సంపాదకీయం

మత కూటమి ‘మైత్రి’?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లాం మత ప్రభుత్వ దేశాల సహకార సమాఖ్య- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్- ఓఐసీ- వారి సమావేశంలో ప్రసంగించడానికి మన విదేశ వ్యవహారాలశాఖ మంత్రి సుషమా స్వరాజ్ అంగీకరించినట్టు జరుగుతున్న ప్రచారం విచిత్ర పరిణామం. ‘ఐక్య అరబ్ సంస్థానాల’- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- యుఏఈ-లో జరుగుతున్న ఈ సమావేశం ప్రారంభంరోజున, మార్చి ఒకటవ తేదీన, సుషమాస్వరాజ్ ‘విశిష్ట అతిథి’ హోదాలో ఈ సమావేశంలో ప్రసంగించనున్నారట! ‘ఓఐసీ’ మతోన్మాద రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాల కూటమి. ఈ దేశాలలో ‘ఇస్లాం’ను ఏకైక అధికార మతంగా ఆయా దేశాల రాజ్యాంగాలలో నిర్దేశించి ఉన్నారు. అందువల్ల ఈ ‘ఓఐసీ’ దేశాలలోని ఇస్లామేతర మతాలవారు ద్వితీయ, తృతీయ శ్రేణి పౌరులుగా జీవచ్ఛవాలవలె జీవిస్తున్నారు. ఇలా కొన్ని మతాలవారిని అవమానించడం, అణగదొక్కడం, నిర్మూలించడం, వారు నిస్సహాయులై విధి లేక ఇస్లాం మతంలోకి మారవలసిన స్థితిని కల్పించడం పాశవికమైన రాజ్యాంగ ప్రవృత్తికి చిహ్నం. ‘జిహాదీ’లు శతాబ్దుల తరబడి వివిధ దేశాలలోకి చొరబడి ఆయా దేశాలలోని స్వజాతీయ మతాలవారిని చంపివేయడం. కిరాతక పాశవిక బీభత్స కలాపాలకు గురిచేయడం చరిత్ర. ఆయా దేశాలలోని స్వజాతీయ మతాలవారిని బలవంతం గాను, ప్రలోభాలను కల్పించడం ద్వారాను ఇస్లాం మతంలోకి మార్చడం కూడ చరిత్ర. ఇదంతా పైశాచిక మతోన్మాదం, అన్యమత విద్వేషం. ఈ చారిత్రక వారసత్వపు పునాదుల మీదనే ప్రస్తుతం ‘ఓఐసీ’ దేశాల రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడి ఉన్నాయి. అందువల్ల ‘సర్వమత సమభావ’- సెక్యులర్- స్ఫూర్తికీ ‘ఇస్లామీ మత రాజ్యాంగ’ వ్యవస్థకూ మధ్య వౌలికమైన వైరుధ్యం శతాబ్దులుగా ఏర్పడి ఉంది. మన దేశం అనాదిగా ‘సర్వమత సమభావ’ రాజ్యాంగ వ్యవస్థగా వికసించింది. మన దేశంలోకి చొరబడిన ‘జిహాదీ’లు స్థాపించనెంచిన ఏక మత రాజ్యాంగ వ్యవస్థను సర్వమత సమభావం స్వభావమైన స్వజాతి ప్రతిఘటించడం క్రీస్తుశకం 712 నుంచి 1947 వరకు నడచిన చరిత్ర. స్వజాతి గెలిచినప్పుడు ‘సర్వమత సమభావం’ పరిఢవిల్లింది. ‘ఇస్లాం’తో సహా అన్ని మతాలవారు సమానంగా జీవించగలిగారు, ‘జిహాదీ’లు గెలిచినప్పుడు ఇస్లాం తప్ప మిగిలిన మతాలు నిర్మూలనకు గురిఅయ్యాయి, ఇస్లాం ఏకైక మతంగా వ్యవస్థీకృతమైంది. అనాదిగా ఒకే ‘జాతి’గా, ఒకే ‘సమీకృత సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’గా మన ‘అఖండ భారతదేశం’ పరిఢవిల్లింది. 1947లో అఖండ భారతదేశ విభజన జరగడానికి ఏకైక కారణం క్రీస్తుశకం 712 నుండి విదేశాలనుంచి వచ్చిపడిన, ఆ తరువాత దేశంలోనే పుట్టిపెరిగిన ‘జిహాదీ’లు స్వజాతీయ మతాలను నిర్మూలించడం. 1947నాటికి ఇస్లాం మత జన బాహుళ్యం ఏర్పడిన ప్రాంతాలు అఖండ భారత్‌నుంచి విడిపోయి పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. ఈ మతోన్మాద భూమికపై మనుగడ సాగిస్తున్న వివిధ స్వతంత్ర దేశాల కూటమి ‘ఓఐసీ’... అందువల్ల ఈ దేశాలవారు సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థలను స్వీకరించనంతవరకూ ‘సర్వమత సమభావ సమాజ’ రూపమైన మన దేశ ప్రతినిధులు ఈ ‘ఓఐసీ’ సభలలో పాల్గొనడం అంతర్జాతీయ వైపరీత్యం....
వర్ణ దురహంకారం, జాతీయ దురహంకారం, భాషా దురహంకారం, మత దురహంకారం ప్రపంచ శాంతికి అంతర్జాతీయ సయోధ్యకు భయంకరమైన రీతిలో విఘాతం కలిగిస్తున్న దుష్టచతుష్టయం.... స్పెయిన్, బ్రిటన్, ఉక్రెయిన్ వంటి ఐరోపా దేశాలలోను కెనడా వంటి అమెరికా ఖండపు దేశాలలోను భాషా ఉన్మాదం ముదిరి అన్యభాషా జన సముదాయాలకు వ్యతిరేకంగా బీభత్సకాండ సాగిస్తోంది. ఈ దేశాలలో విచ్ఛిన్నశక్తులు విజృంభించడానికి ఇదీ కారణం. ‘జాతి’ దురహంకారులైన ఐరోపా దేశాలవారు దాదాపు నాలుగు శతాబ్దులపాటు ఇతర దేశాలలో భయంకర దమనకాండ సాగించడం చరిత్ర. దక్షిణాఫ్రికా, నమీబియా వంటి దేశాలలోని అధిక సంఖ్య ప్రజలను అణచివేసిన ‘తెల్ల రంగు’ ఉన్మాదాన్ని- అపార్తీడ్- ప్రపంచ దేశాలు దశాబ్దుల అభిశంసించాయి, వర్ణ వివక్ష నిహితమైన రాజ్యాంగ వ్యవస్థలను బహిష్కరించాయి, వివక్షను ప్రోత్సహించిన దేశాలపై ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆంక్షలు విధించాయి. చివరికి నమీబియా, దక్షిణాఫ్రికా, రొడీషియా - జింబాబ్వే- వంటి దేశాలలో ‘రంగుల’పేరుతో వివక్ష చూపే వ్యవస్థలు నశించడం సర్వవర్ణ సమభావ రాజ్యాంగ వ్యవస్థలు నెలకొనడం చరిత్ర....
కానీ మతం పేరుతో ఇస్లామేతర మతాల పట్ల వివక్షను చూపుతున్న ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ’లను దారికితేవడానికి మాత్రం ‘ఐక్యరాజ్య సమితి’కాని అంతర్జాతీయ సమాజం కాని ప్రయత్నించకపోవడం మాత్రం ‘విచక్షణ’కు అంతుపట్టని వైపరీత్యం. ప్రతి దేశంలోను ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండాలని లేనిచోట ఏర్పడాలని కోరడం వర్తమాన అంతర్జాతీయ నాగరికం. ‘ప్రపంచ ప్రజాస్వామ్య సమాజం’- వరల్డ్ డెమొక్రాటిక్ ఆర్డ్‌ర్- ఏర్పడాలన్నది ఇప్పటికీ ఆకృతి దాల్చని ఆదర్శంగా మిగిలి ఉండవచ్చుగాక. కానీ ఈ ‘సిద్ధాంతం’ సాకారం కావాలన్నది నాగరిక రీతి. అలాగే ‘‘ప్రపంచ సర్వమత సమభావ సమాజం’’- వరల్డ్ సెక్యులర్ ఆర్డర్- ఏర్పడడం జిహాదీ బీభత్సకాండను నిర్మూలించడానికి వౌలిక మాధ్యమం. మత రాజ్యాంగ వ్యవస్థలవల్ల ఇస్లాం మతస్థులలో కొందరికి మతోన్మాదం, అన్యమత ద్వేషం కలుగుతున్నాయి.
ఈ అన్యమత విద్వేషమే అన్యమత నిర్మూలనకు లక్ష్యంగా ‘జిహాదీ’ పిశాచాలను రూపొందిస్తోంది. ‘జిహాదీ’ బీభత్సకు అతిభయంకరంగా అతి దీర్ఘకాలం బలి అయిన మన దేశం ‘ఓఐసీ’ దేశాలకు ఇవ్వదగిన సలహా ఒక్కటే - ‘‘మీ దేశాలలో సర్వమత సమభావ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలను ఏర్పాటుచేసుకోండి’’ అలా జరిగిననాడు మాత్రమే ఈ యాబయి ఏడు దేశాలవారు ‘‘సర్వమత సమభావ జన్మభూమి’’ అయిన మన దేశం పట్ల నిజమైన మైత్రిని పాటించగలవు. అది జరగనంతవరకు పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకాండ అంతంకాదు. ‘ఓఐసీ’ వౌలిక సిద్ధాంతమే ‘జిహాదీ’ బీభత్సకాండ విస్తృత స్ఫూర్తి! సుషమాస్వరాజ్ ఈ వాస్తవాన్ని ‘ఓఐసి’ వేదికపై వివరించగలదా? వివరించినట్టయి ఈ దేశాల ప్రభుత్వాలవారు వింటారా? వివరించలేక పోయినట్టయితే వినకపోయినట్టయితే మన మంత్రి ఈ ‘కూటమి’ వేదికకు వెళ్లడం దండగ....
సౌదీ అరేబియాలోని ‘జెద్దా’ ప్రధాన కేంద్రంగా 1969లో ఏర్పడిన ‘ఓఐసీ’లో యాబయి ఏడు సభ్య దేశాలున్నాయి. మూడేళ్లకోసారి, కొన్ని సందర్భాలలో రెండేళ్లకోసారి జరుగుతున్న ‘ఓఐసీ’ శిఖర సమావేశాలలో దాదాపు ప్రతిసారీ మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు అనుకూలంగా తీర్మానాలు ఆమోదించడం ఈ యాబయి ఏళ్ల చరిత్ర! కశ్మీర్ మన దేశంలో అనాదిగా అవిభాజ్యం అన్న వాస్తవాన్ని ‘ఓఐసీ’ ఇంతవరకూ అంగీకరించలేదు, అంగీకరించిన ‘జాడ’లేదు. ‘‘జమ్మూకశ్మీర్‌లో భారత ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని’’, ‘‘్భరత సైనికులు కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా మార్చేందుకు యత్నిస్తున్న స్వాతంత్య్ర ఉద్యమకారులను హత్యచేస్తున్నారని ‘‘వివిధ సమావేశాలలో ‘ఓఐసి’వారు విమర్శించారు, నిందించారు! ‘జిహాదీ’లు మన సైనికులను పోలీసులను ప్రజలను హత్య చేసినప్పుడల్లా ‘ఓఐసి’ దేశాలలోని జనాలు-అత్యధికులు- హర్షం ప్రకటిస్తున్నారు. కొన్ని దేశాల ప్రభుత్వాలు మన దేశంతో ద్వైపాక్షిక మైత్రిని కొనసాగించడం వాస్తవం. కానీ సమష్టిగా ‘ఓఐసీ’ మన దేశంపై మంటలు కక్కడం చరిత్ర... పుల్వామా జిల్లా అవన్తిపురాలో నలబయి మంది మన సైనికులను పాకిస్తాన్ హత్య చేయించడాన్ని మార్చిలో జరిగే ‘ఓఐసీ’ సదస్సు నిరసించగలదా? నిరసిస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తే అది మనకు గొప్ప దౌత్య విజయం, మానవీయ సంస్కారాలకు బలం.... ఆమోదించకపోతే?