరుగుతున్న జాతీయ కార్యక్రమం రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం! ఇది కూడ జరగరాదట! దేశవ్యాప్తంగా విధ్వంసకాండను కొనసాగిస్తున్న ‘రాజ్యాంగ విద్రోహులు’చేస్తున్న వాదం ఇది. ‘సిఏఏ’, ఎన్‌ఆర్‌సి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పిఆర్-లను వ్యతిరేకిస్తున్నవారు ‘మత ప్రదాతల సంకలనం’- వోటర్స్ లిస్ట్- కూడ రూపొందరాదని వాదిస్తారేమో? వాంఛిస్తారేమో?? ‘‘నాయకత్వం అని అంటే విద్యార్థులను, ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు...’’అని సైనిక దళాల-ఆర్మీ- ప్రధాన అధికారి విపిన్ రావత్ వ్యాఖ్యానించడానికి ఇదంతా నేపథ్యం, ‘రాజ్యాంగ ప్రక్రియ’లను వ్యతిరేకిస్తున్న ‘విద్రోహులు’ వీధులలో, విశ్వవిద్యాలయాలలో సృష్టించిన భయంకర విధ్వంసకాండ నేపథ్యం...
భారతీయ జనతాపార్టీ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని గత మేనెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు పూర్వం కాంగ్రెస్ తదితర విపక్షాలు ఆరోపించడం చరిత్ర... ఇప్పుడు రాజ్యాంగ పద్ధతులను ధ్వంసం చేస్తున్నదెవరు?? ‘పౌరసత్వ సవరణ చట్టం’ చెల్లదని తీర్పుచెప్పాలని కోరుతూ అనేక ‘న్యాయ యాచికలు’ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయి ఉన్నాయి. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం తీర్పుకోసం ఈ ‘న్యాయార్థులు’ వేచి ఉండాలి! ‘పౌరసత్వ సవరణ చట్టం’ అమలు జరుగకుండా తాత్కాలికంగా నిలిపివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది! అందువల్ల ‘‘వ్యతిరేకిస్తున్నవారు’’ సర్వోన్నత న్యాయ నిర్ణయంకోసం వేచి ఉండాలి! కానీ వీధులలోకి చొఱబడి విధ్వంసం సృష్టించారు, నిరసన తెలపడం ‘్భవ వ్యక్తీకరణ’కు రాజ్యాంగం కల్పిస్తున్న స్వేచ్ఛలో భాగం కావచ్చు... కానీ ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వేతరుల ఆస్తులను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం...?? రెండవది ‘జాతీయ పౌర సంకలనం’- ఎన్‌ఆర్‌సి- పట్ల వ్యతిరేకత! ‘జాతీయ పౌర సంకలనం’ కార్యక్రమం ఇప్పటిది కాదు. 1951లోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఆమోదించింది, ప్రారంభించింది! అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉండేది! డెబ్బయి ఏళ్ల క్రితం లేని వ్యతిరేకత, డెబ్బయి ఏళ్లుగా లేని వ్యతిరేకత ఇప్పుడు పుట్టుకొచ్చింది! అరవై ఏళ్ల తరువాత కనీసం అస్సాంలోనైనా ఈ ‘జాతీయ పౌర సంకలనం’ ఏర్పడాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అస్సాంకు ‘అన్వయం’కావడం సర్వోన్నత న్యాయస్థానంవారు స్వయంగా ఆదేశించిన కార్యక్రమం! అంటే ‘ఎన్‌ఆర్‌సి’ని వ్యతిరేకిస్తున్నవారు సర్వోన్నత న్యాయ నిర్దేశాన్ని ధిక్కరిస్తున్నారు!! దీనిపై ఈ ‘‘వ్యతిరేకులు’’ సమాధానం చెప్పడం లేదు... రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఎవరు యత్నిస్తున్నారు?? సైనిక దళాల ప్రధాన అధికారి విపిన్ రావత్ వ్యాఖ్యలకు దోహదంచేసిన విపరిణామ క్రమం ఇది...
విపిన్ రావత్ చెప్పిన వాస్తవం ఈ ‘‘వ్యతిరేకుల’’కు కనువిప్పు కలిగించగలగాలి! కానీ వాస్తవాన్ని అంగీకరించడానికి ఈ ‘‘వ్యతిరేకులు’’ సిద్ధంగా లేరు. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ వ్యతిరేకుల ప్రవర్తన తీరు అన్యాయం మాత్రమేకాదు... అతార్కికం కూడ! ‘‘ప్రజలకు అక్రమ దిశానిర్దేశనం చేసేవారు నాయకులు కాదు... ఈ అక్రమ దిశానిర్దేశనం విశ్వవిద్యాలయ, కళాశాల ప్రాంగణాలలో జరుగుతుండడం చూస్తున్నాము. నగరాలలోను, పట్టణాలలోను దగ్ధకాండను, హింసాకాండను సాగించమని గుంపులను ఉసికొల్పడం అక్రమ దిశానిర్దేశనం. ఇది నాయకత్వం కాజాలదు!’’అన్నది రావత్ ఆవిష్కరించిన వాస్తవం! సిద్ధాంత నిష్ఠ సహజంగానే తార్కికంగా ఉంటోంది. కానీ ‘రాజకీయ అక్రమ ప్రయోజనాన్ని’ సిద్ధాంతంగా ప్రచారంచేస్తున్నవారి వాదంలో న్యాయం లేదు, తర్కం లేదు. ‘సిఏఏ’లో ‘ఇస్లాం మతస్థుల’ను చేర్చలేదన్నది ‘సిఏఏ’ను వ్యతిరేకించడానికి వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్న కారణం! అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలు. ఇస్లాం మతస్థులు ఈ దేశాలలో అత్యధిక సంఖ్యాకులు. ఈ అధిక సంఖ్యాకులను ఆ దేశాలలో ప్రభుత్వాలు కానీ జిహాదీలు కాని హింసించే ప్రసక్తిలేదు. అందువల్ల హింసాకాండను, బీభత్సకాండను తప్పించుకొనడానికై ఇస్లాం మతస్థులు ఆ దేశాలనుంచి పారిపోయే ప్రసక్తి ఉత్పన్నంకాలేదు, మన దేశానికి శరణార్ధులుగా వచ్చే అవకాశం లేదు. అందువల్ల ‘‘లేని ఇస్లాం మతస్థులైన శరణార్ధుల’’కు మన దేశపు పౌరసత్వం ఎలా కల్పించగలం?? అందువల్లనే పాకిస్తాన్‌నుంచి, అఫ్ఘానిస్థాన్ నుంచి, బంగ్లాదేశ్‌నుంచి వచ్చిన శరణార్ధుల ‘మతాల’జాబితాలో ‘ఇస్లాం’లేదు... ఇస్లాంను చేర్చలేదు!! ఈ మూడు దేశాలలో జిహాదీ బీభత్సకాండకు గురి అయినది ఇస్లామేతర మతాలవారు. తప్పించుకున్న ఈ ‘ఇస్లామేతరులు’ ప్రస్తుతం మన దేశంలో శరణార్ధులు. అందువల్ల ‘సిఏఏ’ద్వారా మన దేశపు పౌరసత్వం లభించగల శరణార్ధుల మతాల జాబితాలో ‘ఇస్లాం’ను చేర్చలేదన్నది విచక్షణ జ్ఞానులందరికీ స్పష్టంగా అర్ధమయిన వాస్తవం!! వ్యతిరేకులకు ఈ విచక్షణ జ్ఞానం లేదా?? ‘సిఏఏ’ను వ్యతిరేకించడానికి కనీసం అక్రమమైన అన్యాయమైన, ‘‘లేని’’ కారణం ఉన్నట్టుగా చూపుతున్న ‘మోసం’ప్రాతిపదిక. కానీ ‘ఎన్‌ఆర్‌సి’ని, ‘ఎన్‌పిఆర్’- జాతీయ జన సంకలనం-ని వ్యతిరేకించడానికి ప్రాతిపదిక ఏమిటన్నది ‘‘వ్యతిరేకుల’’కు కూడ తెలియడం లేదు! వారు ఇతరులకు ఎలా వివరించగలరు?? ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్నీ వ్యతిరేకించడం మాత్రమే ‘వ్యతిరేకుల’ చర్యలకున్న ప్రాతిపదిక!! ‘జాతీయ పౌర సంకలనం’ ఏర్పడితే నిజమైన పౌరులకు ఏమి నష్టం?? వారెందుకు భయపడాలి?? ‘జాతీయ జన సంకలనం’ రూపొందితే నిజమైన ప్రజలకు ఏమి భయం?? ‘‘వ్యతిరేకుల’’ను ప్రజలు అడగవలసిన ప్రశ్నలివి!! ఈ ‘సంకలనాలు’ ఏర్పడడంవల్ల వాస్తవాలకు ఏమి భంగం?? విధ్వంసకారులు చెప్పాలి...