సంపాదకీయం

ఇంట గెలిచిన హిల్లరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పార్లమెంటు-కాంగ్రెస్- ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిన చారిత్రక పరిణామం. నరేంద్ర మోదీ ప్రసంగ ప్రభావ తరంగాలు విస్తరిస్తుండిన సమయంలోనే అంతర్జాతీయ దృష్టిని మరింతగా ఆకట్టుకున్న మరో మహా పరిణామం అమెరికాలో సంభవించింది. హిల్లరీ రోథమ్ క్లింటన్ సాధించిన సంస్థాగత ఘన విజయం ఈ సమాంతర పరిణామం. వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్షపదవికి జరుగనున్న ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ డెమొక్రటిక్ పార్టీ నామాంకిత-నామినీ-గా పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది. అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ నామాంకితుడుగా పోటీచేయనున్న డొనాల్డ్ ట్రంప్‌తో హిల్లరీ క్లింటన్ తలపడనున్నారు. డెమొక్రటిక్ పార్టీ నామాంకనం-నామినేషన్-కోసం హిల్లరీ క్లింటన్ సుదీర్ఘమైన పోరాటం జరుపుతూ వచ్చింది. అమెరికా రాజకీయ చరిత్రంలో అపూర్వమైన పరిణామం సంభవించడం ఈ సుదీర్ఘమైన పోరాటానికి పరాకాష్ట. తొలిసారిగా ఒక ప్రధానపార్టీ నామాంకిత-నామినీ-గా -ఓ మహిళ అధ్యక్ష పదవికి పోటీ చేయగలగడం ఈ అపూర్వ పరిణామం. 2008 జనవరిలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థినిగా హిల్లరమ్మ అధ్యక్ష పదవీ వరణ సమరంలో ప్రవేశించింది. 2008 జనవరి నుండి అనేక నెలలపాటు అమెరికాలోను ఇతర దేశాలలోను కొనసాగిన రాజకీయాలు ఉత్కంఠకు కేంద్ర బిందువు హిల్లరీ అభ్యర్థిత్వం. ఒక ప్రధానపక్షం తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికై ఒక మహిళ ఎంపిక కాగలదా అన్నది అప్పుడు ఉత్కంఠ రేకెత్తించిన ప్రశ్న. అప్పుడు హిల్లరీ క్లింటన్ ప్రయత్నం సంస్థాగత అభ్యర్థిత్వం దశలోనే ఆగిపోయింది. ఆమెకు నామాంకన అప్పుడు దక్కలేదు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రంగప్రవేశం చేసిన బరాక్ హుస్సేన్ ఒబామా అప్పుడు సంస్థాగత ఎన్నికల-ప్రైమరీస్-లో ఘన విజయం సాధించారు. హిల్లరీని ఓడించి పార్టీ నామాంకనం-నామినేషన్-దక్కించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అమెరికాలోను విదేశాలలోను రాజకీయ ఉత్కంఠ మొదలైంది. ఈ ఉత్కంఠకు సైతం కేంద్ర బిందువు హిల్లరీ క్లింటన్..అమెరికా చరిత్రలో ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నిక కాగలదా? అన్నది ఇప్పటి ఉత్కంఠకు దోహదం చేస్తున్న ప్రశ్న. ఇంతవరకు అమెరికా అధ్యక్ష పదవికి కాని, ఉపాధ్యక్ష పదవికి కాని మహిళలు ఎన్నిక కాలేదు. అందువల్ల ఈ దిశగా జరుగుతున్న ప్రగతికి సారథి హిల్లరీ క్లింటన్. 2008లో సంస్థాగత పరాజయంతో అభ్యర్థిత్వం దశలోనే ఆగిన ఈ మహిళా ప్రగతి, ఈ ఎన్నికల ప్రహసనంలో నామాంకనం స్థాయికి చేరింది..
హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలిగా ఎన్నికయినట్టయితే అది అమెరికా చరిత్రలో రెండు అపూర్వ పరిణామాలకు ప్రతీక కాగలదు. ఒక మహిళ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించగలగడం మొదటిది. ఇలా మాజీ అధ్యక్షుని భార్య అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం రెండవ పరిణామం. హిల్లరీ భర్త బిల్ క్లింటన్ 1992లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో పదవీ విరమణ చేశారు. అలా అధ్యక్షుడైన క్లింటన్ సతీమణి హిల్లరమ్మ అధ్యక్ష భవనమైన వైట్‌హౌజ్‌లో ఎనిమిదేళ్లు గృహిణిగా గడిపింది. ఇప్పుడు అధ్యక్షపదవికి ఎన్నికయినట్టయితే కనీసం నాలుగేళ్లు వైట్‌హౌజ్ నివాసభాగ్యం ఆమెకు మళ్లీ లభిస్తుంది. 2020లో రెండవసారి ఎన్నికైతే మొత్తం ఎనిమిదేళ్లపాటు ఆమెకు వైట్‌హౌజ్-శే్వతసౌధం-అధికార నివాసం కానుంది. ఇదికూడ అపూర్వమైన చరిత్ర. మాజీ అధ్యక్షుడైన బిల్ క్లింటన్ అధ్యక్షురాలి భర్త హోదాలో మరోసారి శే్వతసౌధంలోకి ప్రవేశించగలడు. ఇలా మాజీ అధ్యక్షుడు మరోసారి అధ్యక్షభవనంలో నివసించగలగడం కూడా అపూర్వమైన పరిణామం కాగలదు. 1988-1992వ సంవత్సరాల మధ్య అధ్యక్షుడిగా ఉండిన రిపబ్లికన్ నాయకుడు జార్జ్‌బుష్ కుమారుడు, జూనియర్ జార్జిబుష్ 2000లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2008 వరకు పదవిలో ఉన్నాడు. ఆ సమయంలో మాజీ అధ్యక్షుడైన సీనియర్ జార్జిబుష్ అప్పుడప్పుడు మాత్రమే వైట్‌హౌస్‌కు వచ్చేవాడు. కుమారుని ఇంటిలో నివసించలేదు. ఇలా సిద్ధాంతాలు, విధానాలు, కార్యాచరణలు, వ్యూహాలు కంటె మానవ జీవన అనుభూతులతో ముడివడిన చరిత్రను హిల్లరీ క్లింటన్ సృష్టించనుంది, సృష్టిస్తోంది.
క్రీస్తుశకం 1776 జూలై నాలుగవ తేదీన అమెరికా సంయుక్త రాష్ట్రాలు బ్రిటన్ దురాక్రమణ నుండి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. ఈ పదమూడు రాష్ట్రాల అమెరికా యాబయి ఒక్క రాష్ట్రాలకు విస్తరించడం ‘‘అద్భుతమైన’’ దురాక్రమణ. 1789లో జార్జి వాషింగ్టన్ తొలి అధ్యక్షుడు కావడంతో అమెరికాలో నూతన ప్రజాస్వామ్య ప్రక్రియ మొదలైంది. ఈ ప్రజాస్వామ్యం బ్రిటన్ తరహా పార్లమెంటరీ వ్యవస్థకంటె భిన్నమైంది. అధ్యక్షుడు లాంఛనప్రాయమైన అధినేతగా కాక క్రియాశీల పరిపాలకుడిగా పనిచేసే రాజ్యాంగ వ్యవస్థ ఇది. ఇలా ప్రజలు అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోగలిగన అధ్యక్ష రాజ్యాంగ వ్యవస్థకు అమెరికా శ్రీకారం చుట్టింది. కానీ క్రీస్తుశకం 1920 వరకు ఈ ప్రజలు కేవలం పురుషులే. జాతీయ స్థాయి ఎన్నికలలో మహిళలకు వోటుహక్కు లేదు. 1920కి పూర్వం కొన్ని రాష్ట్రాలలో మహిళలకు ఓటుహక్కు లభించినప్పటికీ దేశమంతటా మహిళలకు ఈ హక్కు లభించడం అమెరికా రాజ్యాంగానికి పంతొమ్మిదవ సవరణ జరిగిన తరువాత మాత్రమే. 1920 ఆగస్టులో ఈ సవరణ అమల్లోకి వచ్చింది. ఇలా వోటుహక్కును పొందిన అమెరికా మహిళ అధ్యక్షపదవికి ఒక ప్రధాన పక్షం తరపున నామాంకిత కావడానికి తొంబయి ఆరేళ్లు పట్టింది. అందువల్ల ఇప్పుడైనా మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక కావాలన్న ఆకాంక్ష సమంజసమైనది. కానీ ఈ ఆకాంక్ష సాకారం అవుతుందా అన్నది భిన్న అభిప్రాయాలకు అవకాశం ఇస్తోంది. సంస్థాగతంగా హిల్లరీ విజయం సాధించినప్పటికీ, జన బాహుళ్యంలో మాత్రం పార్టీ నామాంకనం కోసం అమెతో పోటీచేసి ఓడిన బెర్నీ సాండర్స్‌కు ఎక్కువ పలుకుబడి ఉన్నదట. రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటె పదిశాతం ఓటర్లు సాండర్స్‌ను అధికంగా బలపరుస్తున్నట్టు సర్వేలు నిర్ధారించాయి. హిల్లరీ క్లింటన్‌కు డోనాల్డ్ ట్రంప్ కంటె రెండు శాతం ఆధిక్యం మాత్రమే ఉన్నది..
అధికశాతం రాష్ట్రాల్లో ప్రైమరీలు ముగిశాయి. ఆ ప్రైమరీలలో గెలవడంతో క్లింటన్‌కు నామాంకనం కోసం అవసరమైన ప్రతినిధుల మద్దతు లభించింది. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ప్రైమరీలు జరుగవలసి ఉంది. జూలైలో జరుగనున్న డెమొక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో ఆమెకు అధికారికంగా నామాంకనం లభించడం కేవలం లాంఛనం. 1952 నుండి జరిగిన అమెరికా అధ్యక్షుని ఎన్నికల చరిత్ర ప్రకారం ప్రతి ఎనిమిదేళ్లకూ ఓటర్లు అధికారాన్ని పార్టీలు మార్చి బదలాయిస్తున్నారు. 1952వ, 1968వ, 1980వ, 2000వ సంవత్సరాలలో రిపబ్లికన్లు అధ్యక్షులయ్యారు. 1960, 1976, 1992, 2008ల్లో డెమోక్రట్లు అధ్యక్షులయ్యారు. ఎనిమిదేళ్ల తరువాత ప్రత్యర్థి పార్టీ వారు గెలిచారు-1988లో మాత్రమే ఈ సంప్రదాయం భంగపడింది. అందువల్ల 2008లో డెమోక్రట్లు గెలిచినందువల్ల ఈసారి రిపబ్లికన్లు అధ్యక్షపదవిని గెలుస్తారా? లేక సంప్రదాయాన్ని అతిక్రమించి వోటర్లు మళ్లీ డెమొక్రట్ హిల్లరీని గెలిపిస్తారా?