ఆంధ్రప్రదేశ్‌

బిసిలకు బాబు బుజ్జగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: కాపులను బిసిలుగా గుర్తించే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా బిసి సంఘాలు రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా ఉద్యమాలకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ముస్లిం నేతలు మహాగర్జన నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. బిసి-ఇ గ్రూప్‌లో తమకున్న నాలుగు రిజర్వేషన్లను ఏకంగా 8 శాతానికి పెంచాలని, ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల నిధి సమకూర్చాలంటూ వైకాపా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నాయకత్వంలో గురువారం ముఖ్యమంత్రిని కల్సి అల్టిమేటం ఇచ్చారు. అసలు ముస్లింల రిజర్వేషన్లు నిలబడగలవా లేవా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టేపై రాష్ట్రంలో ముస్లిం కార్పొరేషన్లు కొనసాగుతున్నాయి. రేపో మాపో తుది విచారణ జరుగబోతుంటే ఏమవుతుందోనని ముఖ్యమంత్రి కూడా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బలహీనవర్గాలను దరిచేర్చుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి శనివారం విజయవాడలో మెగా రుణమేలాను నిర్వహించబోతున్నారు. చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద రాష్ట్రంలోని 34వేల 193 మంది లబ్ధిదారులకు రూ.261 కోట్ల మేర రుణాలను అందించేందుకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం భారీఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10వేల మందిపైగా బిసిలను సమీకరించే ప్రయత్నంలో మంత్రులు నిమగ్నమై ఉన్నారు. ఈ లబ్ధిదారులకు అందించే సొమ్ములో 50 శాతం సబ్సిడీగా 50 శాతం రుణంగా అవకాశం కల్పిస్తున్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా 26వేల మందికి రూ.218 కోట్లమేర, అలాగే బిసి ఫెడరేషన్ ద్వారా 6వేల 153 మందికి రూ.33 కోట్ల మేర రుణాలు అందచేయనున్నారు. పేరుకు రుణమేలా అయినప్పటికీ సిఎం చంద్రబాబు మాత్రం బిసి వర్గాలకు ప్రభుత్వపరంగా ఏమి జరుగుతోందీ, జరుగనుందీ కూడా స్పష్టం చేయాలన్నారు. ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్‌లు కల్పించినప్పటికీ బిసిలకు ఏ విధంగా నష్టం జరుగకుండా ఏమి చర్యలు తీసుకోబోతోంది కూడా వివరించనున్నారని తెలిసింది. బిసి సంఘాల నేతలు బిసి వర్గాల్లోకి చొచ్చుకొని వెళ్లకముందే బిసిలను ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. తెలంగాణకు చెందిన టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అయితే ఏకంగా చంద్రబాబుపై సవాల్ విసురుతూ జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం జరుగబోయే బిసి మెగా రుణమేలాను విజయవంతం చేసేందుకై ముఖ్యంగా మంత్రులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.