తెలంగాణ

సాగర్‌కు 2633 క్యూసెక్కుల నీరు చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, డిసెంబర్ 29: శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ జలాశయానికి మంగళవారం 2633క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం 508.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 129.6422 టీయంసీలకు సమానం. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 2490 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 143 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లోగా 2633 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 832.40 అడుగులకు చేరుకుంది. ఇది 62.055 టీయంసీలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది.