సంపాదకీయం

అద్భుతం.. వాస్తవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ ‘మేధ’కున్న పరిమితులు ఇలా మరోసారి ధ్రువపడినాయి. హిమాలయ పర్వతశ్రేణులలో కనిపించిన ‘మంచుమనిషి’ పాదముద్రలు ఈ సరికొత్త ధ్రువీకరణ! ఈ మంచుమనిషికి ‘యతి’ అని ఎవరు ఎప్పుడు నామకరణం చేశారన్నది స్పష్టం కాని విషయం. కానీ ‘యతి’ మళ్లీ కన్పించాడన్నది మంగళవారం, బుధవారం ప్రచారమైన వ్యవహారం! ఈ ‘మంచుమనిషి’ పద ముద్రలు కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఈ ‘పద చిహ్నాల’ను అనేకమంది గుర్తించారట. విదేశీయులు ప్రధానంగా ఐరోపీయ పరిశోధకులు, అధ్యయన వేత్తలు ఈ ‘మహామనిషి’ కాలి గుర్తులను గుర్తించడం ప్రచారానికి నోచుకున్న మహావిషయం. కేవలం భాతీయులు గుర్తించినట్టయితే ఇతర భారతీయులలో అత్యధికులు ఈ వాస్తవాన్ని నమ్మి ఉండేవారు కాదు. విదేశీయులు కనిపెట్టినప్పుడు మాత్రమే వాస్తవాన్ని వాస్తవమని భారతీయ విద్యాధికులలో అత్యధికులు విశ్వసించడం దాదాపు రెండు శతాబ్దుల చారిత్రక వాస్తవం. ఇందుకు ఏకైక కారణం విదేశీయుల భౌతిక దురాక్రమణ సమయంలో మన ‘బుద్ధి’ని ఆవహించిన భావదాస్యం. మనవారు సమకాలంలో కాని పూర్వం కాని చెప్పిన శాస్ర్తియ వాస్తవాలను మూఢ విశ్వాసాలుగా పరిగణించడం ఈ భావదాస్యం! పాశ్చాత్యులు చెప్పినవి మూఢ విశ్వాసాలా? శాస్ర్తియ వాస్తవాలా? అన్నవి చికిత్సకు, మీమాంసకు ఈ భావదాస్యపు పరిధిలో స్థానం లేదు. అందువల్ల ‘పాశ్చాత్య శంఖం’లో పోసినప్పుడు మాత్రమే ‘్భరతీయ జలం’ ‘తీర్థం’గా మారుతుందన్నది నడచిన చరిత్ర, నడుస్తున్న విచిత్ర.. ఇప్పుడు కనిపించిన మంచుమనిషి పదముద్రలు గతంలో హిమాలయాలలో విహరించిన పాశ్చాత్య దేశాల పరిశోధకులకు కూడ కనిపించి ఉన్నాయి. అందువల్ల మన సైనిక దళాల వారికి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన కనిపించిన ఈ భారీ పాదముద్రలు మంచు మనిషి- యతి-వేనన్నది అంతర్జాతీయంగా జరిగిన నిర్ధారణ! ఇతర దేశాల బుద్ధిజీవుల విశ్వాసంతో కాని అవిశ్వాసంతో కాని నిమిత్తం లేకుండా మన దేశంలో పరంపరగా వస్తున్న శాశ్వత- సనాతన- శాస్ర్తియ సత్యాలను సత్యాలని విశ్వసించే భారతీయ జీవన విధానం మళ్లీ పరిపుష్టం కావాలి! అలా జరిగినప్పుడు పాశ్చాత్య వికృతులతో ప్రభావితం అవుతున్న మన జాతి మళ్లీ సుదూర గతంలోవలె తన ఉత్తమ సంస్కారాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలదు. భారతీయుల శాస్ర్తియ ‘యోగం’ అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తుండడం ఒక ఉదాహరణ మాత్రమే! విశ్వాసం పెరగాలి, జాతీయ విశ్వాసం వెలగాలి. ఈ ‘గీటురాయి’పై- స్వజాతీయ సాంస్కృతిక నికషంపై- మన సైనిక దళాలకు కనిపించిన ‘మంచుమనిషి’ కాలి గుర్తులను నిగ్గుతేల్చాలి...
హిమాలయ పర్వత శ్రేణిలోని అత్యంత ఉన్నత శిఖరం ‘గౌరీ శంకరం’. నేపాల్ ప్రజలు ఈ శిఖరాన్ని ‘సాగర మాత’ అని కూడ పిలుస్తున్నారు. ఈ ‘ఎవరెస్టు’ శిఖరంతోపాటు ప్రపంచంలోని మరో తొమ్మిది అత్యున్నత శిఖరాలు కూడ హిమాలయ పర్వత శ్రేణిలోనే నెలకొని ఉన్నాయి. అఖండ భారతదేశం ఉత్తర భాగాన హిమాలయ పర్వతశ్రేణి వ్యాపించి ఉండడం భౌగోళిక వాస్తవం. ‘‘దేవతలకు ఆత్మ, పర్వతాలకు అధినాయకుడు ‘హిమాలయ’ నామధేయుడు ఈ దేశపు ఉత్తర భాగాన ఉన్నాడు...’’ అన్నది మహాకవి కాళిదాసు రెండువేల వంద ఏళ్లకు పర్వం చెప్పిన మాట!- అస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః-! ‘దేవతాత్మ’ అయిన ‘హిమాలయం’ అనేక అద్భుత వాస్తవాలకు ఆలవాలం! ‘మంచుమనిషి’ ఈ ప్రాంతంలో తిరుగాడుతుండడం ఇలాంటి శాస్ర్తియ అద్భుతం- సైంటిఫిక్ మార్వెల్-! హిమాలయాలలోని ‘మకాలూ’ శిఖరం ప్రపంచంలో ఐదవ స్థాయి ఉన్నత శృంగం. గౌరీ శంకర శృంగం ఎత్తు ఇరవై తొమ్మిది వేల ముప్పయి ఐదు అడుగులు, మకాలూ ‘శృంగం’ ఎత్తు ఇరవై ఏడు వేల ఏడువందల అరవైఐదు అడుగులు. మకాలూ పరిసర ప్రాంతాలలో ‘మంచుమనిషి’ అడుగులు గతంలో కూడ కనిపించాయి. అందువల్ల ‘మంచుమనుషులు’ ఈ ‘మకాలూ’ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారన్నది వాస్తవం! ‘ఒక్కరు’గా మానవులు జీవించలేరు, ఋషులు కాని, రాక్షసులు కాని, సామాన్య మానవులు కాని, జంతువులు కాని సముదాయాలుగానే జీవించడం ప్రకృతి స్వభావం. అందువల్ల ‘మంచు మనిషి’ ఒక్కడు మాత్రమేకాక పోవచ్చు. గతంలో కనిపించిన పాదముద్రలు ఇప్పుడు ‘మకాలూ’ పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి యత్నిస్తున్న మన సైనికులకు కనిపించిన ‘పాద ముద్రలు’ ఒకే మంచు మనిషివి కాకపోవచ్చు. అందువల్ల అనేకమంది మంచు మనుషులు ‘మకాలూ’ ప్రాంతంలోనేకాక హిమాలయ ప్రాంగణమంతా విహరిస్తూ ఉండవచ్చు. కొందరి పాదచిహ్నాలు కనిపించి ఉండవచ్చు! కనిపించని పాదముద్రలు ఎన్నో మరి!
మన సైనిక అధికారులు, సైనికుల పర్వతారోహక బృందానికి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన కనిపించిన ‘కాలి గుర్తులు’ మామూలు మానవుల పాదాల పరిమాణం కంటె మూడు రెట్లు పెద్దవి. ఈ ‘యతి’ పాదాలు మామూలు మానవుల ‘కొలమానం’ ప్రకారం ముప్పయి రెండు అంగుళాల పొడవు, పదిహేను అంగుళాల వెడల్పు ఉన్నాయట. ఇంత పెద్ద అడుగులున్న మనిషి ఎత్తు ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు! కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం కలసి ఒక మహాయుగం. యుగాలు మహాయుగాలు నెలల వలె ఋతువులవలె పునరావృత్తం కావడం కాలగమన స్వభావం. కృత యుగంలో మానవుల శరీర పరిమాణాలు, జీవన వ్యవధి చాలా పెద్దవన్నది చరిత్ర! వేల ఏండ్లు జీవించిన వారి శరీరాలు మన శరీరాల కంటె చాలా పెద్దవి. శరీరాలు, జీవన వ్యవధి కృతయుగం నుంచి కలియుగం వరకూ క్రమంగా తగ్గిపోయాయన్నది చారిత్రక పరిణామ క్రమం. అందువల్ల ఇంత పెద్ద శరీరం ఉన్న ‘మంచు మానవులు’ గత ద్వాపర త్రేతా కృత యుగాలనాటివారు కావచ్చు, కాకపోవచ్చు కూడ. కానీ ‘‘ప్రతి దినం దీర్ఘకాలం సంధ్యావందనం చేస్తున్న ‘ఋషులు’దీర్ఘకాలం జీవిస్తున్నారు...’’ అన్నది సనాతన సూక్తి. ‘ఒక యోగి ఆత్మకథ’- ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి- అన్న గ్రంథంలో ఇలా దీర్ఘకాలంగా జీవిస్తున్న ‘యోగు’ల, ఋషుల వివరాలు ఎన్నో ఉన్నాయి. విశ్వసించడం, విశ్వసించకపోవడం వేరే విషయం! మనకు తెలిసిన, అర్థమైన రీతిలో మాత్రమే ఆద్యంత రహిత విశ్వవ్యవస్థలో ప్రాణాలు, జీవజాలం ఉండాలని ఉంటాయని భావించడం ‘అనభిజ్ఞత’కు చిహ్నం. తిరుగుతున్న భూమికి ప్రాణం ఉంది, ఈ ప్రాణం స్వభావం మానవుల ప్రాణ స్వభావం కంటె భిన్నమైనది. తిరుగుతున్న భూమి తింటూ ఉన్నది. ఈ భోజనం మానవుల తిండి కంటె విభిన్నం. తినే తీరు కూడ విలక్షణమైనది. కానీ మానవుని ‘అనభిజ్ఞత’ ‘అతిశయం’గాను ‘అహంకారం’గాను ప్రస్ఫుటిస్తోంది. ‘విశ్వవ్యవస్థ’ను పరిమిత ‘మానవ మేధ’లో ఇరికించే ప్రయత్నం ఈ అహంకారం!
అందువల్ల హిమాలయ దుర్గమ గుహాగృహాలలో పూర్వయుగాల ఋషులు ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారన్న గిక సత్యం అతార్కికం కాజాలద. సుప్రసిద్ధ జాతీయ చరిత్రకారుడు కోట వేంకటాచలం క్రీస్తుశకం 1940వ దశకంలో రచించిన ‘ఆర్యుల ధ్రువనివాస ఖండనము’ అన్న చారిత్ర గ్రంథంలో ‘అతి మానవుల’ ఆనవాళ్ల గురించి మరికొన్ని వివరాలు లభిస్తున్నాయి. ఇవన్నీ అప్పటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమయినట్టు కోట వేంకటాచలం వివరించి ఉన్నాడు. మహారాష్టల్రోని కొల్హాపురం సమీపంలోని ‘విశాలగఢ్’వద్ద పదహారు అడుగుల పొడవైన ‘రాక్షస’- మహామానవ- అస్థిపంజరం 1949లో బయట పడడం ఈ వివరాలలో ఒకటి. ఆరడుగుల మానవుని కంటె పది అడుగులు పొడవైన - ఎత్తయిన- ఈ ‘అతి మానవుడు’ఎప్పటివాడు? ఏ యుగం వాడు? సృష్టినిహితమైన ఇలాంటి అద్భుత సత్యాలు కేవలం స్వరూపానికి పరిమితం కాదు. స్వభావంలో కూడ అద్భుత సత్యాలు నిహితమై ఉన్నాయి. ప్రముఖ రచయిత రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ ఈ ‘స్వభావ విలక్షణత’ను ఒక ఉదాహరణ ద్వారా ఇలా వివరించాడు. దశాబ్దులకు పూర్వం ఉత్తర భారతంలోని ‘కుంభమేళా’లకు ఒక యోగి వచ్చేవాడట! ఆయనతోపాటు ఒక పెద్దపులి కదలివచ్చేది. ఆ పులి వౌనంగా ఆ ధర్మాచార్యుని వెంట నడిచింది. వేల మంది మధ్య యోగితోపాటు తిరుగాడిన ఆ పులి మెడకు గొలుసు లేదు. ఆ పులి జనంపైకి దూక లేదు. యోగిని ‘కుక్క’వలె అనుసరించింది.. ఈ వాస్తవం ప్రాతిపదికగా నారాయణ్ ‘మాల్‌గుడికి ఒక పులి’- ‘ఏ టైగర్ ఫర్ మాల్‌గుడి’- అన్న ఆంగ్ల నవలను వ్రాశాడు..