సంపాదకీయం

‘స్వచ్ఛత’కు గీటురాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛతకు శరత్ ఋతువు సనాతన ప్రతీక. తుది మొదలు లేకుండా ఎప్పుడూ ఉన్నది, ఉంటున్నది, ఉండబోయేది ‘సనాతనమైనది’... ‘సనాతనం’అని అంటే ఇలా శాశ్వతమైనది. అందువల్ల ‘శరత్‌కాలం’ స్వచ్ఛతకు శాశ్వతమైన ప్రతీక. వర్ష ఋతువులో నీరు ఆకాశాన్ని శుభ్రం చేస్తోంది, భూమిని పరిశుభ్రం చేస్తోంది. ‘‘ఆపః పునన్తు పృథివీం...’’- ‘‘నీరు భూమిని పరిశుద్ధం చేయడం’’- సనాతన స్వచ్ఛతకు సహజ వ్యవస్థ. అందువల్ల వర్షఋతువు తరువాత వస్తున్న శరదృతువులో ప్రకృతి మొత్తం పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంటోంది. ‘‘శారద రాత్రులు జ్వల లసత్తర తారక హార పంక్తులన్ చారుతరంబులయ్యె...’’అన్న ఆదికవి నన్నయ భట్టు ‘‘శరత్ కాలంలో రాత్రులు కాంతివంతమైన నక్షత్ర సమూహాలతో మరింతగా వెలుగొందాయి’’అని ‘మహాభారతం’లో వివరించాడు. ఇలా నక్షత్రాలు మామూలు రాత్రులలో కంటె శరత్ కాలంలో మరింతగా ‘‘వెలుగొందడానికి’’కారణం. ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండడం. అందువల్ల శరత్‌కాలం నడికొన్న వేళ, అమావాస్య రాత్రి అంతరిక్షం సహజంగానే ‘దీపావళి’ రాత్రి కావడం సనాతనం..!! ఇది ప్రకృతిలో ఏర్పడుతున్న సహజమైన స్వచ్ఛమైన ‘దీపావళి’! అసంఖ్యాక నక్షత్రాలు అసంఖ్యాక దీపాల మాలలు, దీపాల హారాలు, దీప సరాలు, చీకటిపై దూకే దీపశరాలు! సృష్టిగత సత్యాలు సమాజస్థిత సంప్రదాయాలుగా వికసించడం అనాదిగా హైందవ జాతీయ చరిత్ర. అందువల్లనే భారతీయుల ప్రతి ఉత్సవం, ప్రతి సంప్రదాయం ప్రాకృతిక స్వచ్ఛతను ప్రాకృతిక సమతుల్యాన్ని పెంపొందిస్తున్నాయి. ‘దీపావళి’ సమయంలో వెలిగించే దీపాలు, విస్ఫోటనాలు ప్రకృతి స్వచ్ఛతను పెంచాయి. కారణం ‘బాణాసంచా’-టపాకాయలు వంటివి- వృక్ష నిర్యాసాలనుంచి తయారయ్యాయి. విదేశీయ బీభత్స పాలకులు, విష రసాయనాలను అంటగట్టిపోయారు. ‘ప్రపంచీకరణ’ ఈ విష రసాయనాలను మరింతగా విస్తరింపచేసింది. అందువల్ల ప్రాకృతిక పదార్థాలతో తయారయ్యే ‘విస్ఫోటన సామగ్రి’కి బదులు రసాయన విషాలతో తయారయ్యే ‘బాణసంచా’ దాపురించింది. ప్రకృతిని ‘స్వచ్ఛతరం’ ‘స్వచ్ఛతమం’చేసిన ‘దీపావళి’ ‘బాణసంచా’ ప్రకృతిని కలుషితం చేయడానికి ఈ ‘రసాయన విషాలు’ కారణం. సర్వోన్నత న్యాయస్థానంవారి ఆదేశాలు కారణంగా ‘విష రసాయనాల’ విస్ఫోటన సామగ్రి ఉపయోగం తగ్గుతోందట, మళ్లీ ‘హరిత’- ప్రాకృతిక పదార్థాలతో తయారయ్యే- విస్ఫోటన వినోద సామగ్రి విస్తరిస్తోందట! ఇది కొత్త అంశం కాదు, ధ్వంసమై ఉండిన జాతీయ సంప్రదాయ పునరుద్ధరణ మాత్రమే! అందువల్ల ‘ఆశ్వయుజ కార్తీక మాసాల’ సమాహారమైన శరత్ ఋతువులో ప్రకృతి మళ్లీ సభలు తీరే మంచి కాలం మొదలైంది! ఆశ్వయుజం ‘దీపావళి’తో పరిసమాప్తి... కార్తిక మాసం ‘దీపావళి’మరుసటిరోజున ఆరంభం. స్వచ్ఛ్భారత పునర్ వికాసక్రమంలో ఇలా ఈ శరత్‌ఋతువు పునరావృత్తం అవుతున్న సహజ ప్రకృతిక పరిణామం. మంగళవారంనుంచి కార్తిక మాసం కొలువుతీరుతోంది! ‘‘కరము వెలింగె వాసర ముఖంబులు శారద వేళ చూడగన్’’- శరత్ ఋతువులో, ప్రభాత సమయాలు, పగళ్లు ఎక్కువగా వెలుగొందాయి- అన్నది మహాకవి ఎఱ్ఱాప్రెగ్గడ తన ‘మహాభారతం’లో దర్శించిన దృశ్యం. శరత్కాలపు సూర్యకాంతి నిర్మలంగా ఉండడం పర్యావరణ పరిరక్షక మాధ్యమం!
ఈ పర్యావరణ పరిరక్షణ కేవలం వీధులను ఊడ్చడానికి, కోట్లకొలది కొత్త శౌచాలయాలను నిర్మించడానికి పరిమితం కాలేదు... కారాదన్న తరతరాల భారతీయ జీవన విధానం! జల పరిరక్షణ వాయుప్రక్షాళన కూడ సర్వసమగ్ర స్వచ్ఛతలో కొన్ని అంశాలు మాత్రమే! వృక్షజాలం జంతుజాలం కలసి జీవజాలం అవుతోంది. జీవజాల సర్వసమగ్ర స్వచ్ఛత, జీవజాల సర్వసమగ్ర సమన్వయం, జీవజాల సర్వసమగ్ర పరిరక్షణ ప్రాకృతిక సంతులనానికి స్వచ్ఛతకు దోహదం చేస్తున్న జీవన ప్రక్రియ. విడివిడిగా కనిపించే అసంఖ్యాక సముదాయాల ప్రాణుల మనుగడ పరస్పరం ముడివడి ఉంది. ఒక పక్షి తెగ నశిస్తే కొన్ని చెట్లు తెగలు నశించిపోతున్నాయి, ఒక తెగ మొక్కలు నశిస్తే మరికొన్ని జంతువులు నశించిపోతున్నాయి. ఇదంతా పర్యావరణం నేర్పుతున్న పాఠం! ఒక ‘కప్ప’ ప్రతిరోజు వందల క్రిమి కీటకాలను భోంచేస్తోంది. ఇలా ‘కప్పల’కు భోజనం అవుతున్న విష క్రిమికీటకాలు ఆకుపచ్చని పంటలకు హానికరమైనవి. కప్పలను నిర్ధాక్షిణ్యంగా చంపి ‘కప్పకాళ్ల’ను వేయించుకొని భోంచేసిన దేశాలలో ఈ ‘క్రిమికీటకాల’ను నిరోధించే వ్యవస్థ నశించింది. ఆ క్రిములు కీటకాలు పంటలపై దాడిచేసి ధ్వంసంచేసిన చరిత్ర ప్రపంచానికి చారిత్రక గుణపాఠం... విష రసాయనాల ఎఱువుల దుర్వాసన భరించలేని ‘వాన పాము- ఎఱ-లు భూగర్భంలో తులలో దాక్కొంటున్నాయి. ఫలితంగా పంటలకు ‘వానపాముల’ మేలు అందడంలేదు. చేపలు సహజంగా పెరిగే చెఱువుల, చేదబావుల నీరు స్వచ్ఛంగా ఉంటోంది! తాబేళ్లు జలాశయాలలో కాలుష్యకారకాలను భోంచేశాయి. కాకులు, కుక్కలు, పిల్లలు, రాబందులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు మాత్రమే కాదు మానవ జీవన భద్రతకు స్వచ్ఛతకు దోహదం చేస్తుండడం నడుస్తున్న చరిత్ర... పిల్లులు తిరుగాడే ఇళ్లలో ‘పాముల’ భయం ఉండదు, ‘తేళ్లు’పారాడవు! కుక్కలు తిరిగే వీధులలో పాచిపోయిన ఆహార పదార్థాలు పేరుకొనవు, కంపుకొట్టవు! దొంగల భయం ఉండదన్నది మరో వాస్తవం! ఈ ‘్ధ్యస’మానవుల మానసిక స్వచ్ఛత! భౌతిక స్వచ్ఛతతోపాటు, బౌద్ధిక మానసిక స్వచ్ఛత కూడ పునరుద్ధరణకు నోచుకోవాలి! సమగ్ర ‘స్వచ్ఛ భారత్’ స్వరూపం భౌతికమైనది, స్వభావం మానసికమైనది, బౌద్ధికమైనది...
వీథి కుక్కలను విచ్చలవిడిగా చంపేయడం ప్రభుత్వాల, మేధావుల, సలహాదారుల, పురపాలక నగర పాలక సంఘాల అవ్యవస్థలో నిహితమై ఉన్న క్రూరత్వం! ‘‘అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః...’’- మానసిక సంతులనం లేనివారి అనుగ్రహము కూడ భయంకరంగా ఉంటోంది- అని అన్నట్టు ‘నితాంత అపార భూతదయ’అన్న వౌలిక జాతీయ జీవన సత్యాన్ని మరచిన ‘అధికార యంత్రాంగం’ పట్టణాలలోను నగరాలలోను వీథికుక్కలను చంపేస్తోంది! కుక్కలను హింసించడం అనాగరికం, క్రూరత్వం! కానీ విలువలు తారుమారు అయిపోతున్నాయి. కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తుండడం నాగరికం. చట్టబద్ధం అయిపోయాయి. వీథి కుక్కలు ఎవ్వరినీ కరవవు. కుక్కపిల్లలు తమపాటికవి ఓ పక్కగా చుట్టచుట్టుకొని పడుకొని ఉంటాయి. వాటిమీద పిల్లలు తెలియక రాళ్లు వేస్తారు... అవి ‘గయ్’మని ఏడుస్తాయి. భయపడిన పిల్లలు పారిపోతారు... కుక్కలు వెంట పడుతాయి. వీథికుక్కలు మొరిగినప్పుడు నిర్భయంగా నిలుచుండిపోతే అవి మనజీలికి రావు... తోకలు ముడుచుకొని పారిపోతాయి. తొలకరి జల్లులలో మొదటిసారి నానినప్పుడు కొన్ని కుక్కలకు మతిభ్రమిస్తుంది. అలాంటి వీథికుక్కలు మాత్రమే కరుస్తాయి. వాటి సంఖ్య చాలా తక్కువ. అలా మతిభ్రమించిన వీథి కుక్కలు ఎక్కువ రోజులు బతకవు! అందువల్ల ఆరోగ్యవంతమైన ఎవరి జోలికీ రాని వీథి కుక్కలను చంపేయడం మానవుల క్రౌర్యానికి నిదర్శనం, స్వచ్ఛ్భారత స్ఫూర్తికి విరుద్ధం. శస్తచ్రికిత్సల ద్వారా మానవుల సంఖ్యను నియంత్రిస్తున్నాము. కుక్కల సంఖ్యను కోతుల సంఖ్య విపరీతంగా పెరగకుండా ఇలా చికిత్సద్వారా నిరోధించవచ్చు... లక్షల రూపాయలను ఖర్చుపెట్టి ‘విదేశాల’నుంచి కుక్కలను దిగుమతి చేసుకొని వాటిని పెంచి వాటికి ‘రాజభోగాల’ను సమకూర్చుతున్న ‘‘విచిత్ర వికృత నికృష్ట మానసిక స్వభావులైన’’ సంపన్నులు వీథి కుక్కలకు మాత్రం ఒక ‘మెతుకు’విదిలించడం లేదు. ఈ ‘క్రౌర్యం’ కూడ ‘నితాంత అపార భూతదయ’కు భంగకరం, అభారతీయం!
శ్రమజీవన సౌందర్య స్వభావులైన రైతన్నలు, వ్యవసాయ శ్రామికులు ఇప్పటికీ పొలాలలో భోజనం చేస్తున్నారు... మొదటి ముద్దను కుక్కకు వేసిన తరువాతనే వారు భోజనం చేస్తున్నారు. ఇదీ మానసిక స్వచ్ఛ భారతం! దేవతా నివేదన చేసిన తరువాత గృహస్థులు పక్షులకు జంతువులకు ‘బలిహరణం’ సమర్పించిన తరువాతనే తాము భుజించాలన్నది జాతీయ సంప్రదాయం. ఈ ‘బలిహరణం’- భోజనం- కుక్కలకు ప్రధానంగా పెట్టాలి! కుక్కపిల్లను వదలని ధర్మరాజు, - యుధిష్ఠిరుడు, కుక్కపిల్ల తల్లి ఫిర్యాదును విన్న జనమేజయుడు, కుక్కపిల్లకు ‘నెయ్యి’ని వడ్డించిన నామదేవుడు- ఇలాంటి వారంతగా నిజమైన భారతీయులు...!! వారు పిచ్చివాళ్లుకాదు! అన్ని వీథికుక్కలూ అపాయకరమని భావించేరే నిజమైన పిచ్చివాళ్లు... ఆ ‘పిచ్చి’ క్రూరత్వం!! స్వచ్ఛ్భారత స్ఫూర్తికి విరుద్ధం...