తెలంగాణ

నీళ్లలో నడిచే బస్సులొస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ 15 నాటికి అందుబాటులోకి..
సాంస్కృతిక శాఖ నిర్ణయం
హైదరాబాద్, మార్చి 10: నగరంలో హెలీ టూరిజం విజయవంతం కావడంతో ఉత్సాహంగా ఉన్న పర్యాటక శాఖ నీటిలో నడిచే బస్సును తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. రోడ్లపైన, నీటిలో నడిచే బస్సులు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో టూరిజం అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌కు ఆ బస్సులను తీసుకు రానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక విధానాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు గిరిజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయా శాఖలపై ఆయన సమీక్ష జరిపారు. త్వరలోనే ఈ విభాగాల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. హెలీ టూరిజం విజయవంతం కావడంతో ఏప్రిల్ 15 నుంచి సీ ప్లేన్‌ను నడపనున్నట్టు మంత్రి చెప్పారు. వరంగల్ జిల్లాలో కాకతీయ ఉత్సవాలు, హైదరాబాద్‌లో గోల్కొండ ఉత్సవాలు, కరీంనగర్‌లో శాతవాహన, వేములవాడలో చాళుక్యుల ఉత్సవాలను నిర్వహించేందుకు అవసరం అయిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయా విభాగాల అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని సంగీత కళాశాలల్లో పేరిణి నృత్యంపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. రవీంద్ర భారతి మరమ్మత్తులు ఈనెల 24 లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టనా చోంగ్తు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.