సంపాదకీయం

నిర్దోషులను ఇరికించారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతికి సేవచేసినందుకు నన్ను శిక్షించారు, నా గౌరవాన్ని నా అధికారాన్ని నా ఉద్యోగాన్ని దోచుకున్నారు-అని సైనిక అధికారి లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ వాపోయాడు. చేయని నేరానికి ఆయన ఎనిమిదేళ్లుగా నిర్బంధంలో ఉన్నాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌రైలులో జరిగిన పేలుళ్లను ఆయనే జరిపించినట్టు ప్రచారమైంది. మాలేగావ్ పేలుళ్ల అభియోగంలో కూడ ఈ సైనికాధికారి ప్రధాన నిందితుడు. అభియోగం నిజమని ప్రభుత్వం విశ్వసిస్తున్నపుడు ఎనిమిది ఏళ్లుగా తనకు వ్యతిరేకంగా ఎందుకని న్యాయస్థానం విచారణను కొనసాగించడం లేదన్నది పురోహిత్ అడుగుతున్న ప్రశ్న. నిందితుడు నేరస్థుడు కావచ్చు, కాకపోవచ్చు. న్యాయ విచారణ వల్ల మాత్రమే నిజానిజాలు నిగ్గుతేలతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. పరిణితి చెందిన సర్వమత సమభావన వ్యవస్థ మనది. నాగరిక పద్థతులు వ్యవస్థీకృతమైన సమాజం మనది, మానవీయ మూల్యాలకు వౌలిక రూపం మన సంస్కృతి. ఇలాంటి దేశంలో ఒక సైనిక అధికారి బీభత్స కృత్యాలకు పాల్పడినాడన్న ఆరోపణ అంతర్జాతీయ సమాజంలో మనకు అత్యంత అవమానకరం. ఆరోపణ నిజమైతే అది దేశానికి కళంకం. కానీ, దేశభక్తుడైన ఒక ఉన్నత సైనికుడిని టెర్రరిస్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం జరిగి ఉండినట్టయితే దానికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల దౌష్ట్యానికి తల ఒగ్గిన నేర పరిశోధక సంస్థలు అధికారులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదులు మనదేశంలో దశాబ్దుల తరబడి, వందలాది బీభత్సకృత్యాలను నిర్వహించారు. ఈ ఉగ్రవాదుల ఘాతుకాలతో సాధారణ ఇస్లాం మతస్థులకు ఎలాంటి సంబంధం లేదు. కానీ జిహాదీ టెర్రరిస్టులను శిక్షించడం వల్ల సామాన్య ఇస్లాం మతస్థుల మనో భావాలు గాయపడతాయన్న వికృత భ్రాంతికి అనేక రాజకీయ పక్షాల నాయకులు గురి అయి ఉండడం జాతీయ వైపరీత్యం. ‘‘ఇస్లాం మతస్థులు తమకు ఎన్నికలలో వోట్లు వేయరన్నది ఈ వికృత భ్రాంతికి గురి అయిన రాజకీయ నాయకుల భయం. అందువల్ల కొంతమంది ఇతర మతాల వారిని సైతం బీభత్స ఘటనలలో ఇరికించి వారిని, వేధించడం వల్ల అన్ని మతాల మధ్య నేర సమతుల్యతను సాధించినట్టు కాగలదని ఈ నికృష్ట రాజకీయ జీవుల వ్యూహం. ఈ సమతుల్యత వల్ల సాధారణ ఇస్లాం మతస్థులు సంతృప్తి చెంది ఎన్నికలలో తమను బలపరచగలరన్నది ఈ రాజకీయ వాదుల ఆశ..అందువల్లనే కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం వారు లెఫ్ట్‌నెంట్ కల్నల్ పురోహిత్ వంటి వారిని బీభత్స ఘటనలలో నేరస్థులుగా ఇరికించారన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఎనిమిదేళ్లుగా ఆయనపై వచ్చిన అభియోగాల విచారణ పూర్తి కాలేదు. ఆయనను నిర్బంధం నుంచి విముక్తుడినీ చేయలేదు. ఇదేం న్యాయం? నత్తల నడకతో న్యాయ ప్రక్రియ పోటీ పడుతోందనడానకి ఇది మరో ఉదాహరణ కాదా?
దేశానికి అప్రతిష్ఠ కలిగించే విధంగా రాజకీయ నాయకత్వాలు, అధికార పక్షాల ఒత్తడికి లొంగిన దర్యాప్తు విభాగాలు ప్రవర్తిస్తుండడం సిగ్గుచేటు. ఇష్రాత్ జహా వ్యవహారంలో ఇదే జరిగింది. కశ్మీరులో 2010లో సోఫియా గ్రామం వద్ద నీట మునిగిన మహిళల వ్యవహారంలో ఇదే జరిగింది. కశ్మీర్‌లోని హంద్వారాలో నిన్న మొన్న ఒక యువతిని దుండగులు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో ఈ బనాయింపు పునరావృత్తమైంది. దేశ రక్షణ నిష్ఠకల నిజాయతీ పరులైన పోలీసులను, సైనికులను నేరాలలో అక్రమంగా ఇరికించడం ఈ పునరావృత్తి. ఇష్రాత్ జహా భయంకర బీభత్సకారిణి అన్నది ధ్రువపడిన వాస్తవం. పాకిస్తాన్ ప్రభుత్వం తరపున మనదేశంలో జిహాదీ ఉగ్రవాద కలాపాలను సాగించిన వారిలో ఈమె ఒకతి. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన యుద్ధంలో ఆమె హతమైంది. ఆమెను నోటిలో వేలుపెడితే కొరకలేని అమాయకురాలైన విద్యార్థినిగా చిత్రీకరించడానికి కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఏళ్ల తరబడి ఎంతకాండ జరిపాయి? ఎంతమంది గుజరాత్ పోలీసులను కేసులలో ఇరికించారు. గుజరాత్ పోలీసు అధిపతి డిజిపి వంఝరా గత ఫిబ్రవరి వరకు ఎనిమిదేళ్లు అక్రమంగా జైల్లో నిర్బంధానికి గురికావడం, ఇలా ఇరికించే దుష్టవ్యూహానికి మరో ఉదాహరణ...కశ్మీర్‌లో సోఫియా ఘటనలోను, హంద్వారా ఘటనలోను సైనికులను ఇరికించే కుట్ర భగ్నం కావడం ప్రసిద్ధమైన వ్యవహారం..
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లోను, మాలేగావ్‌లోను పేలుళ్లు జరిపించింది పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ముఠాలేనన్న వాదం ప్రస్తుతం బలం పుంజుకుంటున్నది. మన్‌మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం నడచిన సమయంలో జరిగిన ఈ బీభత్స ఘటనలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ పురోహిత్‌ను మాత్రమే కాక కొంతమంది హిందూ ధర్మాచార్యులను కూడా ఇరికించే ప్రయత్నం జరిగింది. ఇష్రాత్ జహా ఉదంతంలో వలెనే ఈ ఘటనలలో కూడ నిందితులు నిర్దోషులని ఋజువై పోయే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇలా ఋజువైతే ఇన్నాళ్లుగా హిందూ ధర్మాచార్యుల మీద ప్రసాద్ పురోహిత్ వంటి అధికారుల మీద బురద చల్లిన రాజకీయవేత్తలు, మాధ్యమాల ప్రచారకర్తలు, జిహాదీలకు అనుకూలంగా వ్యాఖ్యలు విశే్లషణలు చేసినవారు ఏవౌతారు? తేళ్లు కుట్టిన దొంగలలాగా వ్యూహాత్మక వౌనం వహిస్తారని ఇష్రాత్ జహా ఉదంతం వల్ల ధ్రువపడింది. దేశమంతటా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత రకరకాల జిహాదీ ముఠాలు, ఇతర విద్రోహక శక్తులు విస్తరించి పోతుండడం గురింని నోరు మెదపని వారు సందు దొరికితే చాలు దేశభక్తులను జాతీయతా వాదులకు వ్యతిరేకంగా అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లు జరిపించింనది పాకిస్తానీ లష్కర్ ఏ తయ్యబా కావచ్చునన్న సందేహ నివృత్తికోసం జాతీయ పరిశోధక సంస్థ-ఎన్‌ఐఏ- వారు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. ద్వైపాక్షిక న్యాయ సహాయ వ్యవహారాల ఒప్పందం -మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ-ఎమ్‌ఎల్‌ఏటీ- ప్రచారం ఈ విషయమై తమవద్ద ఉన్న సమాచారాన్ని అందించవలసిందిగా అమెరికా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఎన్‌ఐఏ కోరిందట. 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులోను, 2006వ, 2008వ సంవత్సరాలలో మాలేగావ్ లోను పేలుళ్లు జరిగాయి. ఈ బీభత్సకాండలో సాధ్వీ ప్రభాసింగ్ ఠాకూర్‌ను, అసీమానంద స్వామిని దోషులుగా చిత్రీకరించడానికి ఐక్య ప్రగతి కూటమి వారు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన సమయంలో ప్రయత్నం జరిగింది.
ఈ అభియోగాలు తప్పని భావించడాని వీలైన పరిణామాలు ఇప్పుడు సంభవిస్తున్నాయి. ఈ వివాదాలు న్యాయస్థానాల విచారణలో ఉన్నాయి కనుక న్యాయ నిర్ణయాలు వెలువడే వరకు ఎలాంటి అభిప్రాయాలను కానీ వ్యక్తం చేయలేదు. కానీ దర్యాప్తు సంస్థల వారు తమ చేత బలవంతంగా అబద్ధాలను చెప్పించడానికి యత్నించినట్టు నలబయిమంది సాక్షులు ఇటీవల న్యాయస్థానానికి నివేదించడం పెద్దగా ప్రచారం కాని పరిణామం. దర్యాప్తు సంస్థలు హిందూ ధర్మాచార్యులను, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ వంటి సైనికులను ‘ఇరికించే’ ప్రయత్నం చేసి ఉన్నారనడానికి ఈ సాక్షులు చెప్పింది సరికొత్తసాక్ష్యం.