తెలంగాణ

రాజ్యసభ ఎన్నికలకు టి.కాంగ్రెస్ వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశంలో నిర్ణయించారు. రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహపడినా సంఖ్యాబలం లేనందున బరిలో నిలిచినా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెరాస మద్దతుతో పోటీ చేయాలని భావించి విహెచ్ దిల్లీ వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాలని అధిష్ఠాన వర్గాన్ని కోరారు. అయితే, బలం లేకుండా ఎన్నికల్లో నిలబడితే పార్టీ ప్రతిష్టకు నష్టం జరుగుతుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.