ఆంధ్రప్రదేశ్‌

సినిమాలకు 48 గంటల్లోనే అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఇకపై సినిమాలకు 48 గంటల్లోనే సింగిల్‌విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయించారు. చిన్న సినిమాలకు ఐదో ఆట వేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలానికి 200 సీట్లతో మినీ కల్చరల్‌ సెంటర్ల ఏర్పాటుకు ఉపసంఘం సిఫార్సు చేసింది. చిత్రపురిలో 9 ఎకరాల స్థలాన్ని కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని, హైదరాబాద్‌లో ఫిల్మ్‌, టీవీ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన భేటీకి మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు, సినీరంగం నుంచి దాసరి నారాయణరావు, మురళీమోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.