సంపాదకీయం

‘ఫలితాల’ పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వోటరుల పరిణతి మరింతగా ప్రస్ఫుటించడం మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలలో నిహితమై ఉన్న ప్రధాన అంశం. సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థలో జాతీయస్థాయి సమస్యలు వేఱు, ప్రాంతీయ స్థాయి సమస్యలు వేఱు, పరిష్కారాలు కూడ వేఱు వేఱు. అందువల్ల జాతీయస్థాయి లోక్‌సభ ఎన్నికలలో ఇచ్చిన తీర్పులను ఆయా రాష్ట్రాలలో ‘వోటరు’లు శాసనసభ ఎన్నికలలో సైతం పునరావృత్తం చేస్తారని భావించడం కేవలం రాజకీయ భ్రమ! ఇదీ మహారాష్ట్ర, హరియాణా ‘వోటరు’లు ఆవిష్కరించిన గుణపాఠం. తెలంగాణ శాసనసభకు హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి జరిగిన ఉప ఎన్నిక కూడ ఈ గుణపాఠానికి సరికొత్త ఆవిష్కరణ! లోక్‌సభ ఎన్నికలలో ఇచ్చిన తీర్పులను ‘వోటరు’లు శాసనసభ ఎన్నికలలో తీర్పులను చెప్పడానికి ప్రాతిపదికలుగా భావించడం లేదు. భావిస్తారని భ్రమించినవారు చెప్పిన ‘జోస్యాలు’ వెలువడిన ఫలితాలతో అతకడం లేదు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృత్తం అయి ఉంటే’ హరియాణలో భారతీయ జనతాపార్టీ ఈ శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఉండాలి. తొంబయి స్థానాల హరియణ శాసనసభలో భాజపాకు ‘సంఖ్యాబాహుళ్యం’-మెజారిటీ- లభించకపోవడం గురువారం ఆవిష్కృతమైన రాజకీయ వాస్తవం! భాజపా వారి ఐదేళ్లపాలన హరియణ ప్రజల స్థానిక సమస్యలను పరిష్కరించలేక పోయిందన్నది ధ్రువపడిన వాస్తవం. మహారాష్టల్రో భాజపా, ‘శివసేన’ కూటమి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ మతదాన- పోలింగ్- పూర్వపు అంచనాలు కాని, ‘మత దాన’ అనంతర నిర్ధారణలు- ఎగ్జిట్ పోల్స్- కానీ ‘వోటరు’ల అంతరంగాన్ని నిర్దిష్టంగా ఆవిష్కరించలేకపోయాయన్నది నిజం. 2014నాటి శాసనసభ ఎన్నికలలో కంటె ఈ ఎన్నికలలో ‘్భజపా’కు ఎక్కువ స్థానాలు లభించనున్నట్టు ఆవిష్కృతమైన అంచనాలు తారుమారు అయిపోవడం ‘వోటరు’లు చెప్పిన గుణపాఠం. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి నూట ఇరవై రెండు స్థానాలను కైవసం చేసుకున్న ‘్భజపా’కు ఈ ఎన్నికలలో దాదాపు పదిహేను, ఇరవై స్థానాలు తక్కువ లభిస్తున్నాయి. మాధ్యమాల వారి అంచనాలు, రాజకీయ విజయ విశ్వాసాలు వంద శాతం ఏ ఎన్నికలలోను ధ్రువపడబోవన్న వాస్తవానికి ఇలా ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం. లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగిలిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’-తెరాస- హుజూర్‌నగర్ శాసనసభ ఎన్నికలలో ఇంతటి ఘనం సాధిస్తున్నది కూడ ‘మతదాన పూర్వ’ ఊహాగానాలకు అందలేదు. ‘‘గహనో కర్మణో గతి..’’-కర్మ ఫలితం ఎలా ఉంటుందన్నది ఊహకు అందదు-అన్న జీవన సూక్తి ఇలా వోటరుల అంతరంగానికి కూడ మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలలోను, తెలంగాణ ఉప ఎన్నికలోను అన్వయం అయింది. మహారాష్టల్రోను హరియాణలోను ప్రధాన జాతీయ పక్షాలయిన ‘్భజపా’కాని ‘కాంగ్రెస్’కాని ఘన విజయాలను సాధించలేదు, ఘోర పరాజయాలను చవిచూడలేదు! తెలంగాణలో జరిగిన శాసనసభ ఉప ఎన్నిక మాత్రం ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఘన విజయానికి ప్రతీక! సాధారణంగా అధికారంలో ఉన్న పక్షాలు ఉప ఎన్నికలలో ఓడిపోవడం దశాబ్దుల రాజకీయ చరిత్ర. ఇందుకు ‘్భన్నం’గా తెరాస 2018లో ఓడినచోట ఇప్పుడు విజయం దక్కించుకొంది...
మహారాష్టల్రో ‘్భజపా’కు విజయం లభించినప్పటికీ ‘స్థానాల సంఖ్య’ వోట్ల శాతం గత- 2014నాటి- శాసనసభ ఎన్నికలలో తగ్గడానికి కారణం ‘పొత్తుల’ సంకీర్ణ రాజకీయం. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసిన తమ పార్టీ పోటీచేసిన స్థానాలలో నలబయి మూడు శాతం దక్కించుకొందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ‘్భజపా’నాయకుడు దేవేంద్ర పడణవీస్ చెపుతున్నాడు. ఈ ఎన్నికలలో తాము పోటీచేసిన స్థానాలలో తమ పార్టీకి డెబ్బయి మూడు శాతం లభించినట్టు కూడ దేవేంద్ర గంగాధరరావు ఫడ్నవీస్ చెపుతున్నాడు. స్థానాల సంఖ్య తగ్గినప్పటికీ ‘విజయాల’ శాతం పెరిగిందన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంతృప్తికి ప్రాతిపదిక కూడా సంకీర్ణ రాజకీయమే! సంకీర్ణ రాజకీయాలు వివిధ రాష్ట్రాలలో మరికొంత కాలం కొనసాగడం ఖాయమన్నది ఇలా ‘హరియాణ’, ‘మహారాష్ట్ర’ల జనాదేశం మరోసారి ధ్రువపరచింది. గత ఎన్నికలలో మహారాష్ట్ర శాసనసభలోని రెండువందల ఎనబయి ఎనిమిది స్థానాలలోను ‘చతుర్ముఖ’ సమరం జరిగింది. ‘్భజపా’, ‘శివసేన’ మైత్రి ఆ ఎన్నికలలో భగ్నమైంది. కాంగ్రెస్, ‘జాతీయతా కాంగ్రెస్ పక్షం’ విడివిడిగా 2014నాటి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీచేశాయి. ఈ ఎన్నికలలో ఉభయ కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. ‘్భజపా’, ‘శివసేన’ల కూటమి కూడ పునరుద్ధరణకు నోచుకుంది. అందువల్ల గత శాసనసభ ఎన్నికలలో కంటె ఈ ఎన్నికలలో ఈ నాలుగు పార్టీలు తక్కువ స్థానాలకు పోటీచేశాయి. అందువల్ల ‘విజయాల’శాతం నాలుగు పార్టీలకూ పెరిగింది. కానీ రెండు కూటముల మధ్య తులనాత్మకంగా విజయాలను విశే్లషించాలి. ఈ విశే్లషణ ప్రాతిపదికగా ‘కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్’ కూటమి స్థానాల సంఖ్య విజయాల నిష్పత్తి పెరిగింది. ‘్భజపా’, ‘శివసేన’ కూటమి గెలిచిన స్థానాల సంఖ్య ‘విజయాల’ నిష్పత్తి తగ్గింది. కాంగ్రెస్ కంటె జాతీయతా కాంగ్రెస్ పక్షానికి మహారాష్ట్ర ‘సభ’లో ఎక్కువ స్థానాలు దక్కడం మాత్రం ముందస్తు- మతదాన పూర్వపు-అంచనాలకు అనుగుణంగానే ఉంది!
గత లోక్‌సభ ఎన్నికల నాటికంటె ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోను కాంగ్రెస్‌కు జనాదరణ పెరగడం కూడ అభిలషణీయ పరిణామం. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయానికి బలమైన సిద్ధాంత నిబద్ధమైన, కుటుంబ వారసత్వ రాజకీయ విముక్తమైన జాతీయ రాజకీయ పక్షం అనివార్యం. రానున్న అనేక ఏళ్లపాటు భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయిలో అధికారపక్షంగా కొనసాగడం ఖాయమన్నది నిరాకరింపజాలని వాస్తవం! జాతీయస్థాయిలో సమర్ధవంతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎదగడం, కొనసాగడం ప్రజాస్వామ్య విజయానికి అనివార్యం. అలా కాంగ్రెస్ మళ్లీ ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది మహారాష్ట్ర, హరియాణల జనాదేశం ద్వారా ప్రస్ఫుటిస్తున్న వాస్తవం! ‘కాంగ్రెస్ విముక్త భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడాలని భావించడం వౌలిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కానీ, రాహుల్ గాంధీ వంటి ‘రాజకీయ విదూషకుల’ నుంచి కాంగ్రెస్ మహాసంస్థకు విముక్తి లభించాలని ఆకాంక్షించడం మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణం! రాహుల్ అధ్యక్షతన లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసిన కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయింది. పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన రాహుల్ అధ్యక్ష పదవినుంచి వైదొలిగాడు. ఆయన ఆధ్వర్యవం నుంచి, అధ్యక్షత నుంచి కాంగ్రెస్ విముక్తమైంది. కాంగ్రెస్‌కు ఈ ‘విముక్తి’లభించిన తరువాత జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ బలం గణనీయంగా పెరగడం హర్షణీయ పరిణామం. కుటుంబ వారసత్వ ఆధిపత్య రాజకీయాల నుంచి కాంగ్రెస్‌కు సంపూర్ణ విముక్తి లభించాలి. ఆ సంపూర్ణ విముక్తి సాధనకు ఈ ఎన్నికల ఫలితాలు బహుశా శ్రీకారం.. కాంగ్రెస్ వారి ‘‘కుటుంబ వారసత్వ’ రాజకీయాలను ‘వోటరు’లు తిరస్కరిస్తున్నారనడానికి హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితం కూడ మరో ధ్రువీకరణ...
‘ప్రపంచీకరణ’ కబంధ బంధం నుంచి విదేశీయ సంస్థల పెట్టుబడుల మాయాజాలం నుంచి ప్రభుత్వ నిర్వాహుకులు, రాజకీయ పక్షాలు ఎప్పటికైనా విముక్తం కావాలన్నది రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా నేర్వదగిన గుణపాఠం. ‘ప్రపంచీకరణ’లో భాగంగా విస్తరించిన ప్రధాన వైపరీత్యం వ్యవసాయ రంగం కుదేలుమనడం, రైతులు ఆత్మహత్యలకు గురికావడం! ఈ వాస్తవాన్ని విశ్వసించడానికి ఇప్పటికీ రాజకీయ పక్షాలవారు సిద్ధంగాలేకపోవడం మరో వైపరీత్యం. వ్యవసాయదారుల తీవ్ర అసంతృప్తి ఎంతోకొంత మహారాష్టల్రోను హరియాణలోను అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేసిందన్నది స్పష్టం.