సంపాదకీయం

‘ప్రముఖ’ ప్రహసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలోని ప్రాచీన సాంస్కృతిక కేంద్రమైన హాంగ్‌ఝోవూలో సెప్టెంబర్ నాలుగవ, ఐదవ తేదీలలో జరిగిన ఇరవై ప్రముఖ దేశాల -గ్రూప్20- శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ యథాతథ స్థితికి అద్దం పట్టింది. గత ఏడాది టర్కీలోని అంతాల్యాలో జరిగిన జి-20 ప్రభుత్వ అధినేతల సమావేశంలోచర్చకు వచ్చిన ప్రధాన అంశం అంతర్జాతీయ బీభత్సకాండపై జరుగవలసిన ఉమ్మడిపోరాటం. 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బెన్‌లో జరిగిన జి-20 అధినాయక సమావేశంలో సైతం ప్రధానమైన చర్చ అంతర్జాతీయ బీభత్సకాండను ఎదుర్కొనడం గురించి జరిగింది. ఈ రెండేళ్లలో కాని, అంతకుపూర్వం దాదాపు పదిహేను ఏళ్లలోకాని జిహాదీ ఉగ్రవాదంపై పోరాడడానికి అంతర్జాతీయ ఉమ్మడి వ్యూహం ఏర్పడకపోవడం చరిత్ర. ఉగ్రవాదం, గురించి భీభత్సకాండ గురించి సాయుధ తీవ్రవాదం గురించి వీటిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీసుకోదగిన చర్చల గురించి ఐక్యరాజ్య సమితిలోనే నిర్దిష్ట, నిర్దుష్ట నిబంధనలు ఏర్పడకపోవడం ప్రపంచదేశాల ప్రధానంగా ప్రముఖ దేశాల వైఫల్యానికి నిదర్శనం. బీభత్సకాండకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమష్టి సమరం ప్రారంభం కాలేదు. కానీ జిహదీ ఉగ్రవాదం మాత్రం అంతర్జాతీయ స్వరూప స్వభావాన్ని సంతరించుకొంది. ఆసియా,ఐరోపా, ఆప్రికా, అమెరికా ఖండాలకు విస్తరించిన జిహాదీ ఉగ్రవాదులు దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట భయంకర దారుణ మారణకాండను సృష్టిస్తుండడం, గత రెండేళ్ల అనుభవం. జి-20 వేదికపై నుండి ప్రసంగించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ బీభత్సకాండ గురించి ప్రముఖంగా ప్రస్తావించడానికి ఇదీ ప్రధాన నేపథ్యం. జిహాదీ బీభత్సకాండవల్ల దశాబ్దుల తరబడి కష్టనష్టాలకు గురి అవుతున్న దేశాలలో మనదేశం మొదటిది. వివిధ దేశాలు జిహాదీ మతోన్మాదుల మారణకాండకు కొన్ని ఏళ్లపాటు గురి అవుతున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే ఆయా దేశాల్లో బీభత్సకాండకు జిహాదీలు పూనుకొంటున్నారు. కానీ మనదేశంలో జిహాదీ ఉగ్రవ్యూహం నిరంతరం అమలు జరుగుతోంది. దశాబ్దుల తరబడి పాకిస్తాన్ ప్రేరిత జిహాదీలు మనదేశంలో హత్యాకాండ సాగిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇరాక్ సిరియాలలో పుట్టలు పగిలిన ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం -ఐఎస్‌ఐఎస్-ముఠాకు చెందిన విషకీటకాలు ఐరోపాకు ఆఫ్రికాకు అమెరికాకు బంగ్లాదేశ్‌కు విస్తరించడంలో ఉగ్రవాదం, జి-20కి మరింత ప్రధాన సమస్య అయింది. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులకు ఆయుధాలు, శిక్షణ ప్రధానంగా పాకిస్తాన్ నుంచి లభిస్తోంది. సైద్ధాతిక స్ఫూర్తి, ఆర్థిక సహాయం ప్రధానంగా సౌదీ అరేబియా నుంచి లభిస్తోంది, పాకిస్తాన్‌ను చేయి పట్టుకొని నడిపిస్తున్న చైనాలో జి-20 శిఖర సభ జరగడం విచిత్రమైన వ్యవహారం. యథావిధిగా జి-20 సభలో టెర్రరిజాన్ని నిరోధించాలనుకున్న దృఢ సంకల్పం వ్యక్తమైనప్పటికీ చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్ మాత్రం తన ప్రసంగంలో ఈ సమస్యను ప్రస్తావించకపోవడం ప్రస్ఫుటించిన వైపరీత్యం...
హాంగ్‌ఝోవూ వేదికనుంచి మాత్రమే కాదు, గత రెండేళ్లలో జరిగిన ఈ ప్రముఖ దేశాల శిఖర సభలలో సైతం మన ప్రధానమంత్రి భౌతిక బీభత్సకాండను, ఆర్థిక బీభత్సకాండను ప్రధానంగా ప్రస్తావించి ఉన్నాడు. ఇప్పుడు హాంగ్‌ఝోవూలో కూడ నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని, ప్రధానంగా జిహాదీ ఉగ్రవాదాన్ని తుదముట్టించవలసిన అవసరం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అమెరికా ఐరోపా దేశాల ప్రభుత్వాధినేతలు ఉగ్రవాదాన్ని గురించి ప్రస్తావించినప్పటికీ చైనామాత్రం ఉగ్రవాదం తీవ్రతను గుర్తించడానికి నిరాకరించడం హాంగ్‌ఝోవూలో జరిగిన శిఖర సభలో పునరావృత్తం అయిన అపశ్రుతి. మన ప్రధామంత్రి తన ప్రసంగంలో జిహాదీ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న వాస్తవాన్ని స్పష్టంగా ధ్వనింపజేశారు. జి-20 సమావేశాలకు సమాంతరంగా వివిధ దేశాల ప్రభుత్వ అధినేతలతో మన ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఝింగ్‌పింగ్‌తో జరిపిన చర్చలతో మోదీ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు రెండు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాడ మొదటిది. అరేబియా సముద్ర తీరంనుంచి పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్ వరకు పాకిస్తాన్ పొడవునా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆర్థిక మండలం రెండవది.
ఈ రెండు సమస్యలను చైనా పట్టించుకోలేదన్నది స్పష్టం. మన ప్రధాని మాటలను విని చైనా అధ్యక్షుడు సమాధానం చెప్పకుండా వౌనంగా ఉండిపోవడం జి-20 సమావేశానికి సమాంతరంగా సంభవించిన వైపరీత్యం. టెర్రరిస్టులకు వివిధ దేశాలనుంచి అందుతున్న నిధుల గురించి హాంగ్‌ఝోవూలో నరేంద్ర మోదీ ఇతర ప్రముఖ దేశాల దేశాల నాయకులు మరోసారి వివరించారు. ఈ నిధులకు దోహదం చేస్తున్న నల్లడబ్బు గురించి కూడ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వివిధ దేశాల బ్యాంకులలో వివిధ విదేశాలవారు దాచి ఉంచుతున్న నల్లడబ్బును వెలికి తీయడంలో ప్రముఖ దేశాలు ప్రధాన భూమికను పోషించాలన్నది హాంగ్‌ఝోవూలో మోదీ చెప్పిన మాట. బ్రిస్బన్‌లో 2014, నవంబర్ 14వ, 15వ తేదీలలో జరిగిన జి-20 సమావేశంలో మో దీ ఈ నల్లడబ్బును ప్రముఖంగా ప్రస్తావించారు. 2015, నవంబర్ 15వ తేదీనాడు, జి-20 శిఖర సభలో టర్కీలోని అంతాల్యాలో సైతం మోదీ నల్లడబ్బును వెలికితీయడం గురించి సహకారం కోరారు. ఈ రెండేళ్లలో ఈ దిశగా పెద్ద ప్రగతి జరిగిన జాడలేదు. విదేశీయ ఖాతాదారులు దాచిన డబ్బును గోప్యంగా ఉంచే పద్ధతిని వివిధ దేశాల బ్యాంకులు స్వస్తి చెప్పాలని తద్వారా నల్లడబ్బు కామందుల గుట్టు రట్టు చేయాలని బ్రిస్బన్‌లో మోదీ ఇచ్చిన పిలుపును అన్ని దేశాలవారు హర్షించారు. ఇదే పిలుపును హాంగ్‌ఝోవూలో కూడ మోదీ సోమవారం పునరుద్ఘాటించారు.
మోదీ ప్రసంగాన్ని అప్పుడు ఇప్పుడూ కూడ అగ్ర రాజ్యాల అధినేతలు మెచ్చుకున్నారు. భౌతిక బీభత్సకాండ, ఆర్థిక బీభత్సకాండతో ముడివడి ఉంది. బౌతిక జిహాదీ ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతున్న ఆర్థిక ఉగ్రవాదులు సౌదీ అరేబియాలో ఎక్కువగా ఉన్నారన్నది జగద్విదితం. సౌదీ అరేబియా ప్రభుత్వం అధికారికంగా జిహాదీ ఉగ్రవాదాన్ని నిరసిస్తోంది. మిత్రదేశమైన అమెరికాను మెప్పిస్తోంది. కానీ సౌదీ అరేబియాలో సంపన్నుల వేలకోట్ల రూపాయలను జిహాదీలకు అందజేస్తున్నారు. ప్రముఖ దేశాలకూటమి లోని అంతర్గత వైరుధ్యాలలో ఇది ఒకటి మాత్రమే. జి-20 సభకు సమాంతరంగా చైనా అధ్యక్షుడు జరిపిన చర్చలలో నరేంద్రమోదీ బ్రిక్స్, అజెండాను సైతం ప్రస్తావించారు. త్వరలో మనదేశంలో జరుగనున్న ‘‘బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా’-బ్రిక్స్- శిఖర సభలో సైతం బీభత్సకాండను ప్రధాన అంశంగా చర్చించాలన్నది ఝీజింగ్‌పింగ్‌కు మోదీ చెప్పిన మాట. కానీ ఝీజింగ్‌పింగ్ మాత్రం ఉగ్రవాదాన్ని, నల్లడబ్బును పట్టించుకోలేదు. ఆర్థిక సంకుచిత వాదాన్ని విడనాడాలని మాత్రమే ఆయన పిలుపునిచ్చాడు. వివిధ దేశాల ఆర్థిక సంకుచిత -ప్రొటెక్షనిస్ట్- విధానాలవల్ల తమ నాసిరకం వస్తువులు ఆయా దేశాలకు ఎగుమతి కావడం లేదన్నది చైనా అధ్యక్షుడి దుగ్ధ..