సంపాదకీయం

ధరల ‘దడ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార ద్రవ్యోల్బణ వేగం పదకొండు శాతానికి చేరడానికి ప్రధాన కారణం నవంబరు నెలలో విపరీతంగా పెరిగిన ఉల్లిగడ్డల ధరలన్నది జరుగుతున్న ప్రచారం. ఆరేళ్ల గరిష్ఠస్థాయికి ఆహార ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళనకరం కావాలన్నది ఆర్థిక సూత్రం. కానీ వినియోగదారులు పెద్దగా ఆందోళన చెందినట్టు దాఖలాలు లేవు. నూట నలబయి రూపాయలకు కిలో చొప్పున ఈ ‘యర్ర గడ్డలు’ అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. ‘ఉల్లిపాయలు’ అత్యవసర ఆహారంగా పరిణమించడం ఇందుకు కారణం. ఉల్లిపాయలు విదేశాలనుంచి దిగుమతి అయ్యాయన్న ప్రచారం మధ్య ఉల్లి ధరలు చిల్లర దుకాణాలలో ఎనబయి రూపాయల కిలో స్థాయికి దిగి వచ్చాయన్నది నిన్న, నేడు జరిగిన ప్రచారం. రెండు మూడు నెలల క్రితం ఇరవై రూపాయలు, పాతిక రూపాయల స్థాయిలో లభించిన ఈ ‘గంజి’గడ్డలు హఠాత్తుగా ఇన్ని రెట్లుగా పెరిగిపోవడం ‘ప్రపంచీకరణ’ మాయాజాలంలో ఒక అంశమన్న ధ్యాస ఆర్థికవేత్తలకే కలగలేదు, సామాన్య ప్రజలకు కలగాలని కోరడం అందువల్ల అతార్కికం. ‘‘్ధ్యస’’లేని ప్రజలు ఏం చేశారు?? నూట నలబయి రూపాయలు పెట్టి కిలో ఉల్లిగడ్డలు కొన్నారు! ‘ఇరుగుపొరుగు’ ప్రసంగాలలో ఆశ్చర్యకరమైన అంశాలు ఎన్ని ఎక్కువగా ఉన్నట్టయితే ప్రసంగాలు అంతగా రక్తికడుతున్నాయి మరి!! అందువల్ల ‘‘మేము నూట నలబయి రూపాయలు పెట్టి కిలో యర్రగడ్డలు కొన్నాము’’అని పొరుగువారితో చెప్పడం ‘ప్రసంగకర్త’లకు గొప్ప అనుభూతి!! ‘‘మారీచ మృగం బంగారపు వనె్నలకు మురిసిపోయిన ఘట్టం’’ త్రేతాయుగంనాటి మాయ! ‘ప్రపంచీకరణ’ విస్తరింపచేస్తున్న ప్రగతి భ్రాంతి వర్తమాన సమాజాన్ని ఆవహించి ఉన్న మాయ! ఆహారం ద్రవ్యోల్బణం నవంబర్‌లో పెరిగిపోవడం ఒక ఉదాహరణ మాత్రమే!! ‘‘దివాలా’’దిశగా ప్రవర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ‘‘దూసుకొనిపోతుండడం’’ అసలు రహస్యం!! అమెరికా వంటి అతి గొప్ప సంపన్న దేశాలు సైతం పదేళ్లకు పైగా దివాలా తీస్తున్నాయి. ఈ ఆర్థిక పాతాళ పతనానికి ప్రధాన కారణం- నిజానికి ఏకైక కారణం- ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- కల్పించిన ప్రగతి భ్రాంతి!! సంపన్న దేశాల సమస్యలు ప్రముఖంగా ప్రచారవౌతున్నాయి. ప్రవర్ధమాన దేశాల సమస్యలు ఇంత ప్రముఖంగా ప్రచారం కావడం లేదు. ఎందుకంటె ‘ప్రపంచీకరణ’ గత పాతికేళ్లుగా కల్పించిన ‘‘ప్రగతి భ్రాంతి’’ గురించి సంపన్న దేశాలకు బాగా తెలుసు. ఎందుకంటె ‘స్వేచ్ఛా విపణి’, ‘అంతర్జాతీయ అనుసంధానం’వంటి పదజాలాన్ని రూపొందించి ప్రచారం చేసింది ఈ సంపన్న దేశాలవారు. ప్రవర్ధమాన దేశాలను కొల్లగొట్టడానికి తమ దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’కు వీలుకల్పించడంకోసం సంపన్న దేశాలవారు ఈ ‘పదజాలాన్ని’ సృష్టించాయి, ‘ప్రపంచీకరణ’ను కల్పించాయి. క్రీస్తుశకం 1994నుంచి పదహేను సంవత్సరాలు అమెరికా, ఐరోపా దేశాల ‘‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’’ - మల్టీ నేషనల్ కంపెనీస్- మన దేశాన్ని, ఇతర ప్రవర్ధమాన దేశాలను కొల్లగొట్టాయి. ఈ దోపిడీ ఇప్పటికీ సాగుతోంది... అందువల్ల ఉల్లిగడ్డల ధరలు పెరగడానికి ఈ ‘‘దోపిడీ షడ్యంత్రం’ అసలు కారణం!! మన ‘రిజర్వ్ బ్యాంక్’ నిర్వాహకులు, ప్రభుత్వ నిర్వాహకులు, మేధావులు, ఆర్థికవేత్తలు, ప్రతిపక్షాలు ఈ విషయంలో పరస్పరం విభేదించడం ‘ప్రపంచీకరణ’ సాగిస్తున్న మాయ!!
ఒకే ఆర్థికవేత్త ఈ మన దేశపు సమస్యను విశే్లషించడంలో పరస్పర విరుద్ధ్భావాలను ప్రస్ఫుటింపచేయడం ‘ప్రపంచీకరణ’ మాయ ఆవహించిన తీరునకు నిదర్శనం, విస్తరిస్తున్న తీరునకు నిదర్శనం!! గతంలో 2004వ 2014వ సంవత్సరాల మధ్య మన్‌మోహన్‌సింగ్ ప్రధానమంత్రిత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచిన సమయంలో ప్రణవ్‌ముఖర్జీ, పళనియప్పన్ చిదంబరం వంటి ఆర్థికమంత్రులు రంగరాజన్ వంటి ఆర్థిక నిపుణులు ‘‘ద్రవ్యోల్బణం’’, ‘‘్ధరల పెరుగుదల’’వంటివి అంతర్జాతీయ సమస్యలని వాటి పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో జరగాలని నిర్ధారించడం ఇప్పుడు బహుశా ఎవ్వరికీ గుర్తులేదు. బహుశా వారికే గుర్తులేదు. అందువల్లనే ‘‘తాంబూలాలు ఇచ్చేశారు...తన్నుకొని చావండి!’’అన్న రీతిలో ఆర్థిక ‘ప్రపంచీకరణ’వారసత్వాన్ని మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వంవారు ప్రసాదించి పోయారు!! ఈ ‘గుదిబండ’ వారసత్వాన్ని మోస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ‘‘దాన్ని దింపుకోవాలన్న ధ్యాస’’ కలుగకపోవడానికి కారణం ‘ప్రపంచీకరణ’మాయ! రక్షణ రంగంలోను, అంతర్గత భద్రత విషయంలోను, పర్యావరణ పరిరక్షణ వ్యవహారంలోను, సామాజిక, విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలోను జాతీయ నిష్ఠతో అద్భుత ఫలితాలను, చారిత్రక పరివర్తనను సాధించగలిగిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో మాత్రం ‘‘మందగమనానికి గురిఅయి ఉంది...’’ ఇందుకు కారణం మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వంవారు తమ నెత్తికెత్తిన ‘‘ప్రపంచీకరణ’’ గుదిబండను నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలగించుకొనలేక పోవడం..
ప్రతి సంవత్సరం ఏదో ఒక నిత్యావసర ఆహార పదార్థం ధర విపరీతంగా పెరిగిపోవడం దశాబ్దులుగా నడుస్తున్న చరిత్ర! అలా పెరిగిన ధరలు మళ్లీ ఇరవై శాతం నుంచి యాబయి శాతంవరకు మాత్రమే కొన్ని నెలల తరువాత తగ్గుతున్నాయి. అంతేకాని పూర్వపుస్థాయి ఎప్పటికీ దిగిరావు. ప్రతి ఆర్థిక వ్యవస్థలోను ప్రతి ఏడాది ఎంతోకొంతమేర ద్రవ్యోల్బణం పెరగడం సహజం. కానీ ఈ నిష్పత్తికి విరుద్ధంగా వారాల వ్యవధిలో ఏదో ఒక వస్తువు ధర వంద శాతం రెండువందల శాతం ఎందుకు పెరుగుతోంది. ఏళ్లతరబడి ఈ వైపరీత్యం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ నిర్వాహకులు నిర్వహణకోసం దీర్ఘకాల ప్రణాళికలు ఎందుకని రూపొందించడం లేదు?? కృత్రిమ కొరతను కల్పించే ‘మాయ’ ప్రపంచీకరణ వ్యవస్థలో నిహితమై ఉంది. కానీ అసలు కారణం! 2010లో నలబయి రూపాయలకు కిలో లభించిన కందిపప్పు ధర అదే సంవత్సరంలో కిలో వంద రూపాయల స్థాయికి పెరగడం ఇప్పుడెవరికీ గుర్తులేదు. మళ్లీ ధర తగ్గింది.
కానీ ‘చిల్లర’రంగంలో డెబ్బయి రూపాయలకు కిలోగా ధర స్థిరపడింది. వంద రూపాయల నుంచి డెబ్బయి రూపాయలకు కంది పప్పు ధర తగ్గిందని మధ్యతరగతి జనం మురిసిపోయారు. నలబయి రూపాయలకే కిలో ‘పప్పు’ను కొన్ని వారాలకు పూర్వం కొన్న సంగతి వారికి గుర్తులేదు. ‘ప్రపంచీకరణ’ ఈ కృత్రిమ పారవశ్యానికి ప్రాతిపదిక!! ‘ఉల్లి’ ధర 1998లో కిలో యాబయి రూపాయలకు చేరినప్పుడు కూడ ఇదే తతంగం నడిచింది!! కూరగాయలు బియ్యం పండ్లు-అన్నీ ఇదే తీరుగా పెరుగుతున్నాయి. ఇతర వస్తువుల ధరల ‘పెరుగుదల’ వేగంకంటె రెండు మూడు ఆహారం ధరలు పెరుగుతున్నాయి. సాధారణ ద్రవ్యోల్బణం ‘ఐదారు శాతాల’ స్థాయిలో పెరుగుతున్న సమయంలోనే ‘ఆహారం ద్రవ్యోల్బణం’ నవంబర్‌లో పదకొండు శాతం పెరగడం ఈ వాస్తవానికి సరికొత్త ధ్రువీకరణ... 2009లో సాధారణ ద్రవ్యోల్బణం ‘సున్న’ శాతం పెరుగుదలను నమోదుచేసింది. అదే సమయంలో ఆహారం ధరలు భయంకరంగా పెరిగాయి. చివరికి అప్పటి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు నిర్వాహకులు ‘సాధారణ’, ‘ఆహార’ద్రవ్యోల్బణాలను విడివిడిగా లెక్కకట్టడం ఆరంభించారు. అలా లెక్కకట్టిన మొదటిసారి ‘ఆహార ద్రవ్యోల్బణం’ ఇరవై శాతానికి పైగా పెరుగుతుండినట్టు ధ్రువపడింది...
ఇదంతా ‘ప్రపంచీకరణ’లో భాగం, ‘స్వేచ్ఛా విపణి’లో భాగం!! ‘లభ్యత’-సప్లయి-, ‘గిరాకీ’-డిమాండ్- ప్రాతిపదికగా మాత్రమే వివిధ వస్తువుల ధరలు తమంతతాముగా పెరగడం, తగ్గడం ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ- వౌలిక లక్షణమట. ‘ప్రపంచీకరణ’వేత్తలు ప్రవచిస్తున్న అనుల్లంఘనీయ ఆర్థిక సూత్రం ఇది... అందువల్ల కేంద్ర ప్రభుత్వంవారు ధరల విషయంలో కల్పించుకోవడం లేదట. కల్పించుకున్నట్టయితే మన దేశానికి లభిస్తున్న మార్కెట్ ఎకానమీ హోదాను ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-వారు రద్దుచేస్తారట!! అలా రద్దయితే విదేశాలనుంచి మన దేశానికి పెట్టుబడులు రావట!! ఇదీ భయం... ‘ప్రపంచీకరణ’మాయ కల్పించిన భయం... అందువల్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి!!