సంపాదకీయం

అవినీతి చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలో రాజకీయ, అధికార అవినీతికి వ్యతిరేకంగా భారీ ఎత్తున చర్యలు కొనసాగుతున్నాయన్నది ఇటీవల ప్రముఖంగా ప్రచారవౌతున్న సమాచారం. అవినీతి దశాబ్దులపాటు విస్తరించిపోయిందని వ్యవస్థీకృతమయిందని దీనివల్ల ధ్రువపడిన సంగతి మాత్రం చైనా ప్రభుత్వం వారు, దేశ విదేశాలలోని చైనా ప్రశంసకులు దాటవేస్తున్నారు. ఈ ప్రశంసకులు, చైనా ప్రగతిని అనుకరించాలని ప్రచారం చేస్తున్నవారు మన దేశంలో సైతం దండిగా ఉన్నారు. చైనాకు వెళ్లి ప్రగతి పాఠాలు నేర్చుకుని వస్తున్న మన దేశపు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అధికార అనధికార రాజకీయవేత్తలు చైనాను మనం అనుకరించాలని దశాబ్దులపాటు మన ప్రజలకు బోధిస్తున్నారు. అవినీతిపరులైన అత్యున్నత చైనా రాజకీయవేత్తలు, ఉన్నతోన్నత సైనిక అధికారులు యావజ్జీవ కారాగార గృహ నిర్బంధాలకు గురి కావడం, విచారణ సమయంలో మరణించడం వంటి విషయాలు చైనాకు వెళ్లి వస్తున్న మన ప్రముఖుల దృష్టికి రావడం లేదు. అవినీతి ఆరోపణలకు గురి అయిన ముగ్గురు ఉన్నత సైనిక అధికారులు ఆగస్టు నెలలో ఆత్మహత్య చేసుకొనడం అవినీతి వ్యతిరేక ప్రభుత్వ ఉద్యమానికి పరాకాష్ఠ. వారికంటె పై స్థాయికి చెందిన ఇద్దరు సైనిక అధికారులను ప్రభుత్వం నిర్బంధించిన తరువాత, తమకు కూడ శిక్ష తప్పదన్న భయంతో ఈ ముగ్గురూ ఆత్మహత్యకు పాలుపడినారట! జనరల్ వాంగ్ జియాంగ్‌పింగ్ అనే ఉన్నత సైనిక అధికారిని గురువారం అరెస్టు చేయడం పరాకాష్ఠ! చైనాలో సామ్యవాద నియంతృత్వ వ్యవస్థ-కమ్యూనిస్ట్ డిక్టేటర్‌షిప్-పెట్టుబడిదారీ నియంతృత్వం-కాపిటలిస్ట్ డిక్టేటర్ షిప్-గా రూపు దిద్దుకొనడం చారిత్రక విపరిణామం. చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్టు పార్టీ కారల్‌మార్క్స్ సామ్యవాద ఆర్థిక సూత్రాన్ని విడనాడి దాదాపు ఇరవై ఏళ్లయింది. తమది మార్కెట్ ఎకానమీ-స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ అని చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి పదిహేను ఏళ్లయింది. కాపిటలిస్ట్ వ్యవస్థకు మారుపేరు మార్కెట్ ఎకానమీ. కానీ రష్యాలో లెనిన్, స్టాలిన్ వంటి మార్గదర్శకులు రూపొందించి ప్రదానం చేసిన రాజకీయ నియంతృత్వ వ్యవస్థను మాత్రం చైనా కమ్యూనిస్టు పార్టీ విడనాడలేదు. సామ్యవాద వ్యవస్థ ఉన్నప్పుడు, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ పేరుతో పెట్టుబడిదారుల ఆధిపత్య వ్యవస్థ ఏర్పడిన ఇప్పుడు కూడ చైనాలో రాజకీయ నియంతృత్వం మాత్రం సమానం. కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఏకైక అధికార పక్షం. ఇతర రాజకీయ పక్షాలకు సైతం ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కోరుతూ 1989లో ఉధ్యమించిన వారిని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం గతంలో కనివినీ ఎఱుగని రీతిలో అణిచివేయడం హత్య చేయడం చరిత్ర! అందువల్ల సామ్యవాద శరీరాన్ని వదిలి పెట్టుబడిదారీ దేహంలో ప్రవేశించిన చైనాను నడిపిస్తున్న బుద్ధిమాత్రం రాజకీయ నియంతృత్వం...సామ్యవాదంలోను స్వేచ్ఛావాణిజ్యంలోను సమాన లక్షణం నియంతృత్వం, మరో సమాన లక్షణం భయంకరమైన అవినీతి...
ఎందుకంటే అవినీతికి నియంతృత్వం వౌలికమైన ప్రాతిపదిక. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న దురహంకారం నిహితమై ఉండడం వైయక్తిక అవినీతికి కారణం. పట్టుబడితే ఉద్యోగం, ఉపాధి, అధికారం, పదవి, ఉనికి వంటి వాటిని కోల్పోవాల్సి వస్తుందన్న భయం లేకపోవడం ఈ దురహంకారం. ఈ దురహంకారం వ్యక్తిగత నియంతృత్వం, లెక్కలేని తనం. ఈ దురహంకార ప్రవృత్తి సమష్టి రూపంగా వ్యవస్థీకృతం కావడమే రాజకీయ అధికార నియంతృత్వం. అడిగేవాడు లేని నియంతృత్వ సమాజాలన్నీ అవినీతి చెదలు పుట్టలకు ఆలవాలం కావడం చరిత్ర. కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థలు అవినీతికి రూపాలుగా మారి కూలిపోవడం ఐరోపావారి అనుభవం, రష్యా, మధ్య ఆసియా సమాజాలవారి కఠోర అనుభూతి. చైనా కమ్యూనిస్టు నేతలు తెలివిగా సంస్కరణల పేరుతో సామ్యవాద ఆర్థిక నీతిని తుదముట్టించారు, జనాన్ని తప్పుదారి పట్టించి మార్కెట్ ఎకానమీకి తలుపులు తెరిచారు. అందువల్ల రాజకీయ నియంతృత్వం మాత్రం కొనసాగడానికి ప్రాతిపదిక ఏర్పడింది. యజమానులమయ్యామన్న తృప్తితో గ్రామీణ ప్రాంతాల చిన్న చిన్నభూమిస్వాములు, పట్టణ ప్రాంతాలలోని చిట్టి వ్యాపారులు రాజకీయం మాట మరిచిపోయారు. కానీ సామ్యవాద నియంతృత్వం నాటి ఉన్నత వర్గాల అవినీతి మాత్రం ప్రస్తుత నియంతృత్వ వ్యవస్థకు వారసత్వంగా దాపురించింది. చైనా అధికారులను, ఉన్నత సైనికులను, రాజకీయ వేత్తలను అవినీతి స్వభావం ఆవహించి ఉండడానికి ఇదీ నేపథ్యం.
చైనా ప్రజావిముక్తి సైన్యం-పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పిఎల్‌ఏలోని జనరల్ వాంగ్ జియాంగ్ పింగ్ త్రివిధ సైనిక బలగాల ఉమ్మడి విభాగానికి ఉపాధ్యక్షుడట! ఈ ఉమ్మడి విభాగం కేంద్ర సైనిక సంస్థ-సెంట్రల్‌మిలిటరీ కమిషన్-సిఎమ్‌సి-అధీనంలో పనిచేస్తోంది. సిచుయాన్ ప్రాంతంలోని చెంగ్డూలో ఆధికారిక విధులను నిర్వహిస్తున్న సమయంలో అత్యున్నత అధికారులలో ఒకరైన ఈ జియాంగ్ పియాంగ్‌ను అవినీతి వ్యతిరేక కార్యాచరణ బృందం వారు నిర్బంధించారట. ఆయన భార్యను, కార్యదర్శిని, మాజీ కార్యదర్శిని కూడ అధికారులు అరెస్టు చేయడం ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాల విస్తృతికి తీవ్రతకు నిదర్శనం. ఈ జియాంగ్ పింగ్ గతంలో ఝవ్‌యాంగ్ కాంగ్ అన్న మరో ఉన్నత రాజకీయ సైనిక అధికారికి ఆప్తుడట! ఈ ఝువ్ యాంగ్‌కాంగ్ ప్రస్తుత చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌కు గిట్టని వాడట! అందువల్లనే ఝువ్ యాంగ్ కాంగ్ అప్రతిష్ఠపాలై అధికార పదవులను కోల్పోయాడట! ఝువ్‌యాంగ్ కాంగ్ కూడ ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నాడు. మరో ఇద్దరు మాజీ జనరల్ స్థాయి ఉన్నత ఉద్యోగులు కుయ్యో బాక్సింగ్ ఆంగ్, ఝాకైహోయూ అనేవారిని కూడ అవినీతి అభియోగంపై ఇటీవల నిర్బంధించారు. ఈ నిర్బంధాల తరువాతనే మరో ముగ్గురు ఉన్నత సైనిక అధికారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిర్బంధానికి గురైన ఝాకైహోయు అనే జనరల్ కాన్సర్ వ్యాధిగ్రస్తుడు. అయినా నిర్బంధంలోనే మరణించాడట...
చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ 2013లో ఆరంభించిన అవినీతి వ్యతిరేక అధికార ఉద్యమంలో భాగంగా ఇప్పుడీ ఉన్నత ఉన్నతోన్నత సైనిక అధికారులు నిర్బంధానికి గురి అయ్యారట! మాజీ జనరల్ కుయ్యోబాక్సింగ్ అంగ్‌కు యావజ్జీవ కారాగార వాసం విధించారట! అవినీతి అభియోగాలపై గతంలో అనేకమంది అధికారులను ఉరి తీసి మరణ శిక్ష విధించడం చరిత్ర! కమ్యూనిస్టు పార్టీలోని అంతర్గతకుమ్ములాటలో భాగంగానే అసంతుష్ట వర్గపు అవినీతిపరులను పట్టుకుంటున్నారన్న ఆరోపణలు అతార్కికం కాదు. అధికారం చెలాయిస్తున్న వారికి ఇష్టులైన అవినీతిపరులను నిర్బంధించడం లేదు. వాణిజ్య వ్యవహారాలలో ప్రధానంగా విదేశీయ వాణిజ్యంలో అవినీతిని చైనా ప్రభుత్వమే వ్యవస్థీకరించింది. నాసిరకం చైనా వస్తువులు మన దేశానికి భారీగా దిగుమతి కావడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! మన దేశంలో పులులను చంపి వాటి శరీర అవయవాలను చర్మాలను చైనాకు ఎగుమతి చేసే దొంగరవాణాను చైనా ప్రభుత్వమే ప్రోత్సహించడం దశాబ్దుల వైపరీత్యం. మన దేశంనుండి ఎఱ్ర గంధాన్ని తరలిస్తున్న చైనా ముఠాల సంగతి బహిరంగ రహస్యం! అనుకరుణ వేత్తలకు చైనా చెబుతున్న పాఠం ఇది...