తెలంగాణ

భద్రాద్రిలో ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సచివాలయంలో సోమవారం మంత్రులిద్దరూ అధికారులతో సమీక్ష జరిపి, భద్రాద్రిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. కల్యాణోత్సవానికి సిఎం కెసిఆర్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ప్రభుత్వ సలహాదారు పివి రమణాచారి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.