సంపాదకీయం

‘మంటల’ మధ్య మనం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం వేడెక్కుతోందన్నది దీర్ఘకాల పరివర్తనకు సంబంధించిన వైపరీత్యం. మనదేశంలో మరీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది అతి తక్కువ వ్యవధిలోనే ముంచుకొస్తోంది. వేసవి నిప్పుల కొలిమిగా మారింది. వేసవి అగ్నిగుండం అయింది. ఆకాశం నిప్పులను వర్షిస్తోంది. ప్రపంచంలో సగటున మరోపాతికేళ్లలో పెరగనున్న ఉష్ణోగ్రత తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలోనే పెరిగిపోతోందన్నది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వ్యథ. గత ఐదేళ్లలో మొత్తం దేశంలో వడదెబ్బకు బలైపోయిన వారిలో ఐదవ వంతు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారట! కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్టల్రకంటె మన రెండు రాష్ట్రాల్లో తాపోపహతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. 2014లో కంటె 2015లో 2015లో కంటె 2016లో మనదేశపు సగటు ఉష్ణోగ్రత దారుణగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో మరింత దారుణంగా పెరిగింది. 2015 డిసెంబర్‌లో చలి వణికించలేదు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ జనవరి నెలల్లో హేమంత ప్రభావమే కనిపించలేదు. మార్చినెల ఆరంభంలోనే వసంత ఋతువును గ్రీష్మ ఋతువు మింగేసింది. ‘‘వైశాఖం పోయి శాకం..’’ అన్నది నానుడి. ‘‘రోహిణి ఎండలకు రోళ్లు పగులును, రాళ్లు పగులును..’’ అన్నది మరో వాతావరణ వాస్తవం. కానీ ఫాల్గున మాసంతోనే తెలుగు రాష్ట్రాలు నిప్పుల దుప్పటి కింద పొగలు సెగలు కక్కడం మొదలైంది. మార్చి నెలలోనే మే నెల ఎండలను మించిన రీతిలో సూర్య కిరణాలు మంటలను కక్కేశాయి. ఇప్పుడింకా చైత్రం మొదలైందంతే, మరి వైశాఖం వచ్చేసరికి మంటలు మరెంత ముదిరిపోనున్నాయో? ఇ ప్పుడు ఆశ్వనికార్తె నడుస్తోంది. భరణి, కృత్తిక కార్తులు గడచిన తరువాత రోహిణి వస్తుంది. రోహిణిలో మాత్రమే గ్రీష్మతాపం అత్యధికంగా ఉండడం అనాదిగా భారతీయ వాతావరణ స్వభావం. గత ఏడాది, ఈ ఏడాది ఈ స్వభావం మారిపోయింది. అశ్వని కార్తె రావడానికి నెల ముందుగానే రోహిణి కార్తె నాటి ఎండలు దూసుకొచ్చాయి. ప్రపంచం వేడెక్కుతోంది. మన దేశం మరింత వేగంగా, మన తెలుగు ప్రాంతాలు ఇంకా వేగంగా వేడెక్కిపోతుండడం ప్రకృతి బీభత్స తీవ్రతకు మరో నిదర్శనం. ప్రకృతి మండిపడడానికి గల కారణాలను, వేసవి వహ్ని వీక్షణాలను నిగిడించడతానికి, కారణాలను ఎప్పుడో కవి కనిపెట్టేశాము, విశే్లషించాము, వ్యాఖ్యానించాము. పరిష్కారాలను ఆవిష్కరించాము. ప్రకృతిని మనం పరిమార్చుతుండడం సకల కారణాలకు సమాహారం. దాచేసిన మనపై ప్రకృతి ఎదురుదాడి చేస్తోంది. ప్లాస్టిక్ పుడమికి కలిగించిన గాయాల నుండి రక్తం కారడం లేదు. తాపస్రవంతులు పొంగిపొర్లుతున్నాయి. మంటల ప్రవాహాలు వరదలెత్తుతున్నాయి. ప్రకృతి వేడిగా రోదిస్తోంది. వాడి పొగలను విసర్జిస్తోంది. పరిష్కారం కూడ మనం కనిపెట్టేశాము. పాటించడం లేదు. కాలుష్యపు మంటలను రగిలిస్తున్నాము. మంటల మధ్యలో మనం...
‘‘సమ్రాట్ అశోకుడు నీడనిచ్చే చెట్లను నాటించెను’’ అన్న సాంఘిక శాస్తప్రాఠం ఉష్ణోగ్రతను తగ్గించడానికి గ్రీష్మతాపాన్ని నిరోధించడానికి పచ్చదనం పరిష్కారమన్న గుణపాఠం క్రీస్తునకు పూర్వం పదిహేనవ శతాబ్ది వౌర్య అశోకుడు పూర్వం వేలాది ఏళ్లుగా వికసించిన భారతీయ జీవన విధానాన్ని పరిరక్షించాడు. బ్రిటిష్ వారు మనదేశాన్ని కబళించేవరకు మన పాలకులు ఈ విధానాన్ని అమలు జరిపారు. ప్రకృతిని పరిరక్షించి పెంపొందించడం ఈ విధానం. పచ్చదనం గ్రీష్మతాపాన్ని నిరోధించే ఛత్రం. బ్రిటిష్ దురాక్రమణ దారులు మన చెట్లను విచ్చల విడిగా నరికి వేసి కలపను తరలించుకొని పోయారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోను, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోను అటవీ హననం పరాకాష్ఠకు చేరింది...అడవులు పచ్చదనం తగ్గినకొద్దీ మన భూమి వెచ్చదనం పెరిగింది. వెచ్చదనం బొబ్బలు పుట్టించే వేడిగా మారడం పరాకాష్ఠ. గతంలో కూడ వేసవి మంటలు కక్కింది. కానీ పచ్చని మొక్కలు చెట్లు ఆ వేడిమిని పీల్చుకూని మానవులకు జంతువులకు చల్లదనాన్ని పంచాయి. బ్రిటిష్ దురాక్రమణ ఆరంభమైన నాటికి మన దేశంలోని భూభాగం సగానికి పైగా అడవులతో నిండి ఉండేది. ప్రస్తుతం ఇరవై మూడు శాతం కంటె తక్కువ అటవీ విస్తీర్ణం దిగజారిపోయి ఉంది..
దేశం ప్రతిరోజూ నూటముప్పయి అయిదు హెక్టార్ల అడవులను నష్టపోతున్నదని మూడేళ్ల క్రితం అధికారికంగా గణాంకాలు వెలువడ్డాయి. అడవులు పెంచుతున్నామని, సామాజిక అడవుల పథకాల కింద రోజు ‘అన్ని వేలు, ఇన్ని లక్షలు’ మొక్కలు నాటుతున్నామని దశాబ్దులుగా ప్రచారమైంది. అందువల్ల నరికివేతకు గురి అవుతున్న అడవుల విస్తీర్ణం కంటె కొత్తగా ఏర్పడుతున్న అడవుల విస్తీర్ణం పెరిగి ఉండాలి. కానీ పెరగలేదు. ఇంకా తగ్గుతోంది. ప్రతి దేశంలోను కనీసం ముప్పయి మూడు శాతం భూభాగంలో అడవులు ఉండాలన్నది అంతర్జాతీయ హరిత నియమం. మనదేశంలో ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు శాతం అడవులు ముప్పయి మూడు శాతానికి పెరిగేది ఎప్పుడు? అలా పెరిగినప్పుడు మాత్రమే ఉష్ణోగ్రతను అదుపు చేయడం ప్రకృతికి సాధ్యం కాగలదు. కానీ ప్రపంచీకరణ మొదలైన తరువాత ఈ ప్రక్రియ వ్యతిరేకదిశలో మరింతగా దూసుకొని పోతున్నది. పోస్కో అన్న విదేశీయ సంస్థవారి ప్రత్యేక ఆర్థిక మండలం- సెజ్-ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఏర్పడిన చోట లక్షా డెబ్బయి వేల మహా వృక్షాలను రెండేళ్లలో నరికేశారు. దేశంలో ఏర్పాటు చేస్తున్న వందలాది ప్రత్యేక ఆర్థిక మండలాలలో ప్రతి చోట ఇదే తీరులో వృక్ష హననం జరిగిపోతోంది. పత్యేక ఆర్థికమండలాలను ఏర్పాటు చేస్తున్నట్టే ప్రత్యేక హరిత మండలాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని పూనుకోవడం లేదు. మన్‌మోహన్ సింగ్ ప్రధానిగా ఉండిన సమయంలో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో దాదాపు రెండున్నర లక్షల హెక్టారుల అటవీ భూమిని సెజ్‌ల కోసం అప్పగించింది. వ్యవసాయ భూమి బంజరు భూమి కాక..ఇదే ఐదేళ్లలో ఎన్ని లక్షల హెక్టారులలో అడవులను పెంచారు? హరిత హననం వల్ల మాత్రమే ఎండలు మండిపోతున్నాయని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు దుర్భుద్ధి పూర్వకంగా అడవులను ధ్వంసం చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం పేరిట మొక్కలను పెంచుతోంది. దేశమంతటా మొక్కలు పెరిగినప్పుడు మాత్రమే ఎండల తీవ్రతను ఎదుర్కోగలం..
ప్లాస్టిక్ పదార్థాలు సృష్టించిన వేడికి హిమాలయాలు కరగిపోయి రాళ్ల గుట్టలు ఏర్పడుతున్నాయి. పదమూడు శాతం హిమశకలాలు-మంచు ఖండాలు- ఇప్పటికే కరిగిపోయాయి. ఈ సంగతి సూర్యుని వెలుగంత స్పష్టంగా తెలిసిన ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ను సమూలగా నిర్మూలించడానికి పూనుకొనడం లేదు. ఇసుకకోసం భూమిని తవ్విపారేస్తున్నారు. ఖనిజాల అనే్వషణ పేరుతో కొండలకు కన్నాలు పెట్టేస్తున్నారు. సిమెంటుతో అంతస్థుల భవనాలను నిలువునా పెంచి వేడిని కేంద్రీకరిస్తున్నారు. ప్రకృతిపై ఇలా కొందరు దాడి చేస్తున్నారు. ప్రకృతి అందరిపైనా దాడి చేస్తోంది.