సంపాదకీయం

మతోన్మాద దౌత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టర్కీ ప్రభుత్వ ప్రతినిధులతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరుపలేదు. ‘ఇస్లాం సహకార సమాఖ్య’- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్-ఓఐసి- దేశాల ప్రతినిధులు మన అంతర్గత వ్యవహారాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మన ప్రధాని చర్యకు నేపథ్యం. ఇస్లామిక్ సమాఖ్య ప్రతినిధులు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన న్యూయార్క్‌లో ఈ ‘వ్యతిరేక విధానాన్ని’ మరోసారి ఆవిష్కరించారు. ఇలా భారత వ్యతిరేక మతోన్మాద విద్వేష విషాన్ని ‘ఇస్లాం సమాఖ్య’ వారు వెళ్లగక్కడం ఇది మొదటిసారి కాదు. దశాబ్దుల తరబడి ‘ఇస్లాం సహకార సమాఖ్య’ వారు జమ్మూ కశ్మీర్ గురించి పాకిస్తాన్‌కు అనుకూలంగా, మనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ వ్యతిరేకతను ఇప్పుడు మరోసారి వికృతంగా ప్రదర్శించారు. ఈ వికృత విన్యాసానికి ‘టర్కీ’, సౌదీ అరేబియా దేశాలు ఆధ్వర్యవం వహించడం ఈసారి ప్రత్యేకత! ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌లో గుమికూడిన ‘ఓఐసి’ దేశాల ప్రతినిధుల ‘కశ్మీర్ వ్యవహారాల బృందం’వారు ఇరవై ఆరవ తేదీన ఈ భారత వ్యతిరేక ప్రకటన చేశారు! జమ్మూ కశ్మీర్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని కట్టబెట్టిన మన రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని రద్దుచేయడం అక్రమమని ఈ ఇస్లాం దేశాల ముఠావారు ఆరోపించారు. ఇలా రద్దుచేయడం ‘ఏకపక్ష చర్య’అని చట్టవ్యతిరేకమని ఈ బృందానికి ఆధ్వర్యవం వహించిన టర్కీ, సౌదీ అరేబియా ప్రతినిధులు వ్యాఖ్యానించడం మన అంతర్గత వ్యవహారాలలో అక్రమ ప్రమేయానికి నిదర్శనం. సౌదీ అరేబియా ‘జిహాద్’కూ, జిహాదీ బీభత్సానికి శతాబ్దుల సైద్ధాంతిక భూమిక! కానీ టర్కీ మాత్రం ‘సర్వమత సమభావ’ అభినయాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంది. అమెరికా నాయకత్వంలోని ‘‘ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి’’లో టర్కీకి సభ్యత్వం కలగడం ఈ అభినయానికి ఫలితం. ‘ఐరోపా సమాఖ్య’లో కూడ టర్కీకి ప్రవేశం కల్పించాలన్న ప్రతిపాదన ఏళ్లతరబడి చర్చకు గురి అయింది. కానీ ‘టర్కీ’చేరినట్టయితే ‘ఐరోపా సమాఖ్య’ క్రైస్తవ స్వభావానికి విఘాతం ఏర్పడుతుందన్న భయాందోళనలు కూడ కొనసాగుతున్నాయి. ఇలా ‘మతోన్మాదం’ ఐరోపా దేశాల ప్రభుత్వాల విధానాలలో నిహితమై ఉంది. ‘ఇస్లాం దేశాల కూటమి’ది జిహాదీ స్వభావం. కానీ ఐరోపా దేశాలవారు, ఇస్లాం కూటమివారు మన దేశంలో ‘అల్పసంఖ్య’ మతస్థుల హక్కుల గురించి, సర్వమత సమభావం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు దశాబ్దుల తరబడి చేస్తూనే ఉన్నారు. మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దుకావడంతో కశ్మీర్ లోయలోని జనాభా మత నిష్పత్తులు మారిపోతాయన్నది టర్కీ, సౌదీ అరేబియా వెళ్లగక్కిన ఆక్రోశం. విషపూరిత విద్వేషం! ప్రధాని మోదీ న్యూయార్క్‌లో టర్కీ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరుపకపోవడానికి ఇదీ నేపథ్యం...
ఈ ‘ఇస్లాం సహకార సమాఖ్య’ దేశాలు పరస్పరం కలహించుకుంటున్నాయి. కానీ ‘ఇస్లాం కూటమి’లో లేని దేశాల విషయంలో మాత్రం ఈ దేశాలన్నీ కలసికట్టుగా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇందుకు ఏకైక కారణం ఇస్లాం మతం వారు అధిక సంఖ్యలో ఉన్న ప్రతి దేశంలోను జిహాదీలు ప్రబలంగా ఉండడం. వివిధ ‘ఇస్లాం మత కూటమి’దేశాల ప్రభుత్వాలను ‘జిహాదీ’ స్వభావం ఆవహించి ఉంది. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను ధ్వంసం చేసి ప్రపంచమంతటా ‘ఇస్లాం’ను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం ‘జిహాదీ’ల లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం ‘జిహాదీ’లు శతాబ్దుల తరబడి బీభత్సకాండ జరుపుతున్నారు. క్రీస్తుశకం 712లో అరబ్బీ బీభత్సకారుడు మహమ్మద్ బిన్ కాసిమ్ మన దేశంలోని సింధులోని ‘దేవల’ పట్టణంలో చొరబడడం మన దేశంలో ‘జిహాద్’కు ఆరంభం. 1947నాటికి భారత్‌లోని అనేక భాగాలలో ‘ఇస్లాం’ మతస్థులు జనాభాలో ‘సఖ్యాధిక్యం’- మెజారిటీ- సాధించడానికి కారణం జిహాదీ బీభత్సకాండ! ఇలా ఇస్లాం జన సంఖ్యాధిక్యం ఏర్పడిన ప్రాంతం పాకిస్తాన్‌గా ఏర్పడింది, దశాబ్దుల తరబడి ‘అల్పసంఖ్య’ హిందువుల నిర్మూలన జరిగింది. ఫలితంగా పాకిస్తాన్‌లోని జనాభా ‘నిష్పత్తి స్వభావం’- డెమొగ్రాఫిక్ నేచర్ మారింది. ఇస్లాం ఏకైక మతంగా పాకిస్తాన్‌లో ఈ ‘స్వభావ పరివర్తన’ జరిగింది! 1947 నాటికి ‘కశ్మీర్ లోయ’ ప్రాంతంలో హిందువుల సంఖ్య జనాభాలో ఇరవై ఏడు శాతం, క్రీస్తుశకం పదమూడవ శతాబ్ది నాటికి ‘లోయ’ ప్రాంతంలోని జనాభాలో వంద శాతం హిందువులు. కానీ జిహాదీలు శతాబ్దుల తరబడి హిందువులపై దాడి చేశారు, హిందువులను హత్యచేశారు, ఇస్లాంలోకి బలవంతంగా మార్చారు...
‘లోయ’లో హిందువుల సంఖ్య 1947నాటికి ఇరవై ఏడు శాతానికి దిగజారడానికి ఈ ‘జన నిష్పత్తి స్వభావ పరివర్తన’కారణం! కానీ 1991నాటికి ‘జిహాదీ’లు ‘లోయ’ నుంచి హిందువులను సమూలంగా నిర్మూలించారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం హిందువులు కొన్ని వందల కుటుంబాలకు పరిమితమయ్యారు. యుగాల నాటి స్వజాతీయులను జిహాదీలు నిర్మూలించడం ఆ విధంగా జనాభా నిష్పత్తి స్వభావ పరివర్తన జరగడం ‘ఇస్లాం దేశాల కూటమి’కి అభ్యంతరకరం కాలేదు. ఎందుకంటె ప్రపంచమంతటా ఇస్లాం మతేతరులను నిర్మూలించడం ‘జిహాదీ’ల లక్ష్యం. కానీ మూడువందల డెబ్బయ్యవ అధికారణం రద్దుకావడంతో ఇస్లామేతర మతాలవారు భారీ సంఖ్యలో వెళ్లి ‘లోయ’ప్రాంతంలో స్థిరపడిపోతారట. ఫలితంగా లోయ ప్రాంతంలోని జన నిష్పత్తిస్వభావం ఇస్లాం మతానికి ప్రతికూలంగా మారిపోతుందట- ఇదీ ‘ఇస్లాం సహకార సమాఖ్య’ దేశాల వారి ఏడుపు. మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని మళ్లీ పునరుద్ధరించాలని ‘ఓఐసి’వారు పిలుపునిస్తున్నారు...
సిరియాలో ‘ఇరాక్ సిరియా ఇస్లాం రాజ్యం’- ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’-ఐసిస్- జిహాదీ ముఠావారు ఏళ్లతరబడి భయంకర బీభత్సకాండను సాగిస్తున్నారు. దీనివల్ల సిరియా నుంచి అనేక వేలమంది టర్కీలోకి దాటుకుంటున్నారు. ఈ వలసల వెల్లువ కారణంగా టర్కీ, సిరియా ప్రభుత్వాల మధ్య తీవ్రమైన వైరుధ్యాలు నెలకొని ఉన్నాయి. కానీ జమ్మూ కశ్మీర్‌లో అక్రమంగా జోక్యం చేసుకొనడంలో మాత్రం సిరియా, టర్కీ దేశాలు ప్రభుత్వాలు సమాన దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. ఈ సమానత్వం ‘జిహాదీ’ స్వభావం! ‘ఐసిస్’ను పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’-ఐఎస్‌ఐ- ముఠావారు పురికొల్పుతున్నారు. తాలిబన్లతో విభేదాలను నటిస్తున్న ‘ఐసిస్’ ‘లష్కర్ ఏ తయ్యబా’తో అనుసంధానమై ఉంది. ఈ అనుసంధాన కర్త పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’. మరోవైపు ‘తాలిబన్ల’ను ‘ఐఎస్‌ఐ’ సమర్ధిస్తోంది. కానీ జమ్మూ కశ్మీర్‌లో బీభత్సకాండను సాగిస్తున్న పాకిస్తాన్‌ను సిరియా, టర్కీ, సౌదీ అరేబియా సమానంగా సమర్ధిస్తున్నాయి. ఈ సమర్ధన ‘జిహాదీ’ స్వభావ సమానత్వం. ‘జమాల్ కషోగీ’అన్న పత్రికా రచయితను సౌదీ అరేబియా ప్రభుత్వం గత ఏడాది హత్యచేసింది. టర్కీలోని ‘ఇస్తాంబుల్’లోని సౌదీ రాయబార కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. ఈ హత్య జరిగిన తరువాత టర్కీ ప్రభుత్వానికి, సౌదీ అరేబియా ప్రభుత్వానికి మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. ఈ హత్యను తానే చేయించినట్టు మహమ్మద్ బిన్ సల్మాన్ అన్న సౌదీ అరేబియా ‘యువరాజు’ ఇరవై ఆరవ తేదీన ప్రకటించాడు. ఇలా ప్రకటించిన సమయంలోనే న్యూయార్క్‌లో సౌదీ అరేబియా, టర్కీ ప్రభుత్వాల ప్రతినిధులు కలిసికట్టుగా మన దేశాన్ని నిందించారు! వారిలో పరస్పరం ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ ‘జిహాదీ’ లక్ష్యసాధన వ్యవహారంలో ‘ఓఐసి’దేశాలన్నీ ఒకటే.. ఇదీ గుణపాఠం!!