సంపాదకీయం

తెగని నీటి తగవు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న సామెతలో సగం మాత్రమే వర్తమాన వివాదానికి అన్వయవౌతోంది! పిట్టలు రెండు పోట్లాడుకోవడం ఈ సగం.. కృష్ణా జలాలను ఉభయ తెలుగు రాష్ట్రాలు పరస్పరం సామరస్యంగా పంచుకుని ఉండవచ్చు! కానీ జలాలలో ద్వైపాక్షిక వివాద జ్వాలలు చెలరేగడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా పునర్‌ఘటితమైన నాటినుంచి నడచిన కథ! ఉభయ రాష్ట్రాలు పునర్ విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాలను పంచుకొని ప్రశాంతిని సాధించి ఉండనట్టయి, గతంలో జరిగిన అన్యాయాన్ని తొలగించుకోవడానికి కలసికట్టుగా ఎగువ రాష్ట్రాలతో తలపడడానికి వీలుండేది. అలా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య ఏర్పడకపోవడం బుధవారం కృష్ణా జలాల వివాద న్యాయమండలి-కృష్ణా వాటర్ డిస్‌ప్యూట్స్ ట్రిబ్యునల్-కెడబుల్‌యుడిటి- చెప్పిన తీర్పునకు నేపథ్యం! కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయం చారిత్రక వాస్తవం. ఇది కొనసాగుతున్న అన్యాయం. అందువల్ల న్యాయమూర్తి వ్రజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా జల వివాద న్యాయమండలి చేసిన ఈ మధ్యంతర నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలకు కొత్తగా జరిగిన అన్యాయం లేదు. న్యాయమండలి తన తీర్పును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఏర్పడిన తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌లకు పరిమితం చేయడం అనుచితం కాదు! కృష్ణా జలాలను ప రీవాహ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కొత్తగా పంపిణీ చేయాలన్న తెలుగు రాష్ట్రాల వాదం-ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన చారిత్రక అన్యాయం నేపథ్యంలో-సమంజసం కావచ్చు! కానీ ఈ వాదాన్ని వినిపించడానికి ఇది సందర్భం కాదు! అందువల్లనే న్యాయమండలి బహుశా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల వాదాన్ని తోసిపుచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గతంలో కేటాయించిన జలాలను మాత్రమే ఉభయ తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని నిర్దేశించింది! పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలు పరస్పరం పంచుకోవడం ఒక అంశం. గతంలో మూడు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని తొలగించడం రెండవ అంశం! ఈ విడివిడి అంశాల పరిష్కారానికి విడివిడిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు న్యాయ యాచికలను దాఖలు చేసుకోవాలన్నది సామాన్యులకు సైతం అవగతమయ్యే వ్యవహారం. ఉభయ రాష్ట్రాల న్యాయకోవిదులు, న్యాయ సలహాదారులు ఎందుకని తెలుగు ప్రభుత్వాలకు ఈ సంగతిని వివరించలేదో మరి! రెండు అంశాలను కలగాపులగం చేయడం వల్ల మాత్రమే ఉభయ తెలుగు రాష్ట్రాలకు నిరాశ ఎదురైంది!
నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను మరోసారి పంపిణీ చేయాలని తెలుగు రాష్ట్రాలు కోరవచ్చు! అలా పంపిణీ చేయడానికి వీలుగా మరో కొత్త న్యాయమండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు! ఇందుకు మిగిలిన రెండు రాష్ట్రాల అంగీకారం కూడ అవసరం. అలా ఆ రాష్ట్రాలు అంగీకరించకపోతే, 2013లో జరిగిన నీటి కేటాయింపుల నిర్ణయాన్ని సమీక్షించి కొత్తగా నాలుగు రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేయాలని సుప్రీంకోర్టులో అభ్యర్థనను దాఖలు చేయడమే తెలుగు రాష్ట్రాలకు ప్రత్యామ్నాయం. కానీ ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, మహారాష్ట్ర, కర్నాటకలకూ మధ్య రెండుసార్లు కృష్ణా జలాల పంపిణీ జరిగింది. మూడవసారి మళ్లీ సమీక్ష జరిపి నీటిని కేటాయించడం వల్ల తెలుగు రాష్ట్రాలకు అదనంగా కృష్ణా జలాలు లభిస్తాయా? అన్నది అసలు సమస్య. బచావత్ న్యాయమండలి జరిపిన కేటాయింపుల వల్ల కంటె 2013లో రెండవ న్యాయ మండలి జరిపిన కేటాయింపుల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 190 శతకోటి ఘనపుటడుగుల -టిఎమ్‌సి- జలాలు అదనంగా లభిస్తాయి. బచావత్ న్యాయమండలి గతంలో 811 టిఎమ్‌సిలు కేటాయించగా, రెండవ న్యాయ మండలి 1001 టిఎమ్‌సిలు కేటాయించిందట! ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఇంతవరకు 811 టిఎమ్‌సిల నీరు మాత్రమే పంపిణీ జరిగింది. ఇదే నిష్పత్తిలో కొత్తగా లభించిన 190 టిఎమ్‌సిలను సామరస్యపూరితంగా మొదట పంచుకోవచ్చు! ఈ కొత్త కేటాయింపులు ఇంకా అమలులోకి రానేలేదు! ఇలా పంచుకున్న తరువాత నాలుగు రాష్ట్రాల మధ్య జలాల పునర్ విభజనను ఉభయ తెలుగు రాష్ట్రాలు కోరవచ్చు.. అలా కాకుండా రెండు సమస్యలనూ- ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ, గతంలో మూడు రాష్ట్రాల మధ్య జరిగిన కేటాయింపుల సమీక్ష- జంట కట్టడం వల్ల ట్రిబ్యునల్ ఇలా తీర్పు చెప్పడానికి వీలు కలిగింది!
మొదటిసారి జరిగిన కేటాయింపుల వల్ల కంటె రెండవసారి జరిగిన కేటాయింపుల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 190 టిఎమ్‌సిల నీరు అదనంగా లభించినప్పటికీ, కర్నాటక, మహారాష్టల్రకు కూడ గతంలో కంటె 2013లో కేటాయింపులు పెరిగాయి. దీనివల్ల పంచుకున్న జలాల పరిమాణం పెరిగి మిగులు జలాల పరిమాణం తగ్గిపోయింది. మిగులు జలాలు దిగువ రాష్ట్రానికి చెందాలన్న పంపిణీ సూత్రం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు లభిస్తున్న మిగులు జలాలు తగ్గిపోయాయి! అందువల్ల నిజానికి కేటాయింపులను సమీక్షించి పునర్ విభాగం చేయడం వల్ల ఎగువ రాష్ట్రాల కే ఎక్కువ లాభం చేకూరింది! పంపిణీని సమీక్షించాలని ఇతర నదుల ప రీవాహ ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాలు మాత్రమే కోరుతున్నాయి! దేశమంతటా కొనసాగుతున్న ఈ పద్ధతికి భిన్నంగా కృష్ణా పరీవాహ ప్రాంతపు దిగువ రాష్ట్రాలు నీటిని పునర్విభజన చేయాలని కోరడం విచిత్రం. దీనికి ఏకైక కారణం కర్నాటక, మహారాష్టల్రు తమకు లభించిన జలాల కంటె ఎక్కువ పరిమాణంలో నీటిని వాడుకుంటూ ఉండడం. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ అన్యాయాన్ని నిరోధించగలిగితే, ఎగువ రాష్ట్రాలు మిగులు జలాలలో చుక్క కూడ కాజేయలేవు! కానీ ఈ అన్యాయాన్ని నిరోధించడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఘోరంగా విఫలం కావడం చరిత్ర! కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి జలాశయం ఆనకట్ట ఎత్తును కర్నాటక అక్రమంగా పెంచింది! ఆ తరువాత ఇది సక్రమమైపోయింది! గోదావరిపై నిబంధనలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ఆనకట్టలను కూడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరోధించలేకపోయింది. తెలంగాణకు, మహారాష్టక్రు మధ్య కుదిరిన జల సయోధ్య వల్ల ఈ వివాదం ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయింది!
మహారాష్ట్ర-తెలంగాణ సయోధ్య స్ఫూర్తితో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడైనా పరస్పర సోదర భావంతో ఉమ్మడి జలాలను మొదట శాశ్వత ప్రాతిపదికపై పంచుకోవాలి! శ్రీశైలం జలాశయం వద్ద, ఇతర చోట్ల ఉభయ రాష్ట్రాల అధికారులు పరస్పరం తలపడిన చరిత్ర పునరావృత్తం కాకుండా శాశ్వత సయోధ్య నెలకొనాలి! అప్పుడు గతంలో జరిగిన అన్యాయాలను తొలగించుకొనడానికి విడివిడిగా ఉమ్మడిగా ఇతర రాష్ట్రాలతో పోరాడవచ్చు.. ఎగువ రాష్ట్రాలు తమకు లభించిన నీటి కంటె ఎక్కువ వాడుకోకుండా నిరోధించి నియంత్రించగల శాశ్వత పర్యవేక్షక వ్యవస్థ ఇప్పుడైనా ఏర్పడాలి! అలా జరిగినప్పుడు మిగులు జలాలను కర్నాటక కాని, మహారాష్ట్ర కాని కాజేయలేవు. ఈ వ్యవస్థను నెలకొల్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.