రివ్యూ

చల్లచల్లని కూల్ కూల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు

గరం
తారాగణం:
ఆది, అదాశర్మ, తనికెళ్ల భరణి, నరేష్, పోసాని కృష్ణమురళి, మధునందన్, షకలక శంకర్, పృథ్వి, కబీర్ దుహాన్‌సింగ్, చైతన్యకృష్ణ, తదితరులు.
సంగీతం: అగస్త్య
నిర్మాత: పి సురేఖ,
దర్శకత్వం:
మదన్

ఒక మనిషిపై అసూయ పడితే ఒక్కోసారి మంచి కూడా జరుగుతుంది. సహజంగా ఎదుటివాళ్లు తమకన్నా గొప్పగావుంటే వారిని చూసి ఆనందించాలేగానీ అసూయ పడకూడదు. ఒకవేళ అసూయపడినా అది కొంతవరకే ఉండాలి. తనకి నచ్చనివాడు గొప్పవాడవుతున్నాడు అనేటప్పటి అసూయ కన్నా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనుకున్నప్పుడు కలిగే స్నేహం, ప్రేమ గొప్పది అని చెప్పే ప్రయత్నం గరంలో చేశారు.
కథేంటి?
రాంబాబు (తనికెళ్ల భరణి)కు లేకలేక కలిగిన సంతానం వారాల బాబు (ఆది). చక్కగా చదివి ఉద్ధరిస్తాడనుకుంటే దానికి వ్యతిరేకంగా వారాల బాబు ప్రవర్తన సాగుతుంది. ప్రతి ఒక్కర్నీ చూపిస్తూ.. వాళ్లబ్బాయిలా నువ్వు గొప్పవాడివి కావాలి, ఎప్పుడు బాగుపడతావు? అని తండ్రి దెప్పిపొడుస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో తాను గొప్పవాడిని అవుతానంటూ పట్నం వెళ్లిపోతాడు వారాల బాబు. అక్కడ సహస్ర (అదాశర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు నచ్చినట్టుగా వుంటూ, నచ్చిన పనులు చేస్తూ ఎలాగైనా సరే ఆమె ప్రేమ పొందడానికి చేసే ప్రయత్నాల్లో సగం సినిమా ముగుస్తుంది. అక్కడినుంచి అసలు కథలోకి వెళ్లారు. వారాలబాబు పట్నం వచ్చింది ఉద్యోగం కోసం కాదని, తాను అసూయపడేంతగా ఎదిగిన పక్కింటి కుర్రాడు పట్నంవెళ్లి, తిరిగి రాకపోవడంతో అతన్ని వెతకడం కోసం వచ్చానని చెబుతాడు. పట్నం వెళ్లిన తన స్నేహితుడు ఏమయ్యాడు? అతనికోసం ఊరిలో ఎదురుచూస్తున్న నరేష్ దంపతులు కొడుకు కోసం ఎలా ఎదురు చూస్తున్నారు? వారి వేదనను దూరం చేయడానికి తాను ఈర్ష్యపడే స్నేహితుణ్ణి వారాలబాబు కలుసుకున్నాడా? చివరికి అతని తల్లిదండ్రులకు అప్పగించాడా? లేదా అనే కథనపై మిగతా సగం సినిమా.
ఎలా వుంది?
మొదటినుండి ఆది డాన్సులు, ఫైట్లు, డైలాగులు కోసమే సినిమా అంతా చుట్టినట్టుగా అనిపిస్తుంది. కథనంలో ఒక్క పాయింట్ మంచిది ఉంటే సరిపోదు, సినిమా అంతా అది అందరికీ నచ్చేలా దర్శకుడు అల్లుకోగలగాలి. ఆ విషయంలో నూరు శాతం ఫెయిలయ్యారు. దర్శకుడు మదన్‌కు పట్టులేని మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఏ సన్నివేశంలో కూడా పట్టు సాధించలేకపోయాడు. ప్రతి సన్నివేశాన్నీ కథనంతో అతికించినట్టుగానే ఉంది. ముఖ్యంగా లచ్చుమక్క గోల, బురఖాల వ్యవహారం, దయ్యాల గోల, ఇంగ్లీష్ నేర్చుకోవాలనే యావ ఇలాంటివన్నీ సినిమా సమయాన్ని పెంచినవేకానీ కథాకథనాలకు ఏమాత్రం ఉపయోగం లేనివిగా మారాయి. స్ఫూఫ్‌లు, అనేక చిత్రాల్లో వచ్చిన రొటీన్ యాక్షన్ పోకడలపై ఆధారపడి హాస్యాన్ని సృష్టించాలనుకున్నారు. కానీ అది వికటించింది. ముఖ్యంగా గూగుల్ (బ్రహ్మానందం)ను చివరలో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్న పేషంట్ అని చెప్పారు. అయితే అతీంద్రియ శక్తులతో ఎదుటి వ్యక్తిలో ఏముందో మెంటల్ పేషంట్లు ఎలా చెప్పగలరో కథాకథనాలు రాసుకున్నవారే చెప్పాలి. అసలు సినిమా మొదలైందే ఈ పాయింట్‌నుండి. మరి ఆ పాయింటే పిచ్చిదైనప్పుడు ఇక సినిమా విషయం ఏంటి? ఓ పెద్ద కంపెనీ స్థాపించి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైన వ్యక్తి హత్య జరిగితే వాటిని మీడియాగానీ, పోలీసులుగానీ అస్సలు పట్టించుకోరా? ఎక్కడినుంచో ఊరినుంచి వచ్చిన ఓ వారాల అబ్బాయి పట్టించుకుంటాడా? అనేక దొమీలు జరిగి, ఫైట్స్ పూర్తయ్యాక అనేకమంది చస్తే ఒక్క పోలీసూ రాడా? కమర్షియల్ ఎంటర్‌టైనర్ అంటే ఇంతే ఉంటుందేమో? -సినిమాలను విశే్లషించగలస్థాయికి ఎదిగిన ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలివి. ఉన్నంతలో పల్లెటూరిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన సన్నివేశాలే కొద్దోగొప్పో ఆకట్టుకుంటాయి. నరేష్, తనికెళ్ల భరణిలు ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎలా బతకాలో నేర్పకుండా, ఎలా ర్యాంకులు సంపాదించాలో చెప్పే తల్లిదండ్రులు ఉన్నంతకాలం వ్యవస్థ ఇలాగే ఉంటుంది. అనాథాశ్రమం పెట్టుకో, అనాథలకు తండ్రవ్వు, వృద్ధాశ్రమం పెట్టుకో, వృద్ధులకు కొడుకవ్వు లాంటి మాటలే ప్రధానంగా తీసుకుని ఈ కథను చక్కగా అల్లుకోవచ్చు మదన్ స్టయిల్‌లో! అలాకాకుండా మొత్తం కమర్షియల్ బుర్రతో ఆలోచించడంతో అది కాస్త పిచ్చుకలు వేసిన పందిరిగా మారింది. ఇక నటీనటుల విషయంలో ఆది తాను టార్గెట్ చేసిన డాన్సులు, యాక్షన్, ఫైట్స్ విషయంలో ఓకె అనిపించాడు.
అదాశర్మ ఎంపిక సరైంది కాదు. ఆమె ఎక్కడా కూడా ఎటువంటి మెరుపులు మెరిపించలేకపోయింది. పృథ్వి, తా.రమేష్, పోసాని, బ్రహ్మానందం లాంటివాళ్లు నవ్వించడానికి విఫల ప్రయత్నం చేశారు. ఉన్నంతలో షకలక శంకర్, మధునందన్ ఓకె. విలన్ బిజ్జూగా కబీర్‌దుహాన్‌సింగ్ భయపెట్టే ప్రయత్నం చేశాడు. అవసరం మనిషికి ప్రధానమైన శత్రువులాంటి మాటలు అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. కెమెరా యాక్షన్ సన్నివేశాల్లో తడబడింది. ఎడిటింగ్ పూర్. పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అసలే నీరసమైన కథనంలో మరికాస్త ఇబ్బంది పెట్టాయి అంతే!

- శేఖర్