తెలంగాణ

ఉగ్రవాదులకు మజ్లిస్ మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని కొన్ని చోట్ల ఉగ్రవాదుల కదలికలు ఇటీవల అధికమయ్యాయని, మజ్లిస్ పార్టీ ఇందుకు ప్రోత్సహిస్తోందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆరోపించారు. దేశ ద్రోహులైన ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ సహకరిస్నున్నందునే శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా బిజెపి-టిడిపిల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మజ్లిస్ పార్టీతో తెరాస నేతలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపి,టిడిపి అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. తెరాస నేతలు చెబుతున్నట్టు హైదరాబాద్‌లో అభివృద్ధి కనిపించడం లేదన్నారు.