తెలంగాణ

భక్తులకో న్యాయం.. బంధువులకో న్యాయమా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం బృందం, ఫిబ్రవరి 19: మేడారం జాతరలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ ఉద్యోగుల తీరు విమర్శలకు దారితీస్తుంది. తల్లుల దర్శనానికి వచ్చే భక్త జనానికి వారి తీరు చుక్కలు చూపిస్తుంది. తమ కుటుంబ సభ్యులు, బంధువులను రాచమర్యాదలతో స్వాగతం పలుకుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క రాకతో క్యూలైన్‌ల వద్ద భక్తులు గంటలతరపడి వేచి ఉన్నారు. అయినప్పటికీ తల్లుల దర్శనం కష్టంగానే మారింది. ఒక పక్క తల్లుల దర్శనం కోసం సాధారణ భక్తజనం అష్టకష్టాలు పడుతూ గంటల కొద్ది క్యూలైన్‌లలో వేచి ఉంటుంటే, బాధ్యత గల కొంతమంది అధికారులు మాత్రం అవేమి పట్టకుండా తమ కుటుంబసభ్యుల, బంధుమిత్రుల సేవలో మునిగితేలారు. జాతరలో అమ్మవార్ల మహాప్రసాదంగా భావించే బంగారం (బెల్లం)ను ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీ. కానీ ఈ ఏడు బెల్లం పోగు చేసుకునేందుకు కాంట్రాక్టు ఇవ్వడం, దీనికి తోడు గద్దెల చుట్టూ మరో కంచె నిర్మించడం భక్తులకు తృప్తిలేకుండా పోయింది. అక్కడ ఉన్న వాలంటీర్లు, బెల్లం గుత్తేదారు మనుషులు, పోలీసులు ఉండి కనీసం బెల్లం ముక్కను కూడా ఇవ్వని పరిస్థితి. అదే శాఖల అధికారుల చుట్టాలకు, బంధుమిత్రుల గణానికి ఇష్టమొచ్చినంత బెల్లాన్ని ఇస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
సమ్మక్క గద్దెపై పోలీసుల హల్‌చల్
జాతరలో ముఖ్య ఘట్టమైన సమ్మక్క రాకకు మేడారంతో పాటు ప్రపంచం యావత్తు దృష్టిసారించింది. ఇదే సమయంలో రోప్‌పార్టీ పోలీసులు భక్తులను నెట్టివేస్తూ ఓవర్‌యాక్షన్ చేసారని భక్తులు ఆరోపిస్తున్నారు. అట్టహాసంగా మేడారం గద్దెపైకి చేరుకున్న సమయంలో పోలీసులు బందోబస్తుపేరుతో పూజారులతో పాటు పోలీసులు గద్దెపైకి చేరుకున్నారు. ఈ ఏడు ఆదివాసీల డిమాండ్ మేరకు అమ్మను గద్దెను అధిష్టించే సమయంలో లైట్లు బంద్ చేసారు. అనంతరం పూజారుల సాంప్రదాయ పూజల అనంతరం గద్దెను దిగి వెళ్లిపోయారు. లైట్లు వేసి గద్దె ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు మైక్‌లలో విన్నవించినా, ఖాళీ చేయించాల్సిన పోలీసులు మాత్రం గద్దె దిగకపోవడంతో పాటు, అమ్మవారిని నిలిపిన చెట్టుబెరడును తుంచడం మొదలెట్టారు. దీంతో తుడుందెబ్బ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా పైకి చేరి పోలీసులను గద్దెను ఖాళీ చేయించడం గమనార్హం. ఓ దశలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదివాసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అతని కుమారుడిపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించడం దానిని నిరసిస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో గద్దెల ప్రాంగణం వెనుక ధర్నా నిర్వహించడం, ధర్నా చేస్తున్న తుడుందెబ్బ నాయకులతో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా చర్చలు జరిపి ధర్నాను విరమింపజేసిన సంగతి తెలిసిందే.