తెలంగాణ

భూపాలపల్లికి 150 ఏళ్ల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.3 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాల గుర్తింపు
తలమానికం కాకతీయ గనులు
సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని
ఏరియా కార్మిక సంఘాల నేతల డిమాండ్
పరకాల, డిసెంబర్ 29: వరంగల్ జిల్లా భూపాలపల్లికి 150 ఏళ్ల భవిష్యత్తు ఉందని సింగరేణి అధికారులు గుర్తించారు. 1.3 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను ఏరియాలో గుర్తిం చారు. కరీంనగర్ నుండి ఖమ్మం మధ్యన జిల్లాలో 52 కిలోమీటర్ల పొడవునా బొగ్గు నిక్షేపాలను సింగరేణి యాజమాన్యం గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా భూపాలపల్లి ఏరియాలో బి గ్రేడ్ బొగ్గు ఇక్కడి గనుల్లో ఉందని, ఈ తరహా బొగ్గు సింగరేణిలో ఎక్కడా లేదని వారు భావిస్తున్నారు. రెండు సిమ్‌లలో ఒక సిమ్ ఖచ్చితంగా బి గ్రేడ్ లాంటి అత్యంత నాణ్యమైన బొగ్గు ఉందని అధికారులు భావిస్తున్నారు. దీని విలువ 5 వేలకు టన్నులు ఉంటుందని ఏరియాకు గుండెకాయ అవుతుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
తలమానికం కాకతీయ గనులు
భూపాలపల్లి ఏరియాలో 1988 జూలై 17న కెటికె 1వ గని ప్రారంభించారు. ఇలా మొదలైన ప్రస్థానం కెటికె 2, కెటికె 5, కెటికె 6, ఒక లాంగ్‌వాల్ ప్రాజెక్ట్, ఒక ఉపరితల గని వరకు చేరుకుంది. మరో 10 గనుల ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందులో తాటిచర్ల-2 ఉపరితల గని 50 ఏళ్ల అతి పెద్ద ఉపరితల గనిగా ఆవిర్భవించబోతోందని, రానున్న రోజుల్లో ఏడాదికి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుందని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. దీంతో సింగరేణి కంపెనికే భూపాలపల్లి ఏరియా తలమానికంగా మారనుంది. ఈ ఏడాదికి సుమారుగా 33 లక్షల టన్నుల బొగ్గు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రధాన కార్యాలయ ఏర్పాటుపై..
1.3 మిలియన్ బొగ్గును కలిగి ఉండి దాదాపు 150 సంవత్సరాల భవిష్యత్ భూపాలపల్లి ఏరియాకు ఉండడంతో భూపాలపల్లి ప్రాంతం లో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏరియా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం కూడా గతంలో భూపాలపల్లినే సింగరేణి హెడ్‌క్వార్టర్‌గా గుర్తించాలని కూడా ప్రతిపాదన కూడా చేసింది. కానీ ఆ ప్రతిపాదన అమలు చేయలేదు. అయితే భూపాలపల్లి జిల్లా కేంద్రంగా కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉండడంతో భూపాలపల్లిలో సింగరేణి ప్రధాన కార్యాలయ ఏర్పాటుపై నజర్ పెట్టాలని ఏరియా సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా కోల్‌బెల్ట్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భూపాలపల్లి అన్నింటికీ కేంద్రంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ కార్మిక సంఘాలు, కార్మికులు సైతం సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెం బదులు భూపాలపల్లిలో ఏర్పాటు చేయడం ద్వారా అటు కార్మికులకు, ఇటు అధికారులకు, ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఏరియా కార్మిక సంఘా ల నేతలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సింగరేణి ప్రధాన కార్యాలయ ఏర్పాటు చేయడానికి స్థలం కూడా పుష్కలంగా ఉందని, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చొరవ తీసుకుంటే సింగరేణి ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు బీజం పడుతుందని వారు భావిస్తున్నారు.