Others

పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి గుడ్ బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాలు తదితర పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి ఇక తాను స్వస్తి చెబుతానని బాలీవుడ్ శృంగార భామ సన్నీ లియోన్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. గతంలో నీలిచిత్రాల నటిగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె 2012లో బాలీవుడ్‌లో అడుగుపెట్టాక వివాదాలకు, సంచలనాలకు క్రమంగా దూరంగా ఉంటోంది. భారతీయులకు సంబంధించి గత ఏడాది ‘గూగుల్ సెర్చి’లో ముందువరసలో నిలిచిన ఈ 34 ఏళ్ల ముద్దుగుమ్మ తాజాగా దిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో ఇక కనిపించనని స్పష్టం చేసింది. ఇప్పటికే ఓ ప్రముఖ పాన్ మసాలాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తాను సంబంధిత కంపెనీతో చర్చించి ఆ ప్రకటనను నిలిపివేసేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించింది. పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి బాలీవుడ్ నటీనటులు దూరంగా ఉండాలని దిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సన్నీ సానుకూలంగా స్పందించింది. నోటి క్యాన్సర్లకు కారణమవుతున్న పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి సహకరించవద్దని ఇటీవల దిల్లీ సర్కారు బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవ్‌గన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్, గోవిందా, అర్బాజ్ ఖాన్, సన్నీ లియోన్‌లకు విజ్ఞప్తి చేసింది. పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కాల వినియోగంతో ఏటా లక్షలాది మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారని, పొగాకు వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ దిల్లీ ప్రభుత్వం బాలీవుడ్ నటీనటులను కోరింది. మన దేశంలో క్యాన్సర్ మరణాల్లో 40 శాతం వరకూ పొగాకు ఉత్పత్తులే కారణమవుతున్నాయి. నోటి క్యాన్సర్లకు 90 శాతం, క్షయవ్యాధికి 30 శాతం వరకూ ధూమపానం, పాన్‌మసాలాలు కారణమవుతున్నాయి. దేశ జనాభాలో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నవారి సంఖ్య 275 మిలియన్లు (పెద్దవారిలో 35 శాతం మంది, పిల్లల్లో 14.1 శాతం మంది) అని గణాంకాలు చెబుతున్నాయి. సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నందున పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కాలు, మద్యం వినియోగించేందుకు యువత మొగ్గు చూపుతోంది. సినీ ప్రముఖులు పొగాకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటే యువతలో మార్పు వచ్చే అవకాశం ఉందని దిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.