ఆంధ్రప్రదేశ్‌

కరవును పారదోలుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
జల వనరులశాఖ మంత్రి దేవినేని వెల్లడి

విశాఖపట్నం, డిసెంబర్ 24: రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం విశాఖలోని ఎయు కాన్వొకేషన్ హాల్లో నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ ప్రాంతీయ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 5 నెలల వ్యవధిలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయగలిగామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, విజయనగరం జిల్లాలో వేగావతి, చంపావతి నదుల అనుసంధానానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం కృష్ణా డెల్టా ప్రాంతంలో 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయన్నారు. దీనికి 34 టిఎంసిల నీరు అవసరమన్నారు. ఈ పంటలను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్‌వే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. వచ్చే ఏడాదిలో పోలవరం కుడి కాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు తీసుకువచ్చేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చనిపోతున్న రైతులను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమన్నారు. ప్రతి జిల్లా జలవనరులతో కళకళలాడేందుకు ప్రభుత్వం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏడాదిన్నర వ్యవధిలోనే సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు వెచ్చించిందన్నారు. ఈ సదస్సులో మంత్రులు కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు, తదితరులు ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ యువరాజ్, ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.