సంపాదకీయం

ఘనతలో ‘వాటా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవును కుక్కగా చిత్రీకరించడానికి తస్కర ముష్కరులు చేసిన ప్రయత్నం మరోసారి గుర్తుకువస్తే, అందుకు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వహించవలసివస్తోంది! ప్రాధాన్యం కోల్పోయి మరుగుజ్జులుగా మారి మరుగున పడిపోతున్న రాహుల్‌గాంధీ వంటి మతిలేని రాజకీయవేత్తలకు మళ్లీ ఎంతో కొంత గుర్తింపు రావడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిర్వాహకుల ప్రతిస్పందన దోహదం చేసింది. సెప్టెంబర్ 29వ తేదీన, కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మన సైనిక దళాలు జమ్ము కశ్మీర్‌లోని అధీనరేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌ఓసి-కు ఆవల ఉన్న ప్రాంతంలో నెలకొని ఉన్న జిహాదీ ఉగ్రవాదుల బీభత్సపు స్థావరాలను ధ్వంసం చేశారు! దేశ సరిహద్దులను రక్షించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, అంతర్గత భద్రతను పరిరక్షించడం కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత! ఈ బాధ్యత, ఈ అధికారం సర్వ స్వతంత్ర సార్వభౌమ దేశపు స్వభావంలోనే నిహితమై ఉన్నాయి. ఈ దేశపు ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ఈ సహజ స్వభావ నిహితమైన -నాచురల్లీ ఇన్‌హెరెంట్- వాస్తవానికి ధ్రువీకరణ మాత్రమే! రాజ్యాంగంలోని మూడు వందల యాబయి అయిదవ అధికరణంలో పేర్కొన్న నిర్దేశాలు ఈ ధ్రువీకరణలోని ఒక అంశం! ఏడవ అనుబంధం- షెడ్యూల్- మరో ధ్రువీకరణ! ఇలా దేశ సరిహద్దులను, అంతర్గత భద్రతను నిరంతరం పరిరక్షించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత, విధి నిర్వహణ సక్రమంగా చేసిన ఘనత, విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు బాధ్యత- రెండూ కేంద్ర ప్రభుత్వానివే! రక్షణ దళాలు-సైనిక దళాలు, నౌకాదళాలు, వైమానిక దళాలు, అనుబంధ సైనిక దళాలు-కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ స్వరూపంలో ప్రధానమైన విభాగం! అందువల్లనే ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రైక్- జరిపింది సైనికులు కానీ రాజకీయ పక్షాలవారు కాదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించడం స్వతంత్ర దేశపు సార్వభౌమ స్వభావానికి అనుగుణం..
అందువల్ల ‘ఘనత’ ఎవరిది? ఘనతలో ఎవరికెంత వాటా? అనే విచికిత్స అర్థం లేనిది! ఘనత మొత్తం బీభత్స ముష్కరుల స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులది, సైనికులను ఆదేశించిన ప్రభుత్వానిది! అందువల్ల విజయంలోను, వైఫల్యంలోను విచిత్రమైన వాటాలు లేవు! 1948లో పాకిస్తాన్‌ను తిప్పికొట్టిన ఘనత, జమ్ము కశ్మీర్ పూర్తిగా పాకిస్తాన్ దురాక్రమణనుండి విముక్తం చేయని వైఫల్యం- రెండూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వానివే... 1962లో చైనా వారి దురాక్రమణను తిప్పికొట్టలేని వైఫల్యం కూడా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వానిది.. 1965లో పాకిస్తాన్ దురాక్రమణను తిప్పికొట్టడమే కాక పాకిస్తాన్‌ను మట్టికరిపించి మన రక్షణ పటిమను ధ్రువపరిచిన ఘనత అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ నాయకత్వంలోని ప్రభుత్వానిది! 1971లో పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండను తుదముట్టించడం ద్వారా స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణను సాధించిన పటిమ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిత్వంలోని అప్పటి ప్రభుత్వానిది! అందువల్లనే ఈసర్వసత్తాక సార్వభౌమాధికార దేశ స్వభావంలో నిహితమై ఉన్న బాధ్యతను, ఘనతను తెలిసిన అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పటి ప్రధానమంత్రి ఇందిరను అపరదుర్గగా అభివర్ణించాడు. వాజ్‌పేయి అప్పుడు భారతీయ జనసంఘ్ అధినేత.. ఇందిరాగాంధీకి- ప్రత్యర్థి పక్షానికి చెందిన పార్లమెంటరీ నాయకుడు! ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రక్తపాతపు దళారీ అని నిందించిన రాహుల్‌గాంధీ వంటి దుర్గంధ రాజకీయ దళారులు గ్రహించవలసిన చారిత్రక పాఠం ఇది! 1999లో కార్గిల్‌లోకి చొరబడిన పాకిస్తాన్ కిరాయి హంతకులను, ప్రభుత్వ దళాల రూపంలోని జిహాదీ ఉగ్రవాదులను తిప్పికొట్టిన ఘనత అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ప్రభుత్వానిది! ఈ వౌలిక స్వభావ నిహిత వాస్తవం తెలిసిన వారెవ్వరూ సెప్టెంబర్ 29న జరిగిన సాయుధ చికిత్స నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానిదన్న వాస్తవాన్ని సందేహించరు..
సందేహిస్తున్నట్టు అభినయిస్తున్న వారు నిజానికి సందేహించడం లేదు! సాయుధ చికిత్స జరిగిందన్నది, ఈ చికిత్సను చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నది సూర్యుడు వెలుగును ప్రసాదిస్తున్నాడన్న వాస్తవమంత దృఢంగా ఈ అభినయవేత్తలకు తెలుసు! పదేళ్ల పాలనలో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం చేయలేని చికిత్సను నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయగలిగింది! అందువల్ల ఈ ప్రభుత్వానికి విధిని నిర్వహించిన ఘనత సహజంగానే దక్కింది.. దేశం హితం కోరే విపక్షాల వారికి దీనివల్ల కన్ను కుట్టవలసిన పనిలేదు, కడుపులో మాత్సర్యపు మంటలు చెలరేగవలసిన పనిలేదు! కాని ఈ చౌకబారు ప్రత్యర్థులకు కన్నుకుట్టింది, మాత్సర్యపు మంట రగిలింది. ఫలితంగా ప్రజల దృష్టిలో వారు దేశ విద్రోహులుగా ముద్రపడిపోతున్నారు! అది వారి ఖర్మ... కానీ చౌకబారు సందేహాలను గుప్పించిన వారికి తగిన సమాధానం చెప్పడం పేరుతో ప్రభుత్వ నిర్వాహకులు అతిగా ప్రతిస్పందిస్తున్నారు! వాస్తవాల పట్ల ప్రభుత్వ నిర్వాహకులకు సందేహం లేదు! 29వ తేదీన మన సైనికులు రేఖను దాటి వెళ్లారు. కాని ఈ చర్య వెన్నంటి వేటాడడం-హాట్ పర్స్యూట్-కాదు. ఎందుకంటే ఇతర దేశాలలో నక్కి, మన దేశంలోకి చొరబడి దాడి చేస్తున్న ఉగ్రవాదులను మన సైనికులు ఆయా దేశాలలోకి చొచ్చుకుపోయి తుదముట్టించడం హాట్ పర్స్యూట్.. కానీ అధీన రేఖకు ఆవల ఉన్న కశ్మీర్ కూడా మన దేశంలో భాగం. తాత్కాలికంగా పాకిస్తాన్ దురాక్రమణకు గురై ఉంది! అందువల్ల టెర్రరిస్టులు నక్కి ఉన్న ప్రాంతం మన దేశంలో భాగం.. అందుకనే రేఖ దాటి బీభత్సకారులను దునుమాడిన చర్యను మన సైనికులు హాట్ పర్స్యూట్ అనలేదు. సర్జికల్ స్ట్రయిక్-సాయుధ చికిత్స- అని మాత్రమే అన్నారు! ‘‘అంగవ్రాతమునన్ చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగం శ్రేణికి రక్షసేయు...’’ అని మహాభారతకారుడు చెప్పినట్టుగా సాయుధ చికిత్స జరిగింది..
చికిత్స చేసిన వారు సైనికులు, భరతమాత బాహువులు సైనికులు, అసంఖ్యాక హస్తాలలోని శస్త్రాలు సైనికులు..
అందువల్ల సైనికుల చర్యను అనుమానించడం మాతృభూమిని అవమానించడం! అనుమానించిన విద్రోహులకు సైనికులు బదులు చెప్పవలసిన పనిలేదు, ప్రభుత్వం వివరించవలసిన పనిలేదు. సైనిక చర్యను అనుమానించిన వారిని ఆంతరంగిక భద్రతా చట్టాల ప్రకారం నిర్బంధించి న్యాయస్థానంలో విచారించాలి... ఒక పండితుడు పాడి ఆవును కొనుక్కొని తోలుకుపోతుండేవాడట! నలుగురు దొంగలు దారిలో నాలుగు చోట్ల నిలబడి, అది కుక్క అని పండితునితో చెప్పారట! చివరికి పండితునికి సైతం అది ఆవు కాదన్న అనుమానం కలగడం కథ.. సాయుధ చికిత్స కథలో ప్రభుత్వానికి అనుమానం లేదు! కానీ ‘అతివివరణ’ వల్ల ఇతర దేశాలకు అనుమానం రావచ్చు! అలాగే ‘ఘనత’లో ఎవరికి ఎక్కువ వాటా? ఎవరికి తక్కువ?-అన్న వివరణలు ఎందుకు? రొమ్ము గుద్దుకోవడం-చెస్ట్ థంపింగ్- వద్దని ప్రధాని ఎవరికి సలహా ఇచ్చినట్టు??